Don't Miss!
- Lifestyle
Today Rasi Palan 23 January 2023: ఈ రోజు ఉదయాన్నే కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల చాలా సంతోషంగా ఉంటారు...
- News
మంగ్లీ కారుపై దాడి జరిగిందా?: క్లారిటీ ఇచ్చిన సింగర్
- Sports
Sarfaraz Khan : సచిన్ కొడుకుతో పోల్చుకున్న సర్ఫరాజ్.. అది విని బాధపడ్డానన్న తండ్రి!
- Finance
దుమ్ము దులిపిన బ్యాంక్స్.. వీటి లాభాలు చూస్తే కళ్లు తిరగాల్సిందే.. ఎంత డబ్బో..
- Automobiles
ఈ రోజు నుంచి ప్రారంభం కానున్న 'మిహోస్' బుకింగ్స్.. డెలివరీలు ఎప్పుడంటే?
- Technology
Infinix నుంచి కొత్త ప్రీమియం ల్యాప్‌టాప్! ధర ,స్పెసిఫికేషన్లు చూడండి !
- Travel
భాగ్యనగరంలో ప్రశాంతతకు చిరునామా.. మక్కా మసీదు!
బెడ్‌రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!
ఇప్పటికే సినీ రంగంలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా హీరోయిన్లుగా తీసుకు వచ్చారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ శృతి హాసన్ ఒకరు. స్టార్ కిడ్‌గా వచ్చినప్పటికీ తనలోని అన్ని టాలెంట్లను బయటకు తీసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో వరుస సినిమాలతో సందడి చేస్తోంది. అలాగే, బాయ్‌ఫ్రెండ్ల విషయంలోనూ తెగ హైలైట్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా శృతి.. తన ప్రియుడితో రచ్చ చేసింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

అలా పరిచయం.. స్టార్‌గా శృతి
చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా పరిచయమైంది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరకు ఎంటరైంది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ కనిపించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గా ప్రయాణం మొదలెట్టి తర్వాత స్టార్‌గా ఎదిగింది.
సారా అలీ ఖాన్ హాట్ వీడియో వైరల్: రెడ్ బికినీలో ఎద అందాల ప్రదర్శన

ఇప్పుడు సీనియర్ హీరోలతోనే
తెలుగులోకి ప్రవేశించిన కొత్తలో వరుసగా సినిమాలు చేసిన శృతి హాసన్.. మధ్యలో గ్యాప్ ఇచ్చింది. మళ్లీ ఇటీవలే రీఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ఇప్పుడు మాత్రం సీనియర్ హీరోలతోనే సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ప్రభాస్‌తో 'సలార్' అనే సినిమాలో నటిస్తోన్న శృతి హాసన్.. బాలకృష్ణతో 'వీరసింహారెడ్డి', చిరంజీవితో 'వాల్తేరు వీరయ్య' చేస్తోంది. ఇవి సంక్రాంతికి రాబోతున్నాయి.

ఫారెనర్‌తో లవ్... బ్రేకప్ చెప్పి
కెరీర్ పరంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. అంతేకాదు, అతడిని కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసింది. వీళ్లంతా కలిసి ఓ వివాహ వేడుకలో సైతం పాల్గొన్నారు. ఆ సమయంలో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి జరగబోతుందని కూడా టాక్ వచ్చింది. కానీ, ఊహించని విధంగా వీళ్లిద్దరూ విడిపోయారు.
స్పోర్ట్స్ బ్రాతో అనుష్క ఓవర్ డోస్ షో: షార్ట్ కూడా పైకి లేపేసి మరీ!

అతడితో డేటింగ్.. ఎంజాయ్
మైకేల్‌తో విడిపోయిన తర్వాత శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోంది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ ఎంజాయ్ చేస్తూనే ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ అతడితో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ రచ్చ చేసింది. అలా ఈ బ్యూటీ కొంత కాలంగా నిత్యం హైలైట్ అవుతూనే ఉంది.

ప్రియుడికి బ్రేకప్ చెప్పిందని
సుదీర్ఘ కాలంగా శాంతను హజారికాతో ప్రేమాయణం సాగిస్తోన్న శృతి హాసన్.. కొద్ది రోజులుగా అతడికి దూరంగా ఉంటున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వీళ్లిద్దరూ విడిపోయారని టాక్ కూడా వచ్చింది. అందుకు అనుగుణంగానే శృతి హాసన్ తరచూ ఈ వార్తలకు బలం చేకూర్చే విధంగా పోస్టులు చేసింది. మరీ ముఖ్యంగా ఈ మధ్య చేసిన ఓ పోస్టుతో అది నిజమే అనుకున్నారంతా.
Dhamaka Twitter Review: ధమాకాకు అలాంటి టాక్.. అసలైందే మైనస్‌గా.. రవితేజ మూవీ హిట్టా? ఫట్టా?

బెడ్‌రూంలో రచ్చ.. ఫొటోతోనే
శృతి హాసన్ సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే ఈ అమ్మడు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో శాంతను హజారికాతో బాగా క్లోజ్‌గా ఉన్న పిక్‌ను షేర్ చేసింది. ఇందులో వీళ్లిద్దరూ బెడ్‌రూంలో ఉండగా.. అతడు శృతిని వెనుక నుంచి హగ్ చేసుకుని కనిపించాడు. దీంతో ఈ పిక్ వైరల్ అవుతోంది.

నాకు అదే కావాలి అని పోస్టు
ఈ ఫొటోలో శాంతను హజారికా తనను హగ్ చేసుకుని ముద్దు పెడుతోండగా శృతి హాసన్ తెగ మురిసిపోతోన్నట్లు కనిపించింది. ఇక, దీనికి 'నాకు కావాల్సింది ఇదే' అని క్యాప్షన్ పెట్టింది. తద్వారా తనకు శాంతను నుంచి ఇలాంటి ప్రేమే కావాలి అన్నట్లుగా చెప్పింది. మొత్తానికి ప్రియుడితో శృతి బ్రేకప్ అయినట్లు వస్తున్న వార్తలకు ఈ విధంగా పుల్‌స్టాప్ పెట్టేసిందని చెప్పొచ్చు.