మళ్లీ తెగించిన హీరోయిన్ శ్రీయ: థైస్ కంటే పైకి కనిపించే డ్రెస్‌లో!

తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది భామలు మాత్రమే సుదీర్ఘ కాలం పాటు హవాను చూపించి స్టార్ హీరోయిన్లుగా వెలుగొందారు. అలాంటి వారిలో టాలెంటెడ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ శ్రీయ సరన్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ భామ.. అతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుని సత్తా చాటింది. ఫలితంగా ఇప్పటికీ ఆఫర్లను అందుకుంటూనే ఉంది. ఇక, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో హడావిడి చేస్తోన్న శ్రీయ సరన్.. తాజాగా కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి!

అలా ఎంట్రీ.. యమ పాపులర్

అలా ఎంట్రీ.. యమ పాపులర్

హీరోయిన్‌గా పరిచయం అవడానికి ముందే మోడల్‌గా ప్రయాణాన్ని మొదలెట్టిన శ్రీయ సరన్.. 'ఇష్టం' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ వెంటనే 'సంతోషం' అనే చిత్రంతో కెరీర్‌లో తొలి విజయాన్ని అందుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ భామ.. వరుస పెట్టి సినిమాలు చేస్తూ హవా చూపింది. అలాగే, ఎన్నో హిట్లు, రికార్డులను ఖాతాలో వేసుకుంది.

తెలుగుతో పాటు వాటిలోనూ

తెలుగుతో పాటు వాటిలోనూ

తెలుగులో చాలా కాలం పాటు ప్రభావాన్ని చూపించిన శ్రీయ సరన్.. ఇక్కడి స్టార్ హీరోలు అందరితోనూ సినిమాలు చేసింది. దీంతో తన మార్కును చూపిస్తూనే వచ్చింది. ఇక, తన కెరీర్‌లో శ్రీయ తెలుగులోనే కాదు.. దక్షిణాది భాషల్లోనూ చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా రాణించింది. అలాగే, బాలీవుడ్‌లోనూ ఈ బ్యూటీ పలు సినిమాలు చేసింది. ఇలా దేశ వ్యాప్తంగా తన రేంజ్ పెంచుకుంది.

లవ్ మ్యారేజ్.. తల్లైన శ్రీయ

లవ్ మ్యారేజ్.. తల్లైన శ్రీయ

వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌తో కొనసాగుతోన్న సమయంలోనే శ్రీయ సరన్.. ఆండ్రీ అనే రష్యన్‌తో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన తర్వాత.. అంటే 2018లో అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని అనౌన్స్ చేసింది. దీంతో ఆమె అభిమానులతో పాటు అందరూ అవాక్కయ్యారు.

గత ఏడాది ఆ సినిమాలతో

గత ఏడాది ఆ సినిమాలతో

ఎన్నో ఏళ్ల పాటు ఏకధాటిగా సినిమాలు చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో పెద్దగా సందడి చేయడం లేదు. కానీ, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం', RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా ఆఫర్లు దక్కడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవలే ఈ స్టార్ హీరోయిన్ 'దృశ్యం 2'తో భారీ హిట్‌ కొట్టేసింది.

సోషల్ మీడియాలో సందడి

సోషల్ మీడియాలో సందడి


సౌతిండియాతో పాటు నార్త్‌లోనూ ఎఫెక్ట్ చూపిస్తూ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా గడిపిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో ఆశించిన రీతిలో ఆఫర్లను అందుకోవట్లేదు. కానీ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటోంది. అంతేకాదు, ఇందులో తనకు తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. దీంతో ఆమె క్రేజ్ పెరుగుతోంది.

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

హాట్ ట్రీట్‌తో రెచ్చగొడుతూ

సోషల్ మీడియాలో ఎంతో కాలంగా తెగ సందడి చేసేస్తోన్న శ్రీయ సరన్.. ఇందులో ఎక్కువగా అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లను రెచ్చగొడుతోంది. ఇందులో భాగంగానే తన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను తరచూ వదులుతోంది. అలాగే భర్తతో ఎంజాయ్ చేస్తోన్న, రొమాంటిక్ పిక్‌లను కూడా షేర్ చేస్తోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూ ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోంది.

శ్రీయ సరన్ ఘాటు ఫోజులు

శ్రీయ సరన్ ఘాటు ఫోజులు


క్యూట్ హీరోయిన్ శ్రీయ సరన్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్టైలిష్ డ్రెస్‌ను ధరించి క్లీవేజ్, థైస్ షోతో రచ్చ చేస్తోంది. అంతేకాదు, రకరకాల భంగిమల్లో ఫోజులు ఇచ్చి మరీ రెచ్చగొడుతోంది. ఫలితంగా శ్రీయ అందాలు చూపరులకు కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ ఫొటోలకు మంచి స్పందన వచ్చి వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X