శ్రీలీలా బాలీవుడ్ డెబ్యూ.. వామ్మో రెచ్చిపోయిందిగా!

టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా ప్రస్తుతం తెలుగులో వరుస పెట్టి చిత్రాలు చేస్తోంది. 'పెళ్లి సందD' చిత్రంతో వెండితెరకు పరిచయం అయిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఇండస్ట్రీలోని ఏలుతున్న విషయం తెలిసిందే. ఏకంగా స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ ల్లో నటించే ఛాన్స్ దక్కించుకొని టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. చివరిగా శ్రీలీలా 'గుంటూరు కారం' చిత్రంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో ఏకంగా సూపర్ స్టార్ కే షాక్ ఇచ్చేలా డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చింది. తన అందం, అభినయంతోనూ అదరగొట్టింది.

ఆ తర్వాతనే ఏకంగా తన కెరీర్ లోనే బిగ్ డిసిజన్ తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచింది. అదే 'పుష్ప2'లో ఐటెం సాంగ్ లో నటించడం. కెరీర్ లో సాఫీగా సాగిపోతున్న క్రమంలోనూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ ప్రాజెక్ట్ 'పుష్ప2'లో స్పెషల్ పెర్ఫామెన్స్ ఇవ్వడం ఇక్కడ ఆసక్తికరంగా మారింది. అయినా నెగ్గింది. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా సిద్ధమైంది. త్వరలోనే అక్కడి ఆడియెన్స్ ను స్ట్రేయిట్ ఫిల్మ్ తో ఆకట్టుకోబోతోంది. కొద్ది రోజులుగా శ్రీలీలా బీటౌన్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యన సైఫ్ అలీఖాన్ కొడుకు ఇబ్రహీం అలీఖాన్ తోనూ ఫొటోలకు ఫోజులిచ్చి ఆకర్షించింది.

Actress Sreeleela Bollywood Debut Romatic Musical Teaser Has Released

ఇక తాజాగా శ్రీలీలా డెబ్యూ ఫిల్మ్ నుంచి ఓ రొమాంటిక్ సాంగ్ విడుదలై ఆకట్టుకుంటోంది. 'భూల్ భూలయ్యా 3'తో హిట్ అందుకున్న బాలీవుడ్ యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటిస్తోంది. అనురాగ్ బసు డైరెక్షన్ చేస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా టీమ్ రొమాంటిక్ గ్లింప్స్ ను విడుదల చేసింది. కార్తీక్ తో గట్టిగానే రొమాన్స్ చేసినట్టు కనిపిస్తోంది. బాలీవుడ్ ఆడియెన్స్ ను తన బుట్టలో పడేసేందుకు మంచి ప్రయత్నం చేస్తున్నదని తెలుస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ ను విడుదల చేయకుండా.. ముందుగా గ్లింప్స్ ను రిలీజ్ చేసి హైప్ పెంచేశారు. దీపావళి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.

ఇక శ్రీలీలా తెలుగులోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ధమాకా, భగవంత్ కేసరి, గుంటూరు కారం వంటి చిత్రాలతో బ్లాక్ బాస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం నితిన్ సరసన 'రాబిన్ హుడ్', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జోడీగా 'ఉస్తాద్ భగత్ సింగ్' లో నటిస్తూ బిజీగా ఉంది. అలాగే మాస్ జాత, సుధా కొంగర డైరెక్ట్ చేస్తున్న 'పరాశక్తి' వంటి చిత్రాల్లో నటిస్తోంది. మొత్తానికి తెలుగు సినిమాలతో పాటు అటు బాలీవుడ్ లోనూ శ్రీలీలా సెన్సేషన్ గా మారేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది. ఇబ్రహీం అలీఖాన్, కార్తీక్ ఆర్యన్ తో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న 'మిట్టి' చిత్రంలోనూ నటిస్తున్నదని తెలుస్తోంది. 2025లో శ్రీలీలా బాలీవుడ్ లో తన లక్ ను పరీక్షించుకోబోతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X