అమ్మ పక్కనుంటే ప్రేమించగలనా? పెళ్లిపై తేల్చేసిన శ్రీలీల

ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్‌లలో బిజీగా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది శ్రీలీల అని చెప్పొచ్చు. తెలుగు, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఆమె బిజీగా ఉన్నారు. చేసిన సినిమాలలో సగానికి పైగా ఫ్లాప్ అయినప్పటికీ శ్రీలీల డిమాండ్ మాత్రం తగ్గడం లేదు. సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్‌తో కోట్లలో సంపాదిస్తున్నారు శ్రీలీల. అందరి హీరోయిన్ల మాదిరిగానే శ్రీలీల ఎఫైర్స్‌పై రూమర్స్ వస్తున్నాయి. తాజాగా తన పెళ్లి, రిలేషన్‌పై శ్రీలీల ఓపెన్ అయ్యారు. ఈ వివరాల్లోకి వెళితే..

బాలీవుడ్ ఎంట్రీ
ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ సరసన మాస్ జాతర, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్, తమిళంలో పరాశక్తి సినిమాలలో శ్రీలీల నటిస్తున్నారు. కన్నడంలో గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటీ రెడ్డి హీరోగా నటించిన జూనియర్‌లో శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. జూలై 18న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమాలో శ్రీలీల తన డ్యాన్సింగ్ స్కిల్స్‌తో మరోసారి మెస్మరైజ్ చేశారు. ఇక ఈ ఏడాది బాలీవుడ్‌లో ఆమె నటించి తొలి సినిమా రిలీజ్ కానుంది. కార్తీక్ ఆర్యన్ సరసన ఆషీకి 3 దీపావళికి రిలీజ్ కానుంది.

Actress sreeleela reacts on her relation rumours with kartik aaryan and marriage

కార్తీక్ ఆర్యన్‌తో డేటింగ్‌లో ఉన్నారా?
ఈ సినిమా సమయంలోనే శ్రీలీల పర్సనల్ లైఫ్‌పై రూమర్స్ వస్తున్నాయి. కార్తీక్ ఆర్యన్‌తో ఈ ముద్దుగుమ్మ ప్రేమలో పడ్డారని.. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తనకు కాబోయే కోడలు డాక్టరైతై బాగుండు అని కార్తీక్ తల్లి పబ్లిక్‌గా చెప్పడంతో పాటు ఓ ఈవెంట్‌లో ఆమెతో శ్రీలీల కనిపించడం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక ఇటీవల కార్తీక్ ఆర్యన్ - శ్రీలీలలు ఓ రెస్టారెంట్‌కు వెళ్లి మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. దాంతో వీరిద్దరూ రిలేషన్‌లో చాలా దూరం వచ్చేశారని త్వరలో పెళ్లి చేసుకోవడం ఖాయమని తేల్చేస్తున్నారు సినీ జనాలు.

శ్రీలీల సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?
కొద్దిరోజుల క్రితం పెళ్లికూతురిలా ముస్తాబై, బుట్టలో వస్తున్న శ్రీలీల ఫోటోలు వైరల్ అయ్యాయి. శ్రీలీల సైలెంట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై శ్రీలీల వెంటనే స్పందించారు. తిథుల ప్రకారం, సాంప్రదాయం బద్ధంగా తన పుట్టినరోజును నిర్వహించారని అంతే తప్పించి అందరూ అనుకుంటున్నట్లుగా తాను పెళ్లి చేసుకోడం లేదని తెలిపింది. తాజాగా జూనియర్ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర యూనిట్‌ను స్టార్ యాంకర్ సుమ కనకాల ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా బుట్ట ప్రస్తావన తీసుకొచ్చారు సుమ. దీనికి శ్రీలీల ఆన్సర్ ఇచ్చారు.

అమ్మ పక్కనే ఉంటోంది
తిథి ప్రకారం తన ఇంట్లో పుట్టినరోజు వేడుకలు జరిగి చాలా కాలం అవ్వడంతో నా బ్రదర్స్, కుటుంబ సభ్యులు ఈ విధంగా బర్త్ డే చేశారని శ్రీలీల పేర్కొన్నారు. తనకు ప్రస్తుతం 23 ఏళ్లేనని, కనీసం 30 ఏళ్లు వచ్చే వరకు అసలు పెళ్లి చేసుకోనని శ్రీలీల వెల్లడించారు. అలాగే తను కొందరితో రిలేషన్‌లో ఉన్నానని, ప్రేమిస్తున్నానని అంతా అనుకుంటున్నారని.. దీనిపై మీడియాలోనూ గాసిప్స్ వస్తున్నాయి ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నేను ఎక్కడికి వెళ్లినా అమ్మ నాతో పాటే ఉంటుందని, చివరికి మియామీ వెళ్లినప్పుడు కూడా ఆమె నా పక్కన ఉందని శ్రీలీల చెప్పారు. అలాంటప్పుడు నేను ఎలా ప్రేమించగలను, ఎలా ప్రేమలో పడతాను అని ఆమె ప్రశ్నించారు. ప్రస్తుతం శ్రీలీల వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

More from Filmibeat

Read more about: sreeleela kartik aaryan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X