నేను చచ్చిపోయాక జరిగేది ఇదే... శ్రీరెడ్డి చేస్తున్న పనికి అంతా షాక్!

Recommended Video

Sri Reddy Latest Video Goes Viral || Filmibeat Telugu

కాస్టింగ్ కౌచ్ ఇష్యూలో రోడ్డు మీద గుడ్డలిప్పి హల్ చల్ చేయడమో? లేక తరచూ కాంట్రవర్సీలతో వార్తల్లో నిలుస్తున్న సందర్భాలో? కారణాలేవైనా నటి శ్రీరెడ్డి మీద చాలా మందిలో మంచి అభిప్రాయం కంటే చెడ్డ అభిప్రాయమే ఎవగా ఉంది. అయితే తాను చెడ్డదాన్ని కాదు, మంచిదాన్ని అంటోంది ఈ కాంట్రవర్సల్ బ్యూటీ.

నిన్న రాత్రి పబ్బుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించిన శ్రీరెడ్డి... ఉదయం అందుకు పూర్తిగా భిన్నమైన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. శ్రీరెడ్డిలో ఈ డిఫరెంట్ యాంగిల్స్ చూసి ఆమెను సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారు ఆశ్చర్యపోతున్నారు.

నేను మంచి అమ్మాయిని కూడా...

నేను మంచి అమ్మాయిని కూడా...

పబ్బల్లో, బార్లలో తనను చూసిన చాలా మంది బ్యాడ్ గర్ల్ అని కామెంట్ చేయడంతో.... ఉదయం గుడిలో దర్శనమిచ్చారు. దేవాలయాన్ని క్లీన్ చేస్తూ కనిపించారు. తాను మంచి అమ్మాయిని కూడా, ఇలా గుడిని క్లీన్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అని పేర్కొన్నారు.

నేను చనిపోయాక నా ఆత్మ ఇక్కడికే..

నేను చనిపోయాక నా ఆత్మ ఇక్కడికే..

ఇలా గుడిని క్లీన్ చేస్తూ దేవుడికి సేవ చేయడంలో ఎలాంటి తప్పు లేదని నా అభిప్రాయం. నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ ఇక్కడికే వస్తుంది. నేను ఇక్కడ కేవలం గుడిని మాత్రమే క్లీన్ చేయడం లేదు, బ్యాడ్ థాట్స్ నుంచి నా మనసును క్లీన్ చేసుకుంటున్నాను అంటూ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు.

నా జీవితం నా ఇష్టం

నేను నా జీవితాన్ని ఇలాగే ఎంజాయ్ చేస్తాను... మీకేమైనా సమస్యా? రాత్రి పూట వైన్ తాగుతాను, ఉదయం శివాలయానికి వచ్చి అభిషేకం చేస్తాను. ఇది నా జీవితం, నాకు నచ్చినట్లు నేను ఉంటాను. నా జీవితాన్ని జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదంటూ శ్రీరెడ్డి పేర్కొన్నారు. తనపై నెగెటివ్ కామెంట్స్ చేసే వారిని ఉద్దేశించి ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

ఎవరితో అయినా సంవత్సరమే..

ఎవరితో అయినా సంవత్సరమే..

అంతకు ముందు మరో పోస్టులో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని శ్రీరెడ్డి తెలిపారు. నేను నా తల్లిదండ్రులను తప్ప ఎవరినీ ప్రేమించలేను. ఒకవేళ ఎవరైనా వ్యక్తిని ఇష్టపడితే.. అతడితో కేవలం సంవత్సరం మాత్రమే డేటింగ్ చేస్తా. కొన్ని రోజుల తర్వాత అతడు బోర్ కొడతాడు. ఆ తర్వాత నాకు కొత్త ప్రేమ కావాలని అనిపిస్తుంది. నా మైండ్ సెట్ ప్రకారం పెళ్లి అనేది నాకు సూటవ్వదు. అందుకే వివాహానికి దూరంగా ఉంటున్నాను. ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు. ఇలాగే నాకు నచ్చినట్లుగా జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నట్లు శ్రీరెడ్డి వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X