పబ్లిక్‌గా నాగ్ హీరోయిన్ పాడు పనులు .. అతనితో రొమాన్స్ చేస్తూ కెమెరాలకు దొరికిన బ్యూటీ

సినిమా సమాజంపై చూపే ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. నటీనటులను అభిమానులు దేవుళ్ల మాదిరిగా కొలుస్తారు. తారాగణం వేషభాషలను గమనించే ప్రజలు వారిని అనుకరించేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి నటీనటులు ఏదైనా పని చేసేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించాలి. అలాంటిది హీరోలు, హీరోయిన్లు పబ్లిక్ ప్లేస్‌లో హద్దులు మీరుతున్నారు. తాజాగా ఓ సీనియర్ హీరోయిన్ పబ్లిక్‌గా మీడియా ముందే రొమాన్స్‌కి దిగింది. ఈ వివరాల్లోకి వెళితే :

ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను తన అందం, అభినయంతో ఒక ఊపారు శ్రీయా శరణ్. సౌత్‌లోని టాప్ స్టార్స్ నుంచి అప్‌కమింగ్ యంగ్ హీరోల సరసన నటించి ఆకట్టుకున్నారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన శ్రీయ.. ఆపై సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఇష్టం సినిమాతో తెలుగు వారిని పలకరించగా.. ఆ మూవీ నిరాశపరిచింది. అయితే శ్రియా మాత్రం తన క్యూట్ లుక్స్, యాక్టింగ్ స్కిల్స్‌తో వరుస అవకాశాలను దక్కించుకుని స్టార్ హీరోయిన్‌గా దూసుకెళ్లారు.

Actress shriya saran public liplock with her husband Andrei koscheev at Deepavali event in Mumbai

నాగార్జున, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్‌, పవన్ కళ్యాణ్, మహేశ్‌ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌, ప్రభాస్, రజనీకాంత్, విక్రమ్ వంటి అగ్ర నటులందరితో నటించారు శ్రీయ. హీరోయిన్‌గా టాప్ రేంజ్‌లో ఉన్నప్పుడే .. ఐటెం సాంగ్స్ చేసి కొత్త ట్రెండ్ సెట్ చేశారు శ్రీయా శరణ్. తన డ్యాన్సింగ్ స్కిల్స్, చురకత్తుల్లాంటి చూపులతో ఎన్నో స్పెషల్ సాంగ్స్ చేసి మాస్‌ను ఒక ఊపు ఊపారు. ఇప్పుడు ఆమె చూపిన బాటలో తమన్నా, సమంత, కాజల్ వంటి హీరోయిన్లు నడుస్తూ కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు.

20 ఏళ్లకు పైగా కెరీర్‌లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు శ్రీయ. ది అదర్ ఎండ్ ఆఫ్ ద లైన్, కుకింగ్ విత్ స్టెల్లా, మిడ్ నైట్ చిల్డ్రన్ వంటి ఇంగ్లీష్ సినిమాల్లోనూ కనిపించారు. 2018 మార్చి 12న రష్యాకు చెందిన ఆండ్రే కొశ్చీవ్‌ను ప్రేమ వివాహం చేసుకున్నారు శ్రియా. ఈ దంపతులకు ఒక పాప. ఇక 40 ప్లస్‌లో తన అందాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ కుర్ర హీరోయిన్లను మించి గ్లామర్‌గా కనిపిస్తున్నారు.

అలాంటి శ్రీయా ఓ వివాదంలో చిక్కుకున్నారు. దీపావళి పర్వదినం సందర్భంగా ముంబైలో జరిగిన ఈవెంట్‌లో తన భర్తతో కలిసి మెరిసిన శ్రీయ ఫోటోలకు ఫోజులిచ్చింది. అక్కడితో ఆగితే బాగనే ఉండేది కానీ అలా అయితే ఆమె శ్రీయ ఎందుకవుతుంది. స్టేజ్ మీదే భర్తకి లిప్ లాక్ ఇచ్చి సంబరపడిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. పబ్లిక్ ప్లేస్‌లో ఎలా నడుచుకోవాలో శ్రీయకు ట్రైనింగ్ ఇవ్వాలంటూ నెటిజన్లు ట్రోలింగ్‌కు దిగారు.

ఇప్పుడే కాదు గతంలోనూ శ్రీయా తన భర్తతో కలిసి ఎక్కడికెళ్లిన లిప్ కిస్ ఇచ్చుకోవడం సాధారణంగా మారింది. మొన్నామధ్య దృశ్యం 2 మూవీ స్క్రీనింగ్ సందర్భంగా రెడ్ కార్పెట్‌పై ఇద్దరూ లిప్ లాక్ ఇచ్చుకోగా పెద్ద దుమారం రేగింది. అయినప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా శ్రీయ మరోసారి పబ్లిక్‌గా ముద్ధుల్లో మునిగి తేలడంతో నెటిజన్లు భగ్గుమంటున్నారు.

More from Filmibeat

Read more about: shriya saran andrei koscheev
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X