సోనాల్ చౌహాన్ అందాల ఆరబోత.. బికినీలో కుర్రకారుపై అలా వల

తెలుగు తెరపై అందాల వర్షం కురిపించిన సోనాల్ చౌహాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం , అభినయం బాగున్నప్పటికీ ఎందుకో ఈ ముద్దుగుమ్మకు రావాల్సినంత పేరు దక్కలేదు. తెలుగులో అవకాశాలు కూడా ఈ మధ్యకాలంలో రావడం లేదు. దీనికి కారణాలు తెలియరాకపోగా.. ఆమె అభిమానులు మాత్రం నిరాశ వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సోనాల్ చౌహాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫోటో షూట్ వైరల్ అవుతోంది.

16 మే 1985న ఉత్తరప్రదేశ్‌లోని అగ్రాలో ఓ రాజ్‌పుత్ కుటుంబంలో జన్మించారు సోనాల్ చౌహాన్. నోయిడా, ఢిల్లీలలో చదువుకున్న ఈ ముద్దగుమ్మ.. 2005లో మలేషియాలో జరిగిన మిస్ వరల్డ్ టూరిజం కాంటెస్ట్‌లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి భారత యువతిగా సోనాల్ రికార్డుల్లోకెక్కారు. అనంతరం మోడలింగ్‌లోకి దిగిన ఈ సోనాల్ చౌహాన్.. పలు ప్రముఖ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేశారు. అనంతరం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ రాజ్‌పుత్ భామ బాలీవుడ్ స్టార్ హిమేష్ రేష్మియా నటించిన ఆప్‌కీ సరూర్ ద్వారా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు.

Actress sonal chauhan shares her vacation photos at maldives

2008లో వీఎన్ ఆదిత్య దర్శకత్వంలో వచ్చిన రెయిన్ బో ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి తన అందం, క్యూట్ లుక్స్‌తో తెలుగు వారిని పలకరించారు. అనంతరం బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించి బ్రేక్ అందుకున్నారు. ఈ సినిమా ఘన విజయం తర్వాత సోనాల్ చౌహాన్‌కు ఆఫర్లు వెల్లువెత్తాయి. పండగ చేస్కో, సైజ్ జీరో, షేర్, డిక్టేటర్, రూలర్, ఎఫ్ 3, ఘోస్ట్, ఆదిపురుష్ సినిమాల్లో సోనాల్ చౌహాన్ నటించారు. గతేడాది బెంగాలీ, హిందీలలో తెరకెక్కిన దార్ద్‌లో సోనాల్ నటించారు.

సినిమాలతో పాటు టెలివిజన్‌లోనూ అలరించారు. ఆమెలో నటితో పాటు సింగర్ కూడా ఉన్నారు. పలు హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్‌తో యూత్‌ను ఆకట్టుకున్నారు. చివరిసారిగా ఎఫ్ 3, ది ఘోస్ట్‌లలో నటించిన సోనాల్ చౌహాన్ తర్వాత తెలుగు తెరకు దూరమయ్యారు. బాలీవుడ్‌లో జెండా పాతాలని బలంగా ఫిక్స్ అయ్యారు. ఇటీవల ప్రయాగ్‌రాజ్‌లో ముగిసిన మహా కుంభమేళాలో పాల్గొన్న సోనాల్ చౌహాన్ గంగానదిలో పవిత్ర స్నానమాచరించారు. ఎప్పుడూ హాట్ హాట్‌గా కనిపించే ఈ ముద్దుగుమ్మ పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనిపించేసరికి నెటిజన్లు షాక్ అయ్యారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సోనాల్ చౌహాన్.. తన వ్యక్తిగత వివరాలు, సినిమాల సంగతులను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటారు. ఇక హాట్ హాట్ ఫోటో షూట్‌లతో కుర్రాళ్లకు నిద్రలేని రాత్రులను మిగులుస్తుంటారు. తాజాగా విహారయాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లిన సోనాల్ చౌహాన్.. బికినీ వేసి నడుము నుంచి పాదాల వరకు వల లాంటి డ్రెస్‌తో కవర్ చేస్తూ ఫోటో షూట్ నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం సోనాల్ అందాలపై మీరూ ఓ లుక్కేయండి.

More from Filmibeat

Read more about: sonal chauhan movie news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X