రెచ్చిపోయిన F3 హీరోయిన్: ఆ యాంగిల్‌లో అందాలను చూపిస్తూ ట్రీట్

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లుగా పరిచయమైనా.. పెద్దగా గుర్తింపును దక్కించుకోలేక ఎంతో మంది ఇప్పటికీ అవస్థలు పడుతూనే ఉన్నారు. తద్వారా అందం, టాలెంట్ ఉన్నా సరైన అవకాశాలను మాత్రం అందుకోలేకపోతున్నారు. అయితే, ఒకరు మాత్రం పెద్దగా హిట్ చిత్రాలు లేకున్నా వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. ఆమె ఎవరో కాదు.. ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్. టాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్ కాకున్నా.. ఈ భామ సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఫలితంగా సుదీర్ఘ కాలంగా హవాను చూపిస్తోంది. అదే సమయంలోనే సోనాల్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిని మీరూ చూడండి!

అందంతోనే అదరగొట్టేసింది

అందంతోనే అదరగొట్టేసింది

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే సోనాల్ చౌహాన్ ముందుగా మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. అందులో తన పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించి ఫేమస్ అయింది. అలాగే అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని దక్కించుకుంది.

సినిమాల్లో ఎంట్రీ.. పాపులర్

సినిమాల్లో ఎంట్రీ.. పాపులర్

మోడలింగ్ రంగంలో తనదైన ముద్రను వేస్తూ దూసుకుపోతోన్న సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది. దీంతో ఫుల్ పాపులర్ అయింది.

తెలుగులోకి వచ్చిన సోనాల్

తెలుగులోకి వచ్చిన సోనాల్

'జన్నత్' తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఇండియాలోని చాలా భాషల నుంచి సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును, గ్రాండ్ ఎంట్రీని అందించలేదు. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేసింది.

బాలయ్య హీరోయిన్‌గా పేరు

బాలయ్య హీరోయిన్‌గా పేరు

సుదీర్ఘమైన కెరీర్‌లో తెలుగులో సోనాల్ చౌహాన్ పలు సినిమాల్లో నటించింది. 'రెయిన్‌బో' నుంచి వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాలు చేసింది. అందులో మూడు నందమూరి బాలకృష్ణతోనే చేసింది. ఇటీవలే ఈ అమ్మడు 'F3' మూవీలోనూ అలరించింది. ఇక, ఇప్పుడు కూడా పలు చిత్రాలతో బిజీగా ఉంది.

సోషల్ మీడియాలో యాక్టివ్

సోషల్ మీడియాలో యాక్టివ్

వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నప్పటికీ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తరచూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

అందాల విందు చేస్తోందిగా

అందాల విందు చేస్తోందిగా

సోనాల్ చౌహాన్ సుదీర్ఘ కాలంగా సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటున్నాయి. మరీ ముఖ్యంగా బికినీ ధరించిన ఫొటోలను కూడా సోనాల్ చౌహాన్ ఎక్కువగా షేర్ చేస్తుంటుంది. దీంతో ఈ బ్యూటీ పేరు మారుమ్రోగుతోంది.

జిమ్‌వేర్‌లో హాట్ ఫోజులు

జిమ్‌వేర్‌లో హాట్ ఫోజులు


సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఉండే హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్పోర్ట్స్ బ్రా ధరించి సైడ్ నుంచి ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ బ్యూటీ అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇది వైరల్‌ అయిపోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X