స్విమ్మింగ్ పూల్‌లో రెచ్చిపోయిన హీరోయిన్: గతంలో చూడని విధంగా అందాల విందు
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోయిన్లుగా పరిచయం అవుతూ ఉన్నారు. అయితే, అందులో కొందరు మాత్రమే ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని గుర్తింపును అందుకుంటున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటున్నారు. అందులో ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్ ఒకరు. టాలీవుడ్‌లో పెద్దగా సక్సెస్ కాకున్నా.. ఈ సుందరి వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఫలితంగా తన హవాను చూపిస్తోంది. అదే సమయంలోనే సోనాల్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే అప్పుడప్పుడూ అందాల విందు కూడా చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ అమ్మడు ఓ హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

మిస్ ఇండియా కిరీటంతో గుర్తింపు
పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో మాయ చేస్తోన్న సోనాల్ చౌహాన్.. చదువుకుంటోన్న రోజుల్లోనే మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తన అందచందాలతో విశేషమైన గుర్తింపును సొంతం చేసుకుంది. దీంతో ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగానూ వ్యవహరించింది. అలాగే అందాల పోటీల్లో పాల్గొంది. ఈ క్రమంలోనే ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ టూరిజం కిరీటాన్ని గెలుచుకుంది.

హీరోయిన్‌గా ఎంట్రీ.. ఫుల్ ఫేమస్
మోడల్‌గా ఎనలేని గుర్తింపును సొంతం చేసుకున్న సమయంలోనే సోనాల్ చౌహాన్‌కు వరుసగా సినిమా ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆ సమయంలో ఆమె చాలా గ్యాప్ తీసుకుంది. చాలా కాలం తర్వాత 'జన్నత్' అనే హిందీ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో యాక్టింగే కాకుండా.. గ్లామర్ పరంగానూ అలరించింది. దీంతో ఒక్కసారిగా ఫేమస్ అయింది.

తెలుగులోకి పరిచయం... వాటిలో
'జన్నత్' మూవీ తర్వాత సోనాల్ చౌహాన్‌కు చాలా భాషల నుంచి ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే 'రెయిన్‌బో' అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే, ఇది ఆమెకు అంతగా గుర్తింపును, గ్రాండ్ ఎంట్రీని ఇవ్వలేదు. దీంతో టాలీవుడ్‌లో గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత కన్నడం, హిందీ భాషల్లో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది.

బాలయ్యతోనే ఎక్కువ సినిమాలు
తెలుగులో సోనాల్ చౌహాన్ పలు సినిమాల్లో నటించింది. 'రెయిన్‌బో' నుంచి వరుసగా 'లెజెండ్', 'పండగ చేస్కో', 'షేర్', 'సైజ్ జీరో', 'డిక్టేటర్', 'రూలర్' వంటి సినిమాలు చేసింది. అందులో మూడు నందమూరి బాలకృష్ణతో చేసినవే ఎక్కువున్నాయి. ఇటీవలే ఈ అమ్మడు 'F3' మూవీలోనూ అలరించింది. ఇక, ఇప్పుడు కూడా పలు చిత్రాలను చేస్తోంది.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్
వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. తద్వారా తరచూ ట్రెండింగ్ అవుతూనే ఉంటోంది.

అందాల విందు చేస్తోన్న సోనాల్
సుదీర్ఘ కాలంగా సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే తరచూ తన ఫొటోలు, వీడియోలు వదులుతుంది. వీటిలో ఎక్కువ శాతం అందాలు ఆరబోస్తూ దిగినవే ఉంటాయన్న విషయం తెలిసిందే. అందులోనూ బికినీ ధరించిన ఫొటోలు కూడా సోనాల్ షేర్ చేస్తుంటుంది. తద్వారా ఈ బ్యూటీ తెగ హైలైట్ అవుతోంది.

స్విమ్ సూట్‌లో హాట్ ట్రీట్ ఇస్తూ
సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేసే హాట్ హీరోయిన్ సోనాల్ చౌహాన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె స్విమ్మింగ్ పూల్‌లో స్విమ్ సూట్‌తో ఘాటు ఫోజు ఇస్తూ కనిపించింది. తద్వారా ఈ బ్యూటీ అందాలు మొత్తం నెటిజన్లకు కనువిందు చేస్తున్నాయి. ఫలితంగా ఈ పిక్‌కు భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో ఇది వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











