హల్దీ వేడుకలలో శోభితా ధూళిపాల..ఫ్యాన్స్‌కి షాకిచ్చిన నాగచైతన్య ఫియాన్సీ
కింగ్ అక్కినేని నాగార్జున నట వారసుడు నాగచైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాల సీక్రెట్ ఎంగేజ్‌మెంట్ చిత్ర సీమను షాక్‌కి గురిచేసింది. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ గతంలో మీడియా కోడై కూసినా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. చివరి ఆ మాటలే నిజం చేస్తూ పెద్దల అంగీకారంతో ఈ జంట నిశ్చితార్ధం చేసుకుంది. ఎంగేజ్‌మెంట్ కావడంతో పెళ్లెప్పుడు? ఇండియాలోనా? ఫారిన్‌లోనా? అంటూ సోషల్ మీడియాలో తెగ డిస్కషన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో శోభిత ధూళిపాళ షాకిచ్చారు. ఈ వివరాల్లోకి వెళితే..
నాగచైతన్య, శోభితలు ప్రేమలో పడ్డ విషయం ఇంగ్లాండ్‌లో వారిద్దరి ప్రైవేట్ వేకేషన్ ద్వారా బయటకు పొక్కింది. దీనిపై మీడియాలో రకరకాల గాసిప్స్ వచ్చినా ఇద్దరూ మౌనంతోనే సమాధానం చెప్పారు. ఎక్కడ ఓవరాక్షన్ లేకుండా మీడియాకు ఏ మాత్రం దొరక్కుండా వీరి ప్రేమాయణం నడిచింది. వన్ ఫైన్ మార్నింగ్ నాగచైతన్య- శోభితలు ఏదో ముఖ్యమైన విషయం చెప్పబోతున్నారని మీడియాలో హడావుడి నడిచింది. కట్ చేస్తే కొద్దిగంటల్లోనే చైతూ - శోభితల ఎంగేజ్‌మెంట్ ఫోటోలు బయటికి రావడంతో షాకవ్వడం జనాల వంతైంది.

ఎంగేజ్‌మెంట్ సరే.. ఆ వెంటనే పెళ్లెప్పుడు అనే చర్చ మొదలైంది. దీనిపైనా అక్కినేని, ధూళిపాళ కుటుంబాలు చాలా గుట్టుగా పనులు చేస్తున్నాయి. నాగచైతన్య, నాగార్జునలను మీడియా కూపీ లాగే ప్రయత్నం చేసినా వారిద్దరూ నవ్వుతూ తప్పించుకున్నారు. కానీ వారిద్దరి పెళ్లి ఎప్పుడనే విషయం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. రకరకాల కథనాలు సైతం వినిపించాయి. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం శోభితా ధూళిపాళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేయడంతో మరోసారి అంతా షాకయ్యారు.
తమ కుటుంబానికి చెందిన ముత్తైదువలు వెంటరాగా సంప్రదాయంగా పట్టు చీరలో ముస్తాబైన శోభితా పసుపు కొమ్ములను తీసుకొస్తూ కనిపించారు. తన బంధు మిత్రులతో కలిసి స్వయంగా పసుపు దంచారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వేద పండితులు, పెద్దల ఆశీర్వాదం తీసుకొంటూ శోభిత కనిపించారు. దాంతో త్వరలోనే నాగచైతన్య, శోభిత మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారని తెలుగు చిత్ర పరిశ్రమ, అక్కినేని అభిమానులు ఫిక్సయిపోయారు. పెళ్లి కూడా ఇలాగే చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి సర్‌ప్రైజ్ చేస్తారా అంటూ వారు ఆన్‌లైన్‌లో కామెంట్ చేస్తున్నారు.
ఇంతలోనే హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. శోభిత తన బంధుమిత్రులతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే వీటిలో పెళ్లికూతురు గెటప్‌లో శోభితకి బదులుగా మరో యువతి కనిపిస్తున్నారు. ఆవిడ ఎవరో కాదు స్వయానా శోభిత చెల్లెలు సమంత. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సమంత .. సాహిల్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం పెళ్లాడింది. తాజాగా తన పెళ్లినాటి సంగీత్, హల్దీ వేడుకల ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అసలే శోభిత - నాగచైతన్యలు తమ పెళ్లి గురించి ఎలాంటి షాకిస్తారోనని జనం వెయిట్ చేస్తున్న వేళ సమంత తన పెళ్లి ఫోటోలు ఈ టైమ్‌లో షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.


Click it and Unblock the Notifications











