Shruthi Haasan : కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం వెతుకుంటున్న శృతి.. తన పార్టనర్ కు ఈ లక్షణాలు ఉండాలట

Shruti Haasan: తమిళ స్టార్ హీరో క‌మ‌ల్ హాస‌న్ (Kamal Hassan) గారాల ప‌ట్టి శృతి హాస‌న్ (Shruti Haasan)గురించి ప్ర‌త్యేక పరిచయం అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరో నటించిన గ‌బ్బ‌ర్ సింగ్ మూవీతో శృతి హాసన్ కు మంచి క్రేజ్ వచ్చింది. అంతకుముందు నటించిన అనగనగా ఓ ధీరుడు, సెవెన్త్ సెన్స్, ఓ మై ఫ్రెండ్ మూవీలో నటించి మెప్పించినా.. తాను అనుకున్న స్థాయిలో గుర్తింపు రాలేదు. గబ్బర్ సింగ్ మాత్రం ఈ అమ్మడు కెరీర్ లో మైల్ స్టోన్ అనే చెప్పాలి. ఆ తరువాత ప్రిన్ మహేశ్ బాబుతో శ్రీమంతుడు, అల్లు అర్జున్‌తో రేసుగుర్రం వంటి వరుస హిట్స్ అందుకుని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది శృతి హాస‌న్. ఈ స్టార్ డమ్ తోనే త‌మిళం, హిందీ సినిమాల్లో వ‌రుస ఆఫ‌ర్స్ దక్కించుకుంది.

శృతి హాస‌న్ కెరీర్ ప‌రంగా బాగానే ఉన్నా.. తన పర్సనల్ లైఫ్ లో మాత్రం కాస్తా ఒడిదుడుకులు ఉన్నట్టు తెలుస్తోంది. తొలుత ఈ అమ్మ‌డు హీరో ధ‌నుష్‌(Dhanush)తో కొన్నాళ్ల పాటు ప్రేమాయ‌ణం సాగించిన‌ట్టు ప్ర‌చారం జరిగింది. కానీ, దీనిపై ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. అయితే.. శృతి హాస‌న్ ఇండియన్ అబ్బాయి కాకుండా.. ఫారెన్ అబ్బాయితో రిలేషన్ లో ఉన్నట్టు రూమార్స్ వచ్చాయి.

Actress Shruti Haasan has opened up about her ideal life partner

ఈ క్రమంలోనే మైఖేల్ కోర్స‌లే(michael corsale) అనే ఫారెనర్ తో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఏమైందో తెలియదు. ఆ రిలేషన్ ను బ్రేక్ చేసి.. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికాతో డేటింగ్ చేసింది. ఈ జంట ముంబైలో కాపురం పెట్టినట్లుగా వార్తలు సైతం వచ్చాయి. అయితే.. వ్యక్తిగత కారణాలతో ఈ ట్రాక్ కూడా కట్ అయ్యిందని తెలుస్తోంది. ఏమైనా.. శ్రుతి లవ్ ట్రాక్ మాత్రం ఎప్పుడూ కూడా హాట్ టాపికే.

ఇదిలాఉంటే.. సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ శృతి.. నిత్యం త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్‌కి సంబంధించిన ప‌లు విష‌యాలు షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు తన పర్సనల్ లైఫ్ గురించి తన ఫ్యాన్స్ ను అడిగే ప్రశ్నలకు తరచుగా సమాధానాలు ఇస్తూ అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శృతి హాసన్ తనకు కాబోయే భర్త ఎలా ఉండాలి? అతనిలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి? అనే విషయాలను బయట పెట్టింది. అలాగే.. గతంలో తనతో డేటింగ్ చేసిన వ్యక్తులు ఎలా వ్యవహరించారో చెప్పుకోచ్చింది.

Actress Shruti Haasan has opened up about her ideal life partner

డేటింగ్(Dating) సమయంలో అమ్మాయిలకు అబ్బాయిలు ఖర్చు పెడ‌తారు. కానీ, తన విషయంలో అందుకు భిన్నంగా జరిగిందనీ, ప్రతి సారి తానే బిల్స్ పే చేసేవాడ్ని అని శృతి హాసన్(Sruthi Hassan) చెప్పింది. కొందరు తన దగ్గర డబ్బు బాగా ఉందంటూ తనతోనే ఖర్చు పెట్టించారని, అలా వారి కోసం ఖ‌ర్చు పెట్టడం తాను ప్రేమ‌లో భాగంగా భావించినా.. ఎదుటి వారు మాత్రం తన ఆడుకునేవారిని శృతి చెప్పింది. నువ్వెప్పుడూ బిల్ ఇవ్వలేదని.. నేను ప్రశ్నిస్తే.. నీ దగ్గర చాలా డబ్బు ఉన్నాయి కదా అనేవారని శృతి హాసన్ వాపోయింది.

తనకు కాబోయే ఎలా ఉందో అంటూ.. శృతి హాసన్ ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. తన పార్టనర్ ఆదర్శ భాగస్వామి అయి వుండాలని, తనతో సరదాగా ఉండాలని, జోక్స్ వేసి బాగా నవ్వించాలని, అలాగే.. క్రియేటివ్ గా ఆలోచిస్తూ.. ఇతరుల్లో స్ఫూర్తి నింపేలా ఉండాలని ఇలా ఫీలింగ్స్ ను బయటపెట్టింది శ్రుతి. ప్రస్తుతం ఈ అమ్ముడు చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇటీవల శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ కు బ్రేకప్ చెప్పినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ రూమార్స్ పై ఓ నెటిజన్ 'మీరు సింగిలా రిలేషన్షిప్ లో ఉన్నారా?'అని ప్రశ్నించగా.. 'ఇలాంటి ప్రశ్నలు నాకు నచ్చవు. అయినప్పటికీ చెబుతున్నాను నేను సింగిలే..ప్రజెంట్ రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నాను' అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్. ఇదిలాఉంటే.. ప్రస్తుతం శ్రుతి హాసన్.. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న 'కూలి' (Coolie) అనే సినిమాలో నటిస్తోంది. మరోవైపు 'శౌర్యంగ పర్వం'లో కూడా యాక్ట్ చేస్తుంది. అయితే.. అడవి శేషు'డెకాయిట్'మూవీలో శ్రుతిని పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం జరుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X