వ్యాధి ముదిరింది: ఆసుపత్రి పాలైన ప్రముఖ హీరోయిన్
జూనియర్ ఐశ్వర్యరాయ్‌గా గుర్తింపు పొందిన హీరోయిన్ స్నేహా ఉల్లాల్ అరుదైన వ్యాధి బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తీవ్రమైన జ్వరంతో బాధ పడుతున్న ఆమెను మే 31న ముంబైలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు. తన ఆరోగ్య పరిస్థితి వెల్లడిస్తూ స్నేహా ఉల్లాల్ సోషల్ మీడియాలో ఫోటోస్ షేర్ చేశారు.
స్నేహా ఉల్లాల్‌కు చాలా కాలంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ సమస్య ఉంది. ఇది ఉన్నవారిలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అది ముదరడంతో ఆమె తీవ్రమైన జర్వానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం స్నేహా ఉల్లాల్ కోలుకుంటోంది. వైద్యులు ఆమెను పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
'నా జీవితంలో తొలిసారి ఆసుపత్రి పాలయ్యాను. తీవ్రమైన జ్వరం. ఎన్ని చికిత్సలు తీసుకున్నా తగ్గలేదు. ఇప్పుడు కాస్త కోలుకుంటున్నాను. డాక్టర్లు విశ్రాంతి ఎక్కువ తీసుకోమని చెబుతున్నారు. ఇలా ఆసుపత్రిలో బెడ్ మీద పడి ఉండటం చాలా బోర్‌గా ఉంది. నెట్‌ఫ్లిక్స్ ఉండటంతో పాటు నన్ను బాగా చూసుకునే వారు ఉండటం వల్ల కాస్త ఫర్వాలేదనిపిస్తోంది. వీలైనంత త్వరగా కోలుకుని మళ్లీ పనిలో బిజీ అవ్వాలని ఉంది. మీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను' అంటూ స్నేహా ఉల్లాల్ సోషల్ మీడియా పేజీలో ఓ పోస్ట్ పెట్టారు.

తెలుగులో 'ఉల్లాసంగా ఉత్సాహంగా' సినిమా ద్వారా తెరంగ్రేటం చేసిన స్నేహా ఉల్లాల్... తొలి ప్రయత్నంలో మంచి విజయం అందుకున్నారు. సంతోషం బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్ అవార్డు దక్కించుకున్నారు. ఆ తర్వాత 'నేను మీకు తెలుసా?, కింగ్, కరెంట్, సింహా, అలా మొదలైంది, మడత కాజా, యాక్షన్ 4డి చిత్రాల్లో నటించారు. ఆమె చివరిగా 2014లో 'అంతా నీ మాయలోనే' చిత్రంలో నటించింది.
వరుస పరాజయాలతో అవకాశాలు తగ్గడంతో మళ్లీ హిందీ సినిమాల వైపు దృష్టి సారించిన ఆమె చివరగా 2015లో 'బెజుబాన్ ఇష్క్' మూవీలో నటించింది. అయితే ఈ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ కావడంతో సినిమాలకు దూరమైంది.


Click it and Unblock the Notifications











