For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అజిత్, ఎన్టీఆర్, మహేష్‌పై శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్.. ఆయనతో లవ్.. పక్కమీదకి వెళ్లను!

  |
  Sri Reddy Interesting Comments On Jr NTR, Ajith, Mahesh Babu | Filmibeat Telugu

  వివాదాస్పద నటి శ్రీరెడ్డి సెన్సేషనల్ కామెంట్లతో, అభ్యంతరకరమైన వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతుండటం తరచుగా కనిపిస్తుంటుంది. తాను చేసే కామెంట్లు ఎక్కువగా మెగా ఫ్యామిలీ, దగ్గుబాటి కుటుంబాన్ని టార్గెట్‌గా చేసుకొని చేస్తుండటం తెలిసిందే. తాజాగా తమిళ సూపర్‌స్టార్ అజిత్ కుమార్, తెలుగు సూపర్‌స్టార్లు మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌పై కామెంట్లు చేయడం మీడియాలో పతాక శీర్షికలను ఆకర్షించింది. ఈ ముగ్గురు స్టార్ హీరోల ఉద్దేశించి ఇటీవల శ్రీరెడ్డి ఏమన్నారంటే...

   అజిత్ కుమార్ గురించి

  అజిత్ కుమార్ గురించి

  అజిత్ కుమార్ గురించి కామెంట్ చేస్తూ.. ఆయనంటే నాకు మొదటి నుంచి క్రష్. అది వన్ సైడ్ లవ్ మాత్రమే అని శ్రీరెడ్డి పేర్కొన్నది. అజిత్ సినిమాలు చూడకుండా పక్క మీదకు కూడా వెళ్లను. ఆయన ఫొటో చూడకుండా నిద్రపోను. తమిళ చిత్ర పరిశ్రమలో అజిత్ నంబర్‌వన్ హీరో. వివాదాలకు చాలా దూరంగా ఉండటం నాకు నచ్చే అంశం అని శ్రీరెడ్డి పేర్కొన్నది.

  అజిత్ నా హృదయాన్ని దోచుకొన్నాడు

  అజిత్ నా హృదయాన్ని దోచుకొన్నాడు

  అజిత్ సౌమ్యశీలి. ఫ్యామిలీ వ్యాల్యూస్ ఎక్కువగా పాటిస్తాడు. అభిమానులంటే చెప్పలేనంత గౌరవం. గొప్ప మానవత్వం ఉన్న వ్యక్తి. ఆయన తీక్షణమైన చూపులు నాకు చాలా ఇష్టం. గొప్ప భర్తనే కాకుండా తండ్రి కూడా. నాతోపాటు కోట్లాది మంది అమ్మాయిల హృదయాలను దోచుకొన్న హీరో అతను. నీ కాళ్లకు మొక్కుతా థలా అంటూ సోషల్ మీడియాలో శ్రీరెడ్డి ఓ పోస్టు పెట్టింది.

  పుట్టుకతో వ్యభిచారినా? వాళ్లే చిదిమేశారు.. పడుకోకపోతే సాధించలేవని.. నేను ఒంటరిగా ఉంటే.. శ్రీరెడ్డి

  జూనియర్ ఎన్టీఆర్ గురించి

  జూనియర్ ఎన్టీఆర్ గురించి

  తెలుగు హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ అంటే కూడా ఇష్టం. ఆయనను బిగ్‌బాస్ తెలుగు హోస్ట్‌గా మళ్లీ చూడాలనుకొంటున్నాను. బిగ్‌బాస్ తెలుగు మూడో సీజన్‌కు ఆయన హోస్ట్‌గా రావాలని కోరుకొంటున్నాను. అంకితభావం, ఫోకస్ ఉన్న ఉత్తమ హీరో. అన్ని వయసుల మహిళలు ఇష్టపడే వ్యక్తి. టాలీవుడ్‌కు మీరే బాస్. బిగ్‌బాస్ 3 కోసం వెయిట్ చేస్తున్నాను అని శ్రీరెడ్డి వెల్లడించింది.

   జూనియర్ ఎన్టీఆర్‌కు జై కొట్టండి

  జూనియర్ ఎన్టీఆర్‌కు జై కొట్టండి

  జూనియర్ ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ సూపర్బ్ మూవీ. అలాంటి చిత్రంలో నటించినందుకు తారక్‌కు ఒకసారి జై వేసుకోండి రా. మొక్కలను, చెట్లను కాపాడుకోవటం గురించి బాగా చెప్పారు. అమెరికాలో మొక్కలు నాటితేనే ఆ ఇంటికి అధికారులు అనుమతి ఇస్తారు. అలాంటి నిబంధన ఇండియాలో కూడా పెట్టాలి. ఈ ఏడాది నేను 100 మొక్కలను నాటాను. నాలో స్ఫూర్తిని నింపిన జనతా గ్యారేజ్ మూవీ టీమ్‌కు నా హ్యాట్సాఫ్ అని శ్రీరెడ్డి చెప్పింది.

  మహేష్ బాబు వివాదాలకు దూరంగా

  మహేష్ బాబు వివాదాలకు దూరంగా

  సూపర్ స్టార్ మహేష్ బాబుపై కూడా శ్రీరెడ్డి ప్రశంసలు కురిపించింది. తెలుగు సినిమా పరిశ్రమలోఎలాంటి వివాదాల జోలికి వెళ్లని.. క్లీన్ హీరో మహేష్ బాబు మాత్రమే. అది మహేష్‌బాబుకు మాత్రమే సాధ్యం. ఆయన ప్యూర్‌గా ఫ్యామిలీ మ్యాన్. ఇన్సిపిరేషన్ కథలను తన సినిమాలకు ఎంచుకోవడం నాకు బాగా నచ్చుతుంది. ఆయన ఎంచుకొనే సబ్జెక్టులకు, సింప్లిసిటికి నేను అభిమానిని. ఆయన రాజకీయాల్లోకి ఆహ్వానిస్తే ఏ పార్టీలో చేరితే మంచిదో చెప్పండి అంటూ శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో కోరింది.

  English summary
  Actress Sri Reddy made sensational comments on south Super stars Ajith Kumar, Mahesh Babu, Jr NTR. Sri reddy said, She like thier simplicity and family values.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X