For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఐశ్వర్య రాజేష్ తల్లి గురించి కమెడియన్ శ్రీ లక్ష్మి సంచలనం.. అందుకే రాజేష్ చనిపోయాడంటూ !

  |

  లేడీ కమెడియన్స్ లో తనదైన ముద్ర వేసుకున్నారు శ్రీలక్ష్మి. తెలుగులో వందల సినిమాల్లో లేడీ కమెడియన్ పాత్రలలో నటించిన ఆమె ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరమయ్యారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు తెర మీద కనిపిస్తున్న ఆమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తమ్ముడి మరణం గురించి ఆయన భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీ లక్ష్మి సోదరుడు రాజేష్ ఒకప్పుడు తెలుగు సినిమాల్లో కీలక పాత్రలలో నటించారు. కొన్ని సినిమాల్లో హీరోగా కూడా ఆయన నటించారు.. ఆయన కుమార్తె ఐశ్వర్య రాజేష్ ప్రస్తుతం తమిళ, తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా కొనసాగుతోంది.

  సముద్ర తీరంలో సానియా గ్లామర్ డోస్.. యువ హీరోయిన్ గ్లామర్ జోరు

   ఐశ్వర్య తల్లిని పెళ్లి చేసుకోవడం వల్లే

  ఐశ్వర్య తల్లిని పెళ్లి చేసుకోవడం వల్లే

  అయితే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తమ్ముడి మరణం గురించి శ్రీలక్ష్మి కీలక వ్యాఖ్యలు చేశారు.. తన తమ్ముడు ఐశ్వర్య తల్లిని పెళ్లి చేసుకోవడం వల్ల చనిపోయాడని ఆమె చెప్పుకొచ్చారు. ఐశ్వర్య తల్లి కూడా తెలుగు ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అని వారిద్దరి మధ్య ఎలా పరిచయం అయిందో తెలియదు కానీ ఇద్దరూ ప్రేమలో పడ్డారు అని చెప్పుకొచ్చింది.. తన తల్లితో కలిసి తాను ఒక సినిమా షూటింగ్ నిమిత్తం లక్కవరం అనే ప్రాంతానికి వెళ్ళామని, తిరిగి వచ్చేసరికి రాజేష్ ఆమెతో ప్రేమలో ఉన్న విషయాన్ని తెలిపి తమ ఇద్దరికీ పెళ్లి చేయమని కోరాడు అని చెప్పుకొచ్చింది. అయితే తన తల్లి ఒక ఆరు నెలల సమయం ఆగి పెళ్లి చేసుకోవాలని కోరినా సరే వినకుండా వారి పెళ్లి కోసం తొందర పడ్డారని పేర్కొంది.

   మందుకు బానిసగా మారి

  మందుకు బానిసగా మారి

  అయితే పెళ్ళికి ముందు రాజేష్ కి సినిమా అవకాశాలు ఇప్పిస్తానని ఆయన భార్య నాగమణి చెప్పిందని, అయితే వివాహం అయ్యాక హీరో అవకాశాలు కాదు కదా చిన్న చిన్న పాత్రలకు కూడా ఆయనను రికమండ్ చేసే పరిస్థితి లేదని ఆమె చెప్పుకొచ్చింది. దీంతో వారిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని శ్రీ లక్ష్మి పేర్కొన్నారు. అప్పటికే ఆమె డాన్సర్ గా సలీం మాస్టర్ వద్ద పనిచేసేదని కానీ తనకు అవకాశాలు రాకపోవడంతో ఆమెను కూడా డాన్స్ కార్యక్రమాలకు వెళ్ళకుండా తన తమ్ముడు అడ్డం పడ్డాడు అని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది. అలా మందుకు బానిసగా మారి తన తమ్ముడు ఆమెను కూడా తన వృత్తి చేసుకోకుండా అడ్డుపడ్డారని పేర్కొంది.

  అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి

  అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి

  అలా వీరిద్దరి మధ్య వివాదాలు పెద్దయి ఒకరినొకరు ద్వేషించుకొనే స్థాయికి వెళ్లిందని చెప్పుకొచ్చింది. కొన్నాళ్లపాటు అందరం కలిసి ఉన్నామని తర్వాత వీరిద్దరూ విడిగా వేరే చోట కాపురం పెట్టారని ఆమె పేర్కొంది. అయితే ఇద్దరూ వేరు వేరు రంగాలకు చెందిన వ్యక్తులు అయితే ఇంత రాద్దాంతం జరిగేది కాదని తన తమ్ముడు ప్రాణం వదిలేసి వెళ్లిపోయాడు కాదని ఆమె కాస్త ఉద్వేగానికి లోనయ్యారు. తనకు రాఘవేంద్రరావు దాసరి నారాయణరావు లాంటి వాళ్లతో పరిచయాలు ఉన్నాయని హీరో అవకాశాలు ఇప్పిస్తానని నమ్మబలికి తన తమ్ముడిని ఆమె వివాహం చేసుకుందని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చింది.

  బాధ కలిగిస్తోంది

  బాధ కలిగిస్తోంది


  ఈ విషయాలు ఇండస్ట్రీలో పెద్దలు అందరికీ తెలుసని కానీ ఇప్పుడు మాత్రం నాగమణి తన పిల్లలకు తన తమ్ముడు రాజేష్ మోసం చేశాడని చెబుతోందని చెప్పుకొచ్చారు. శబ్దం రావాలంటే రెండు చేతులు కలవాలని అలాగే ఇక్కడ జరిగిన తప్పులో కూడా ఇద్దరిదీ భాగం ఉందని ఆమె పేర్కొన్నారు. కానీ తన బిడ్డలకు మాత్రం రాజేష్ మోసం చేశాడు అన్నట్టు ఆమె చెప్పడం తనకు బాధ కలిగిస్తోందని శ్రీలక్ష్మి చెప్పుకొచ్చారు.

  Pushpa Action Scenes Visual Treet, సుక్కు మార్క్ ట్విస్ట్ | Allu Arjun || Filmibeat Telugu
   జనం మర్చిపోయి ఉండేవారు

  జనం మర్చిపోయి ఉండేవారు

  ఇక తాను హీరోయిన్ గా చేసిన సినిమా గురించి ప్రస్తావిస్తూ తను హీరోయిన్ గా గనుక స్థిరపడి ఉంటే కేవలం నాలుగేళ్లకు ఫేడవుట్ అయిపోయే దానిని అని అన్నారు. అలా కాకుండా ఇలా కామెడీ పాత్రలు చేయడం వల్ల ఇప్పటికీ తాను సినిమాల్లో నటించే అవకాశం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఒకవేళ హీరోయిన్ పాత్రలు చేసి ఉంటే ఎప్పుడో తను జనం మర్చిపోయి ఉండేవారని ఆమె చెప్పుకొచ్చారు.

  English summary
  Actress Sri Lakshmi sensational comments on Aishwarya Rajesh Mother. as we all know aishwarya rajesh is daugther of srilakshmi brother rajesh. she made sensational comments on aishwarya mother nagamani
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X