సోనాల్ చౌహాన్ హాట్ షో: బాత్రూంలో అలా చూపిస్తూ!
టాలీవుడ్‌లో ఇప్పుడు పదుల సంఖ్యలోనే పేరున్న హీరోయిన్లు ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రం ఇప్పటికి కూడా సరైన ఆఫర్లను అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఒకవేళ సినిమాలో నటించినా పెద్దగా ప్రభావాన్ని చూపలేకపోతోన్నారు. అలాంటి వారిలో సోనాల్ చౌహాన్ ఒకరు. టాలీవుడ్ మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ భామ.. అవకాశాల పరంగా అంతగా మెప్పించలేకపోతోంది. అయితేనేం సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా సోనాల్ కొన్ని హాట్ ఫొటోలు వదిలింది. వాటిని మీరే చూసేయండి!

మోడల్‌గానే సత్తా చాటేసింది
సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోనాల్ చౌహాన్ మోడలింగ్ రంగంలోకి ప్రవేశించింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేసిన ఈ భామ.. చాలా తక్కువ సమయంలోనే ఫేమస్ అయింది. దీంతో ఎన్నో బ్రాండ్లకు అంబాసీడర్‌గానూ చేసింది. ఈ క్రమంలోనే సోనాల్ చౌహాన్ ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజంగా ఎంపికై అందరి దృష్టినీ ఆకర్షించింది.

హీరోయిన్‌గా ఎనలేని గుర్తింపు
మోడల్‌గా నేషనల్ రేంజ్‌లో ఫేమస్ అవడంతో సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ, ఆ సమయంలో ఆమె ముందుకు రాలేదు. అయితే, ఆ తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా ఆమె హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది. దీంతో ఆరంభంలోనే ఈ భామకు ఎనలేని గుర్తింపు సొంతం అయింది.

తెలుగులోకి రాక.. బాలయ్యతో
హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా భాషల నుంచి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్', 'F3' వంటి సినిమాలు చేసింది. ఆమె బాలయ్యతోనే మూడు సినిమాల్లో నటించింది.

సీనియర్స్ ఛాయిస్.. బిగ్ షాక్
అందానికి అందం, నటనకు నటన చేయగల సత్తా ఉన్నా సోనాల్ చౌహాన్‌కు పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో ఆమె సీనియర్ హీరోలతో కూడా నటించడానికి ముందుకు వచ్చింది. తద్వారా వాళ్లకు ఫస్ట్ ఛాయిస్‌గా మారిపోయింది. ఈ క్రమంలోనే ఇటీవలే సోనాల్ చౌహాన్.. అక్కినేని నాగార్జున 'ది ఘోస్ట్' మూవీలో నటించింది. అయితే, ఇది డిజాస్టర్ దిశగా పయణిస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా
సినిమాల పరంగా బిజీగా ఉన్నా లేకున్నా హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ మాత్రం సోషల్ మీడియా ద్వారా నిత్యం ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

గ్లామర్ ట్రీట్‌తో కాకరేపుతోంది
సుదీర్ఘ కాలంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో చేస్తోన్న హడావిడి గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. దీంతో భామ తెగ హైలైట్ అవుతోంది.

సోనాల్ హాట్ ఫొటోలు వైరల్
సోషల్ మీడియాలో విపరీతంగా సందడి చేస్తోన్న హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె స్ట్రాప్‌లెస్ డ్రెస్‌తో ఘాటు ఫోజులు ఇస్తూ కనిపించింది. తద్వారా సోనాల్ ఎద అందాలు నెటిజన్లకు ఓ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్స్‌కు భారీ రెస్పాన్స్ దక్కి.. ఇవి వైరల్‌గా మారిపోయాయి.


Click it and Unblock the Notifications











