నువ్వు కన్యవేనా.. నీతో సహజీవనం చేయాలని ఉంది.. ఆ ప్రశ్నలకు శృతి హాసన్ దిమ్మదిరిగే సమాధానం!
టాలీవుడ్ లోనే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న ముద్దుగుమ్మ శృతి హాసన్. కమల్ హాసన్ కూతురు అనే ఇమేజ్ తో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు కేవలం తన టాలెంట్ తోనే అవకాశాలు అందుకుంటోంది. అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు హడావుడిగా కనిపించే శృతి నెటిజన్లు అడిగే ప్రశ్నలకు కూడా కొంటెగా సమాధానాలు ఇస్తూ ఉంటుంది. ఇక రీసెంట్ గా కొందరు మరీ బోల్డ్ గా అడగడంతో ఆమె వారికి కౌంటర్ ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

అంతకంటే ముందే..
కమల్ హాసన్ బ్రాండ్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న శృతి అంతకంటే ముందే గాయనిగా, మ్యుజీషియన్ గా రాణిస్తూ వస్తుంది. లైవ్ షోలు కూడా ఇస్తూ వచ్చింది. ఇక అనగనగా ఒక ధీరుడు సినిమాతో ఈ బ్యూటీ హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తరువాత ఓ మై ఫ్రెండ్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది.

కొంత గ్యాప్ తీసుకొని
ఇక మొదట్లోనే రెండు సినిమాలు ఆమెకి ఆశించిన సక్సెస్ ఇవ్వలేదు. అయితే తరువాత కొంత గ్యాప్ తీసుకొని గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా నటించి మొదటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఖాతాలో వేసుకుంది. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్స్ తో మూవీస్ చేస్తూ వస్తుంది.

వరుసగా పెద్ద సినిమాలు
ఈ ఏడాది సంక్రాంతి రేసులో మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలతో సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంది. ఇక రీసెంట్ గా ప్రభాస్ పాన్ ఇండియా మూవీ సలార్ షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది.
ఈ సినిమాపై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సలార్ లో శృతి ఒక జర్నలిస్టుగా కనిపించనుంది.

ప్రియుడితో అలా..
ఇక ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో శృతి హాసన్ ఎక్కువగా బాయ్ ఫ్రెండ్ తో టైమ్ స్పెండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. డిజిటల్ ఆర్టిస్ట్ శాంతనుతో ఆమె చాలా కాలంగా ప్రేమాయణం సాగిస్తుంది. ఈ మధ్య రెగ్యులర్ గా బాయ్ ఫ్రెండ్స్ తో షార్ట్ వీడియోలు కూడా చేస్తూ సోషల్ మీడియాలో పెడుతుంది. వీటిని లక్షల్లో నెటిజన్లు చూస్తున్నారు.

డేటింగ్ చేయాలని ఉందని..
తాజాగా శృతి హాసన్ బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇన్స్టాగ్రామ్ లైవ్ చాటింగ్ లో పాల్గొంది. ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానాలు చెప్పింది. అయితే కొంత మంది నెటిజన్లు శృతి మించి కామెంట్స్ చేయడంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. ఒక నెటిజన్ మీతో డేట్ చేయాలని ఉంది అంటూ రిక్వెస్ట్ చేశాడు. అయితే అతనికి శృతి హాసన్ నో చెప్పింది.

వర్జిన్ ప్రశ్నకు కౌంటర్
మరో నెటిజన్ మీరు వర్జినా కాదా అని ప్రశ్నించాడు. దీనికి శృతి హాసన్ కి కోపం వచ్చింది. అలాగే అతను స్పెల్లింగ్ రాంగ్ రాయడంతో ముందు వర్జిన్ అనే పదం కరెక్ట్ గా రాయడం నేర్చుకో అంటూ కౌంటర్ ఇచ్చింది. అయితే శృతి అతను అడిగిన ప్రశ్నకు సమాధానం మాత్రం చెప్పలేదు. ఇప్పుడు ఈ టాపిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Click it and Unblock the Notifications











