బాలీవుడ్ స్టార్ తో శ్రీలీలా డేటింగ్! కన్ఫమ్ చేసిన హీరో తల్లి?
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తెలుగు చలన చిత్ర పరిశ్రమను ఓ ఊపూపేస్తోందీ ముద్దుగుమ్మ. చిన్న సినిమాతో స్టార్ట్ అయిన యంగ్ బ్యూటీ కెరీర్ ప్రస్తుతం స్టార్ హీరోలకే జోడీగా నటించే స్థాయికి చేరుకుంది. అదికూడా కేవలం రెండుమూడేళ్లలో టాప్ హీరోలకు హీరోయిన్ గా ఎంపిక అవుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే శ్రీలీలా ఓవైపు తెలుగు చిత్రాలతో దుమ్ములేపుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ బసు తెరకెక్కిస్తున్న 'ఆషికీ 3'తో శ్రీలీలా నార్త్ లో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ కు జోడీగా నటిస్తుండటం విశేషం. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన రొమాంటిక్ గ్లింప్స్ ఇంటర్నెట్ ను షేక్ చేసింది. శ్రీలీలా ఒక అడుగు ముందుకేసి రొమాన్స్ లో దుమ్ములేపింది. కార్తీక్ ఆర్యన్ తో ఆన్ స్క్రీన్ పై రెచ్చిపోయిందని తెలుస్తోంది. అయితే ఈ చిత్రానికి ప్రస్తుతం 'ఆషీకీ 3' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కానీ ఇంకా ఇదే టైటిల్ అంటూ టీమ్ అనౌన్స్ మెంట్ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే... శ్రీలీలా డేటింగ్ వార్తలంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. యంగ్ సెన్సేషన్ ప్రేమలో పడిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అది కూడా బాలీవుడ్ యంగ్ స్టార్ కార్తీక్ ఆర్యన్ తోనే శ్రీలీలా ప్రేమలో పడిందని అంటున్నారు. ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారంటూ రూమర్లు గట్టిగానే గుప్పుతున్నాయి. దీనికి ఓ కారణం కూడా చెబుతున్నారు. కార్తీక్ ఆర్యన్ తల్లి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే అందుకు కారణం. తనకు డాక్టర్ వృత్తిలో ఉండే అమ్మాయి కోడలుగా వస్తే బాగుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పిందంట.
అయితే శ్రీలీలా కూడా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్తీక్ ఆర్యన్ తో కలిసి నటించిన చిత్రంలో కాస్తా గట్టిగానే రొమాన్స్ తో ఆశ్చర్యపరిచింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఎక్కడా తన లవ్ లైఫ్ గురించి శ్రీలీలా మాట్లాడలేదు. కనీసం డేటింగ్ అంటూ కూడా ఎప్పుడూ రూమర్లు రాలేదు. కానీ ఇలా బాలీవుడ్ లో అడుగుపెట్టిందో లేదో అలా డేటింగ్ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఈ వార్తల్లో ఏమేరకు నిజమున్నదనేది వేచి ఉండాలి. కొందరు మాత్రం అది అవాస్తమని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ఇక శ్రీలీలా చివరిగా 'గుంటూరు కారం'తో దుమ్ములేపిన సంగతి తెలిసిందే. ఏకంగా సూపర్ స్టార్ మహేశ్ బాబుకే ధీటుగా పెర్ఫామెన్స్ ఇచ్చి ఆకట్టుకుంది. మహేశ్ నుంచి ప్రశంసలు అందుకుంది. మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన కూడా 'ఉస్తాద్ భగత్ సింగ్'లో నటిస్తున్న సంగతి తెలిసిందే. హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు నితిన్ తో కలిసి నటించిన 'రాబిన్ హుడ్' నెక్ట్స్ విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే రవితేజ 'మాస్ జాతర', 'పరాశక్తి' వంటి చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











