బ్రాలో బాగా తెగించిన బాలయ్య హీరోయిన్: కొంచెం కూడా దాచవా ఏంటి?
తెలుగు సినీ రంగంలో ఎంతో మంది హీరోయిన్లు ఓ రేంజ్‌లో హడావిడి చేస్తున్నారు. కానీ, కొందరు మాత్రం అందం, టాలెంట్ ఉన్నా సరిగా అవకాశాలను అందుకోవడం లేదు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ ఒకరు. చాలా ఏళ్ల క్రితమే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ చిన్నది.. ఆఫర్లను మాత్రం ఆశించిన రీతిలో అందుకోలేదు. అయినా ఇప్పటికీ కొన్ని కొన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉంది. మరీ ముఖ్యంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో విపరీతంగా రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ బ్యూటీ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. దాన్ని మీరే చూడండి!
మోడల్‌గానే సెన్సేషన్: సినిమాల్లోకి అడుగు పెట్టడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో చాలా బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ వర్క్ చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై దేశ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది.

అలా వచ్చి.. తెలుగులో: మోడలింగ్ రంగంలో సత్తా చాటుతోన్న సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు ఎన్నో భాషల నుంచి సినిమా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ భామ 'జన్నత్' అనే హిందీ చిత్రంతో హీరోయిన్‌గా ఎంటరైంది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ మెప్పించింది. దీంతో ఆమెకు చాలా భాషల్లో ఆఫర్లు దక్కాయి. తర్వాత 'రెయిన్‌బో' మూవీతో తెలుగులోకీ వచ్చింది.
బాలయ్యతో ఎక్కువగా: టాలీవుడ్‌లోకి అడుగు పెట్టిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఎన్నో అవకాశాలు వచ్చాయి. దీంతో 'రెయిన్‌బో' తర్వాత వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో ఆమె బాలయ్యతోనే మూడు సినిమాను చేసింది. అలాగే, ఎన్నో హిట్లనూ సొంతం చేసుకుంది.

ఘెస్ట్ టూ ఆదిపురుష్: అందానికి అందం, నటనకు నటన పరంగా సోనాల్ చౌహాన్‌కు అవకాశాలు అంతగా రావడం లేదు. దీంతో చేసేందేం లేక సీనియర్ హీరోలతోనైనా ఈ భామ జోడీ కడుతోంది. ఇలా గత ఏడాదిలో 'ది ఘోస్ట్' మూవీలో అక్కినేని నాగార్జునతో కలిసి నటించింది. ఇప్పుడు ఈ భామ ప్రభాస్ హీరోగా చేసిన 'ఆదిపురుష్'లో కీలక పాత్ర చేసింది. అలాగే, మరికొన్ని సినిమాల్లోనూ భాగమైంది.
ఇంటర్నెట్‌లో ఫుల్‌గా: హీరోయిన్‌గా వచ్చిన కొత్తలో వరుసగా సినిమాలు చేసి.. ఈ మధ్య కాలంలో పెద్దగా ఆఫర్లను అందుకోలేకపోతోన్న హాట్ బ్యూటీ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది.

బౌండరీలు దాటేస్తూ: సుదీర్ఘ కాలంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ భాగం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా వదులుతోంది. దీంతో ఈ భామ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

సోనాల్ పిక్ వైరల్‌గా: సోషల్ మీడియాలో యమా హల్చల్ చేసే హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ బిప్ మొత్తం తీసేసి బ్రాలో దర్శనమిచ్చింది. తద్వారా సోనాల్ ఎద అందాలు నెటిజన్లకు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ పిక్‌కు భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఫలితంగా ఇది వైరల్‌గా మారింది.


Click it and Unblock the Notifications











