శోభిత కౌంట్ డౌన్ మొదలైంది.. సమంత పోస్టు వైరల్

కింగ్ అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల ఎంగేజ్‌మెంట్ కొద్దిరోజుల క్రితం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోందని సోషల్ మీడియా , మీడియా అనుమానం వ్యక్తం చేసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. చివరి ఆ మాటలే నిజం చేస్తూ సీక్రెట్‌గా నిశ్చితార్ధం చేసుకుని షాకిచ్చింది ఈ జంట. ఏదైతేనేం ఎంగేజ్‌మెంట్ కావడంతో పెళ్లెప్పుడు? ఇండియాలోనా? ఫారిన్‌లోనా? అంటూ తెలుగు ప్రజలు తెగ చర్చించుకుంటున్నారు. అయితే శోభిత కుటుంబం పెళ్లి పనుల్లో బిజీగా ఉందని వినికిడి. ఈ వివరాల్లోకి వెళితే..

నాగచైతన్య, శోభితలు ప్రేమలో పడ్డ విషయం తొలుత ఇంగ్లాండ్‌లో వారిద్దరి ప్రైవేట్ వేకేషన్ ద్వారా బయటకు పొక్కింది. మీడియా వీరిపై నిఘా పెట్టినా, ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా ఎవ్వరికీ అనుమానం రాకుండా ప్రేమాయణం సాగించింది ఈ జంట. అనూహ్యంగా రెండు నెలల క్రితం నాగచైతన్య- శోభితలు ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారంటూ తెలుగు మీడియాలో హడావుడి నడిచింది. కట్ చేస్తే క్షణాల వ్యవధిలో చైతూ - శోభితల ఎంగేజ్‌మెంట్ ఫోటోలు బయటికి రావడంతో చిత్ర పరిశ్రమ, అక్కినేని అభిమానులు షాక్ అయ్యారు.

Actress sobhita Dhulipala sister Dr samanthas Instagram photos goes viral

అయితే ఒంటరిగా జీవితం నెట్టుకొస్తున్న తమ హీరో ఓ ఇంటి వాడు కావడంతో అక్కినేని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. నిశ్చితార్ధం సరే మరి పెళ్లెప్పుడు, ఎక్కడ అనే చర్చ మొదలైంది. దీనిపై రెండు కుటుంబాలు చాలా గుట్టుగా పనులు చేసుకుంటూ వస్తున్నాయి. నాగచైతన్య, నాగార్జునలను మీడియా కదిలించే ప్రయత్నం చేసినా వారిద్దరూ నవ్వుతూ తప్పించుకున్నారు. చైతూ - శోభితల పెళ్లి ఎప్పుడు? ఎక్కడ? అనేదానిపై మీడియాలో రకరకాల కథనాలు సైతం వినిపించాయి.

ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం శోభితా ధూళిపాళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేయడంతో మరోసారి అంతా షాకయ్యారు. పట్టు చీరలో ముస్తాబైన శోభితా పసుపు కొమ్ములను తీసుకొచ్చిన ఆమె తన బంధు మిత్రులతో కలిసి స్వయంగా పసుపు దంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు, పెద్దల ఆశీర్వాదం తీసుకొంటూ శోభిత కనిపించారు. దాంతో త్వరలోనే నాగచైతన్య, శోభితలు త్వరలోనే మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుగు చిత్ర పరిశ్రమ, అక్కినేని అభిమానులు ఫిక్సయిపోయారు.

ఇక ఈ ఏడాదికి గాను ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్‌ను మెగాస్టార్ చిరంజీవికి ప్రకటించారు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా చిరంజీవికి అవార్డును ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తనకు కాబోయే కోడలు శోభితను చిరంజీవి, అమితాబ్ తదితరులకు పరిచయం చేశారు నాగార్జున. అలాగే అక్కినేని ఫ్యామిలీ మొత్తం దిగిన గ్రూప్ ఫోటోలోనూ శోభిత ఫోజులిచ్చారు. తాజాగా శోభిత చెల్లెలు డాక్టర్ సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అక్క, తల్లిదండ్రులతో కలిసున్న ఫోటోలను షేర్ చేశారు. దీనికి ది కౌంట్ డౌన్ బిగిన్స్ అని రాసుకొచ్చారు. అందులో శోభిత వేద పండితుల ఆశీర్వాదం తీసుకుంటూ , పెళ్లికూతురు బొమ్మను చూస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతుండగా.. పెళ్లి డేట్ ఇకనైనా చెప్పాలంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X