Sreeleela: మెగాస్టార్‌తో శ్రీలీల స్పెషల్ సాంగ్.. చిరంజీవితో కలిసి విశ్వంభర కోసం..!
టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీలా వరుస ప్రాజెక్టులతో ఎంత బిజీగా ఉందో తెలిసిందే. హీరోయిన్ గా పెళ్లి సందD.. చిత్రం మొదలు ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. చిన్న హీరోలతో సినిమాలు చేసిన శ్రీలీలా.. కొన్నాళ్లుగా బడా హీరోల సరసన నటిస్తూ మరింత సెన్సేషన్ గా మారుతున్న సంగతి తెలిసిందే. నటిగా శ్రీలీలాకు ఆడియన్స్ వందకు వందశాతం మార్కులు వేశారు. ఆమె అందం, అభినయం, డాన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యంగ్ హీరోయిన్ గా పరిచయం అయ్యి ఇప్పుడు స్టార్ హీరోయిన్లనే వెనక్కి నెట్టేసింది.
అతి తక్కువ సమయంలోనే టాలీవుడ్ లో ఉన్న బడా హీరోల సరసన నటించిన హీరోయిన్ గా శ్రీలీలా రికార్డు క్రియేట్ చేసింది. బాలకృష్ణకి కూతురుగా, మహేష్ బాబుకు ప్రేయసిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని, పంజా వైష్ణవ తేజ్, నితిన్ వంటి హీరోలకు జోడిగా నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది. త్వరలో ఈ ముద్దుగుమ్మ నితిన్ సరసన నటించిన ' రాబిన్ హుడ్' చిత్రంతో అలరించేందుకు సిద్ధమవుతుంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ను ఖరారు చేయాల్సి ఉంది.

హీరోయిన్ గా శ్రీలీలా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు ఈ యంగ్ బ్యూటీ ఐటెం సాంగ్స్ తోనూ సెన్సేషనల్ గా మారుతుంది. బడా హీరోల సరసన నటించే అవకాశాలు దొరికినా, బ్యాక్ టు బ్యాక్ మూవీ ఆఫర్స్ అందుతున్నా స్పెషల్ అప్పియరెన్స్ తో బిగ్ ప్రాజెక్టుల్లో మెరుస్తూ సందడి చేస్తోంది. అప్పటికే శ్రీలీలా డాన్స్ తో యువతను ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ మూవీ ' పుష్ప2 : ది రూల్'లో కిసిక్ సాంగ్ తో దుమ్ము లేపిన సంగతి తెలిసిందే.
శ్రీలీలా ఐటెం సాంగ్ కు ఎంత రెస్పాన్స్ వచ్చిందో పుష్ప2తో చూసాం. అయితే ఆమె అభిమానులు తన నుంచి రాబోయే కొత్త చిత్రాల గురించి ఎదురు చూస్తున్న తరుణంలో మరో క్రేజీ అప్డేట్ అందింది. శ్రీలీలా మరోసారి వెండితెరపై గ్లామర్ స్టెప్పులు వేసేందుకు సిద్ధమవుతోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విత్ యాక్షన్ జొన్నర్ లో రూపుదిద్దుకుంటున్న ' విశ్వంభర' చిత్రంలో నటించబోతోంది. మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్లో చిందులు వేయబోతుందని తెలుస్తోంది. బాస్ గ్రేస్ కు, శ్రీలీల స్పీడుకు మాస్ స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతాయని మెగా అభిమానులు సంబరపడుతున్నారు.

అయితే విశ్వంభర సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ గురించి మరింత స్పష్టత రావాల్సి ఉంది. రీసెంట్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శ్రీలీలకు దుర్గాదేవి విగ్రహాన్ని బహుకరించాడు. అది కూడా విశ్వంభర సెట్స్ లో ఇవ్వడం పట్ల ఈ విషయం బయటకు వచ్చింది. ఏదేమైనా శ్రీలీల చిరు కాంబినేషన్ లో వచ్చే గ్రేస్ ఫుల్ సాంగ్ సెన్సేషనల్ హిట్ అవుతుందని అభిమానులు, ఆడియన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక శ్రీలీలా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా ' ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ పైన ఈ ముద్దుగుమ్మ కన్నేసింది. ఇలా బిజీ ప్రాజెక్ట్స్ తో స్టార్ హీరోయిన్లకే షాక్ ఇస్తుంది.


Click it and Unblock the Notifications











