రతన్ టాటాకు మాజీ లవర్ కన్నీటీ వీడ్కోలు.. మీరు లేరంటే..? హీరోయిన్ ఎమోషనల్!

దేశంలోనే దిగ్గజ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణవార్త అందర్నీ విషాదంలో ముంచేసింది. ఇండియన్ ఇండస్ట్రీ హిస్టరీకి మార్గదర్శకంగా నిలిచిన మహా పారిశ్రామిక వేత్త మహాభినిష్క్రమణతో ఓ శకం ముగిసింది. ఆయన ఇకలేరంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు. భూమి ఉన్నంత కాలం రతన్ టాటా అందరి హృదయాల్లో నిలిచిపోతారని పలువురు తమ సంతాపం ప్రకటనలో తెలిపారు. అయితే ఆయన మాజీ లవర్ చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

రతన్ టాటా జీవితంలో పెళ్లి అనేది విషయం నాలుగు సార్లు వచ్చి వెళ్లింది. కానీ ఆయన కొన్ని కారణాల వల్ల బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. చివరి వరకు ఒంటరి జీవితాన్ని కొనసాగించాడు. అయితే ఆయనతో బాలీవుడ్ నటి, టెలివిజన్ హోస్ట్ సిమి గరేవాల్‌తో అఫైర్ కొనసాగినట్టు అందరికి తెలిసిందే. అయితే వారిద్దరూ పెళ్లి చేసుకోకపోవడానికి ఏవో కారణాలు ఉన్నట్టు చెప్పుకొంటారు.

Actress Simi Garewal emotional fare note for Ratan Tata

అయితే సిమి గరేవాల్‌తో రతన్ టాటాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వారిద్దరూ కలిసి సుదీర్ఘకాలం సహజీవనం చేశారనేది బాలీవుడ్ మీడియాలో కథనాలు కూడా వచ్చాయి. ఆ విషయాన్ని స్వయంగా సిమి వెల్లడించారు. తనతో తన రిలేషన్‌షిప్ సుదీర్ఘకాలంగా సాగింది. ఆయనతో అనుబంధం ప్రత్యేకమైనదని ఆమె చెప్పారు.

Actress Simi Garewal emotional fare note for Ratan Tata

అయితే రతన్ టాటా మరణ వార్తతో సిమి గరేవాల్ తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. ఆయన ఇకలేరనే విషయాన్ని నమ్మలేకపోయారు. ఆ విషాద వార్తను తలుచుకొని భావోద్వేగానికి గురయ్యారు. తనతో ఉన్న మధురమైన బంధాన్ని నెమరు వేసుకొన్నారు. ఆయన సోషల్ మీడియా ద్వారా ఎమోషనల్‌గా సంతాపం ప్రకటించారు.

రతన్ టాటా మరణంపై సోషల్ మీడియాలో సిమి గరేవాల్ ఉద్వేగానికి గురయ్యారు. మీరు ఈ లోకం నుంచి వెళ్లిపోయారని అందరూ అంటున్నారు. కానీ నేను నమ్మలేకపోతున్నాను. మీరు లేరనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. ఆ విషయం చాలా కఠినంగా ఉంది. నా ప్రియ మిత్రుడు రతన్ టాటాకు నా బాధతప్త హృదయంతో వీడ్కోలు చెబుతున్నాను అని సిమి గరేవాల్ తెలిపారు.

భారత పారిశ్రామిక రంగానికి దిశానిర్దేశం చేసిన రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 9వ తేదీన) కన్నుమూశారు. గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మృతితో గొప్ప దార్శనికుడిని కోల్పోయిందని అభిమానుల, స్నేహితులు, సన్నిహితులు వెల్లడించారు. ఆయన అంత్యక్రియలు ముంబైలో సన్నిహితులు, అభిమానుల కన్నీటి ధారల మధ్య ముగిశాయి.

More from Filmibeat

Read more about: simi garewal ratan tata bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X