40 ఏళ్ల వయసులో స్నేహ అందాల అరాచకం.. గ్లామర్ షోలో హద్దులు చెరిపేస్తోన్న హోమ్లీ బ్యూటీ!
హీరోయిన్లలో గ్లామర్ షో చేసేవారు కొందరు, హోమ్లీ క్యారెక్టర్లు వేసే వారు కొందరు, రెండు మిక్స్ చేసి నటించే వారు మరికొందరు ఉంటారు. ఈ సెకండ్ కేటగిరీలోకే వస్తారు స్నేహ. ఫ్యామిలీ క్యారెక్టర్లకు , కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన స్నేహ.. సౌందర్య తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌తో అంతటి ప్రశంసలు పొందారు. హీరోయిన్‌గా జోరు తగ్గినప్పటికీ సెకండ్ ఇన్నింగ్స్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా దుమ్మురేపుతున్నారు. 40 ప్లస్ ఏజ్‌లోనూ చెక్కుచెదరని అందంతో కవ్విస్తున్నారు స్నేహ.
స్నేహ పూర్తి పేరు సుహాసినీ రాజారాం నాయుడు. ముంబైలో స్థిరపడిన తెలుగు కుటుంబంలో 12 అక్టోబర్ 1981న ఆమె జన్మించారు. ఈమె చిన్నతనంలోనే వీరి కుటుంబం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి వలస వెళ్లడంతో స్నేహ అక్కడే పెరిగారు. షార్జాలో ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ చూడటానికి వెళ్లిన ఓ మలయాళీ నిర్మాత స్నేహను చూసి సినిమాల్లో నటిస్తావా అని అడగటంతో ఆమె జీవితం మలుపు తిరిగింది. అలా అనుకోకుండానే స్నేహ సినిమాల్లోకి అడుగుపెట్టారు.

కుంచకో బాబు హీరోగా 2000వ సంవత్సరంలో వచ్చిన ఇంగానే ఓరు నీలపక్షి అనే మలయాళ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు స్నేహ. అనంతరం తరుణ్ హీరోగా వచ్చిన ప్రియమైన నీకు సినిమాతో తెలుగువారిని పలకరించారు. అందం, అమాయకత్వం, ఆకట్టుకునే చిరునవ్వుతో కుర్రకారును అలరించిన స్నేహ మంచి మార్కులు కొట్టేశారు. ఆ తర్వాత హనుమాన్ జంక్షన్, వెంకీ, రాధా గోపాలం, సంక్రాంతి, శ్రీరామదాసు, ఏవండోయ్ శ్రీవారు, మహారథి, మధుమాసం, నీ సుఖమే నే కోరుకున్నా, పాండురంగడు, అమరావతి, రాజన్న వంటి చిత్రాలతో ఆకట్టుకున్నారు స్నేహ.
కెరీర్ పీక్స్‌లో ఉండగానే తమిళ నటుడు ప్రసన్నతో ప్రేమలో పడిన స్నేహ పెద్దల అంగీకారంతో ఆయనను 2012లో పెళ్లాడారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లయినప్పటికీ నటనకు ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా నటిస్తూనే ఉన్నారు స్నేహా. అయితే హీరోయిన్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి టర్న్ అయ్యారు. సన్నాఫ్ సత్యమూర్తి, రాజాధి రాజా, వినయ విధేయ రామ వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెలుగులో చివరిసారిగా వినయ విధేయ రామలో నటించిన స్నేహా దాదాపు ఆరేళ్లుగా టాలీవుడ్‌కు ముఖం చాటేశారు. కన్నడ, తమిళ, మలయాళ చిత్రాలతో ఆమె బిజీగా ఉంటున్నారు.
సినిమాలతో పాటు బ్రాండ్ అండార్స్‌మెంట్స్‌తో స్నేహ రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇక సోషల్ యాక్టివిటీస్‌లోనూ ఆమె చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే స్నేహ ఎప్పటికప్పుడు తన సినిమాలు, ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ వయసులోనూ మత్తెక్కించే ఫోటో షూట్‌లతో కుర్ర కారును రెచ్చగొడుతూ ఉంటారు. తాజాగా బ్లాక్ కలర్ శారీలో ఆమె చేసిన ఫోటో షూట్‌ను స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











