నాగచైతన్యతో పెళ్ళి.. శోభితకు కలిసివచ్చిన అదృష్టం ఏంటో తెలుసా?

Sobhita Dhulipala: అక్కినేని కోడలు, స్టార్ హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల.. ఈ అమ్మడు క్రేజ్ మామూలుగా లేదు. గత కొత్తకాలంగా ఈ అమ్మడు పేరు ఇండస్ట్రీలో మార్మోగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. దీని ప్రధాన కారణం.. అక్కినేని వారసుడు, హీరో నాగ చైతన్యను వివాహం చేసుకోవడం. దీంతో అమ్మడుకు ఎనలేని పాపులాటి వచ్చింది. అలాగే.. ఊహించిన విధంగా అదృష్టం కలిసివచ్చింది.
సినిమా ఆఫర్లే కాదు.. ప్రముఖ వ్యాపార సంస్థలు, ట్రెడ్ బ్యాండ్స్ శోభితా దగ్గరికి వస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే?

శోభితా ధూళిపాళ్ల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బాలీవుడ్ మూవీతో ఫేమస్ అయినా తెలుగింటి అమ్మాయి తొలుత మోడలింగ్ లో అడుగుపెట్టింది. ఈ సమయంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఆ రంగంలో నిలదొక్కుంది. పలు ఇంటర్నేషన్ ఈవెంట్స్ ల్లో పాల్గొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే ప్రముఖ మోడల్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సమయంలో పలు బ్యూటీ కంటెస్ట్ ల్లో పాల్గొంది.

Actress Sobhita Dhulipala Is Brand Ambassador of Bhima Jewellers

అనంతరం యాక్టింగ్ పై ఆసక్తితో సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శోభిత. ఇలా విక్కీ విశాల్ హీరోగా అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రామన్ రాఘవ్ 2.0'అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత 'చెఫ్','కళాకంది'అనే వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ల్లో నటించి, తన గ్లామర్ షోతో మెప్పించింది. తన అందం, అభినయంతో బాలీవుడ్ ప్రేక్షకులను మెస్మారైజ్ చేసింది. ఆ ఫేమ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అడివి శేష్ హీరోగా నటించిన 'గూఢచారి'తో టాలీవుడ్ అడుగుపెట్టింది.

ఈ మూవీ బ్లాక్ బ్లాసర్ హిట్ గా నిలిచింది. అమ్మడు నటనకు కూడా మంచి మార్కులే పడ్డాయి. కానీ,అనుకున్న విధంగా అవకాశాలను సొంతం చేసుకోలేకపోయింది. దీంతో తిరిగి బాలీవుడ్ పైనే ఫోకస్ పెట్టింది. మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ది నైట్‌ మేనేజర్‌ సినిమాల్లో తన గ్లామరెస్ యాక్టింగ్ తో మూవీ లవర్స్ ను మెస్మరైజ్ చేసింది. ఈ క్రమంలో మరోసారి అడవి శేషు హీరోగా నటించి 'మేజర్‌' అనే బయోపిక్ లో లీడ్ రోల్ లో నటించింది. ఈ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఈ అమ్మడుకు మంచి పాపులారిటీ వచ్చింది.

ఇదెలా ఉంటే.. ఇటీవల టాలీవుడ్ హీరో నాగ చైతన్యను డిసెంబర్ 4 నపెళ్లి చేసుకుని.. అక్కినేని కోడలిగా మారింది. దీంతో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీగా మారింది శోభితా. చైతూ- శోభితాల వివాహం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. వీరి వివాహా వేడుక అతి కొద్దిమంది సమక్షంలో చాలా గ్రాండ్ గా జరిగింది. హ్యాపీగా వారు లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఇదెలా ఉంటే.. అక్కినేని కోడలు శోభిత ఓ లక్కీ ఛాన్స్ వచ్చింది. ఓ ప్రముఖ సంస్థ తమకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించమని కోరింది.

Actress Sobhita Dhulipala Is Brand Ambassador of Bhima Jewellers

ప్రముఖ జ్యువెలరీ సంస్థ భీమా జ్యువెల్స్‌ 'ఎదిగే కొద్ది మరింత ప్రకాశించండి' అనే నినాదంతో సరికొత్త ప్రచారకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ ప్రచారానికి హీరోయిన్ శోభితా ధూళిపాళ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ అభిషేక్‌ బిందుమాధవ్‌ మాట్లాడుతూ..నమ్మకం, స్వచ్ఛత, నైపుణ్యం, అంకితభావం అనే పునాదులపై బీమా జ్యూవెల్స్‌ నిర్మించబడిందనీ, తాము 100 సంవత్సరాలుగా కస్టమర్లకు సేవలు అందిస్తున్నట్లు చెప్పారు.ఇలా బీమా జ్యూవెల్స్‌ ప్రచారకర్తగా ప్రముఖ నటి శోభితా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X