బాలయ్య బాబు కారణంగా ఎమోషనల్ అయిన శ్రీలీల.. ఆమె అలా ఏడవడంతో..
క్రేజీ హీరోయిన్ గా టాలీవుడ్ లో దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. ఈ బ్యూటీ ప్రస్తుతం పదికి పైగా సినిమాలలో నటిస్తోంది. మెజారిటీ సినిమాలలో హీరోయిన్ గానే ఈమె కనిపించబోతోంది. పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కూడా శ్రీలీల జతకడుతోంది. అలాగే యంగ్ హీరోలకి కూడా జోడీగా ఈ బ్యూటీ నటిస్తోంది. విజయ్ దేవరకొండతో ఓ మూవీకి కమిట్ అయ్యింది.
ఇలా ప్రస్తుతం ఎవరికి అర్ధం కాని, ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీ ఏ హీరోయిన్ కి సాధ్యం కాని విధంగా శ్రీలీల పది సినిమాలని వరుసగా లైన్ లో పెట్టడం నిజంగా రికార్డ్ అని చెప్పాలి. ఇప్పటి వరకు ఆమె ఖాతాలో ధమాకా రూపంలో ఒక్క హిట్ మాత్రమే ఉంది. కాని స్టార్ హీరోయిన్ అయిపొయింది. ఈ బ్యూటీ యాక్టర్ గానే కాకుండా డాక్టర్ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. మెడిసన్ కంప్లీట్ చేసి మూవీస్ లోకి వచ్చింది.

తాజాగా బసవతారకం 23వ వార్షికోత్సవంలో శ్రీలీల ప్రత్యేక అతిథిగా హాజరైంది. ప్రస్తుతం ఆమె బాలయ్య భగవంత్ కేసరి మూవీలో నటిస్తోంది. ఈ నేపథ్యంలో బాలయ్య శ్రీలీలని ఇన్వైట్ చేయడంతో ఆమె వెళ్ళింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటరెస్టింగ్ విషయాన్ని రివీల్ చేసింది. భగవంత్ కేసరి మూవీ షూటింగ్ లో తనకి కేర్ టేకర్ గా చేస్తున్న యాక్టర్ పక్కకి వెళ్లి ఏడవడం కనిపించింది.
ఆమె దగ్గరకి వెళ్లి ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాను. ఇవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు. ఆనందభాష్పాలు అని చెప్పారు. తను క్యాన్సర్ బారిన పడిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవడానికి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా డబ్బులు లేని పరిస్థితిలో బసవతారకం హాస్పిటల్ కి వెళ్లాను. అక్కడ తనని ఒక ఫ్యామిలీ మెంబర్ గా ట్రీట్ చేసి మొత్తం తగ్గించి బయటకి పంపించారు.
ఈ రోజు క్యాన్సర్ ని జయించి మళ్ళీ ఆర్టిస్ట్ గా నటిస్తున్నా అంటే అంతా బాలయ్య, బసవతారకం హాస్పిటల్ కారణం అని చెప్పిందని శ్రీలీల పంచుకున్నారు. ఈ విషయం బాలయ్య గారికి కూడా తెలియదని, ఇప్పుడే చెబుతున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











