ఆ ఇద్దరూ బెదిరిస్తున్నారు.. పోలీసులను ఆశ్రయించిన స్నేహ.. అప్పుడలా, ఇప్పుడిలా?

తెలుగు, తమిళ సినిమాలతో ఒకప్పుడు స్టార్ స్టేటస్ అందుకున్న హీరోయిన్ స్నేహా తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకున్న తర్వాత కెరీర్ క్కు కొంత గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చి ఎక్కువగా అక్క, వదిన పాత్రలు చేస్తోంది అయితే ఆమె తాజాగా తనను ఇద్దరు వ్యక్తులు బెదిరిస్తున్నారు అంటూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

అలా ఎంట్రీ

అలా ఎంట్రీ

మలయాళ సినిమా ఇండస్ట్రీ ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన స్నేహ అదే ఏడాది ఒక తమిళ సినిమాలో కూడా నటించింది. ఈ రెండు సినిమాలలో ఆమె నటన చూసి తెలుగు సినిమాలో కూడా అవకాశం ఇచ్చారు. అలా తొలి వలపు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆమె తరువాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, వెంకీ లాంటి సినిమాలతో తెలుగులో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నారు.

 పోలీసులకు ఫిర్యాదు

పోలీసులకు ఫిర్యాదు

అయితే ఇప్పుడు స్నేహ కొందరు వ్యక్తుల నుండి బెదిరింపులు ఎదుర్కొంటుందట. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన స్నేహ ఈ మేరకు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపార వేత్తలు తనను బెదిరిస్తున్నారంటూ కణత్తూర్‌ పోలీసు స్టేషన్‌లో స్నేహ ఫిర్యాదు చేసింది.

ఎక్స్ పోర్ట్ కంపెనీలో పెట్టుబడి

ఎక్స్ పోర్ట్ కంపెనీలో పెట్టుబడి


పోలీసులకు స్నేహ చేసిన ఫిర్యాదు లో ఉన్న వివరాల మేరకు ఓ ఎక్స్ పోర్ట్ కంపెనీ నడుపుతున్న చెన్నైకి చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు తమ సంస్థలో పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తామని చెప్పడంతో స్నేహ వారి కంపెనీలో రూ.26 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిందట. అయితే, ఇంతకీ లాభాలు ఇవ్వకపోగా.. కనీసం తన డబ్బుకు వడ్డీ అయినా ఇవ్వాలని కోరితే వారిద్దరి నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు.

బెదిరిస్తున్నారు

బెదిరిస్తున్నారు


ఆ ఇద్దరి వ్యక్తుల నుండి ఎలాంటి సమాధానం లేకపోగా ఇప్పుడు చివరికి స్నేహ ఇచ్చిన రూ.26 లక్షలు అసలు కూడా తిరిగి ఇచ్చేందుకు వారు నిరాకరిస్తున్నారని స్నేహ ఫిర్యాదులో పేర్కొంది. తాను పెట్టుబడిగా పెట్టిన డబ్బును తిరిగి ఇవ్వాలని గట్టిగా అడిగితే తనను ఆ ఇద్దరూ కలిసి బెదిరిస్తున్నారని స్నేహ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తుంది.

Recommended Video

Allu Arjun, Sneha Reddy At TajMahal, Celebrates 10th Anniversary
 సినిమాల విషయానికి వొస్తే

సినిమాల విషయానికి వొస్తే

స్నేహ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు. స్నేహ సినిమాల విషయానికి వస్తే నాగార్జున రాజన్న సినిమా తర్వాత హీరోయిన్ గా దూరమైన స్నేహ సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ సినిమాలతో మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

వినయ విధేయ రామ సినిమాలో రామ్చరణ్ వదిన పాత్రలో నటించిన స్నేహ ఆ తర్వాత మరో తెలుగు సినిమా ఇప్పటికీ కూడా ఒప్పుకోలేదు. అయితే ఆమె తమిళంలో మాత్రం సినిమాలు చేస్తోంది. కాగా ప్రస్తుతం స్నేహ షూట్ బూట్ 3 సినిమాలో నటిస్తుంది. మొత్తం మీద స్నేహ ఫిర్యాదు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. దీని మీద స్నేహ అధికారికంగా అయితే స్పందించలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X