ఆ డైరెక్టర్ కరోనా వైరస్ కంటే డేంజర్.. దారుణంగా ఇబ్బంది పెడుతున్నాడు.. శ్రీరెడ్డి

వివాదాస్పద తార శ్రీరెడ్డి నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో మీడియాలో నలుగుతూనే ఉండటం తెలిసిందే. పలువురు సినీ ప్రముఖులను, నటులను టార్గెట్‌గా చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువుగా నిలుస్తుంది. తాజాగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. ఇంతకు ఆర్జీవిని ఏమని కామెంట్ చేసిందంటే...

కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో

దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రాంగోపాల్ వర్మ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. డియర్ వైరస్.. గుడ్డిగా అందరి ప్రాణాలు తీసే నీకు.. అసలు విషయం తెలియడం లేదు. నీవు తెలుగుకోవాల్సినదేమిటంటే.. మాతో పాటు నీవు కూడా అంతమైపోతున్నావనే విషయాన్ని గ్రహించలేకపోతున్నావు అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు.

కరోనా వైరస్‌ గురించి వర్మ

కరోనా వైరస్‌ గురించి వర్మ

ఇంకా కరోనా వైరస్‌పై స్పందిస్తూ.. నా మాటలపై నమ్మకం లేకపోతే.. వైరాలజీలో క్రాష్ కోర్సు చేయండి. నీకు నేనిచ్చే సలహా ఏమిటంటే.. బతుకు.. ఇతరులను బతికించు. నా మాటలు నీకు కొంతైనా విజ్క్షానాన్ని లభిస్తుందని భావిస్తున్నా అంటూ వర్మ తన ట్వీట్‌‌లో పేర్కొన్నారు.

కరోనా వైరస్ కంటే డేంజరస్

కరోనా వైరస్ కంటే డేంజరస్

ఆర్జీవీ తాజా వ్యాఖ్యల అనంతరం ఆయనపై ఉన్న ప్రేమ, అభిమానంతో శ్రీరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ఆర్జీవి కరోనా వైరస్ కంటే ప్రమాదకరం అని పేర్కొన్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నీవు కరోనా వైరస్ కంటే ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నావు. నేను ఇంకా మిమ్నల్ని ప్రేమిస్తునే ఉన్నాను. వ్యక్తిగతంగా జీఎస్టీలో కనిపించినట్టుగా ఉండటానికి సిద్ధం అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేసింది.

 వర్మ, శ్రీరెడ్డి మధ్య

వర్మ, శ్రీరెడ్డి మధ్య

అందాల తార శ్రీరెడ్డి, దర్శకుడు రాంగోపాల్ వర్మకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో వారిద్దరూ రొమాంటిక్‌గా పలకరించుకొంటారు. వారిద్దరి మధ్య సంబంధాలు ఎంత క్లోజ్‌గా ఉంటాయంటే.. పవన్ కల్యాణ్‌ను తిడితే మీడియాలో అటెన్షన్ పెరుగుతుందనే అంతగా ఉంది.

Recommended Video

Sri Reddy Negative Facebook Post On HIT Movie And Hero Nani | Filmibeat Telugu
కరోనాపై సెలబ్రిటీల స్పందన

కరోనాపై సెలబ్రిటీల స్పందన

ప్రపంచ దేశాలను కరోనా వైరస్ భయంకరంగా వణికిస్తున్నది. పలు దేశాలతోపాటు చైనాలో భారీ సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. భారీ సంఖ్యలో కేసులను గుర్తిస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ సినీ సెలబ్రిటీలు సలహాలు, సూచనలను సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వర్మను ఉద్దేశించి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X