పబ్లిక్ ప్లేస్‌లో రెచ్చిపోయిన శ్రీయ: అతడి నోట్లో నోరు పెట్టేసి మరీ!

టాలీవుడ్‌లో ఎంతో మంది హీరోయిన్లుగా వచ్చినా.. అందులో కొందరు మాత్రమే అన్నింటినీ దాటుకుని స్టార్లుగా ఎదుగుతున్నారు. తద్వారా చాలా కాలం పాటు ఇండస్ట్రీలో హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి శ్రీయ సరన్ ఒకరు. సాదాసీదాగానే సినిమాల్లోకి వచ్చిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. తద్వారా ఎన్నో ఏళ్ల పాటు వరుస చిత్రాలతో సత్తా చాటింది. ఇక, ఈ మధ్య కాలంలో సినిమాల వేగం తగ్గించిన శ్రీయ.. సోషల్ మీడియాలో రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రొమాంటిక్ పిక్ వదిలింది. దాన్ని మీరే చూడండి!

 అలా వచ్చింది... ఇలా ఫేమస్

అలా వచ్చింది... ఇలా ఫేమస్


శ్రీయ సరన్ మోడల్‌గా సత్తా చాటుతోన్నప్పుడే 'ఇష్టం' అనే తెలుగు సినిమాతో హీరోయిన్‌గా వచ్చింది. ఆ తర్వాత 'సంతోషం' మూవీతో మొదటి సక్సెస్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడని ఈ బ్యూటీ.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో హిట్లను అందుకుని స్టార్‌ అవడంతో పాటు ఫుల్ ఫేమస్ అయిపోయింది.

తెలుగులోనే కాదు.. ఆ భాషల్లో

తెలుగులోనే కాదు.. ఆ భాషల్లో


టాలీవుడ్‌లో దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ శ్రీయ సరన్ తెరను పంచుకుంది. ఇలా చాలా కాలం పాటు స్టార్‌గా హవాను చూపించింది. అలాగే, ఎన్నో అవార్డులను కూడా అందుకుంది. ఇలా తెలుగులో మాత్రమే కాదు.. దక్షిణాదిలోని పలు భాషల్లోనూ శ్రీయ సరన్ సినిమాలతో సందడి చేసింది. అలాగే, బాలీవుడ్‌లోనూ కొన్ని మూవీలు చేసి దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది.

 ప్రేమపెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది

ప్రేమపెళ్లి.. సీక్రెట్‌గా తల్లైంది


సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్‌ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శ్రీయ సరన్ ఆండ్రీ అనే వ్యక్తితో డేటింగ్ చేసింది. ఇలా చాలా కాలం పాటు అతడితో ప్రేమాయణం సాగించిన తర్వాత.. అంటే 2018లో అతడిని అగ్నిసాక్షిగా వివాహం చేసుకుంది. అలాగే, మూడేళ్ల తర్వాత ఓ బిడ్డకు తల్లినయ్యానని ప్రకటించింది. దీంతో ఆమె అభిమానులతో పాటు అందరూ షాక్ అయిపోయారు.

భారీ చిత్రంలో... ఆఫర్లు లేవు

భారీ చిత్రంలో... ఆఫర్లు లేవు


హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలా కాలం పాటు వరుసగా సినిమాలు చేస్తూ సందడి చేసిన శ్రీయ సరన్.. ఈ మధ్య కాలంలో అంతగా ఆఫర్లను అందుకోవట్లేదు. ఇక, కొద్ది రోజుల క్రితమే ఆమె 'గమనం', RRR మూవీలోనూ భాగమైంది. కానీ, ఇవి శ్రీయ కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా ఆఫర్లు రావడం లేదు. దీంతో ఫ్యామిలీతో గడుపుతోంది.

సోషల్ మీడియాలో బిజీగానే

సోషల్ మీడియాలో బిజీగానే


చాలా కాలం పాటు వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేసినా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటోన్నా.. శ్రీయ సరన్ మాత్రం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో అంశాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను వదులుతోంది. ఫలితంగా క్రేజ్ పెంచుకుంటోంది.

 భర్తతో కలిసి రచ్చ చేస్తోంది

భర్తతో కలిసి రచ్చ చేస్తోంది


సినిమా పరంగా ఎలా ఉన్నా శ్రీయ సరన్ తన వైవాహిక జీవితాన్ని కూడా తెగ ఎంజాయ్ చేస్తోంది. మరీ ముఖ్యంగా తన భర్త ఆండ్రీతో కలిసి ఈ అమ్మడు తరచూ హాలీడే ట్రిప్‌లకు విదేశాలకు చెక్కేస్తుంది. అక్కడ అతడితో కలిసి తీసుకున్న హాట్ ఫొటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియాలో వదులుతోంది. ఇలా ఎక్కువగా రొమాంటిక్‌వి వదులుతూ తగె హైలైట్ అవుతోంది.

 భర్తకు శ్రీయ సరన్ లిప్ కిస్

భర్తకు శ్రీయ సరన్ లిప్ కిస్


కొద్ది రోజుల క్రితమే భర్తతో ఫారెన్ ట్రిప్ వెళ్లిన శ్రీయ సరన్.. అతడితో కలిసి పబ్లిక్‌లోనే రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా ఇందులో ఇద్దరూ గాఢమైన లిప్ కిస్‌ను పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోను శ్రీయ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో ఈ పిక్‌కు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోంది. ఫలితంగా ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X