ఆయన ఓ తుగ్లక్.. నీకు ఆ స్థాయి లేదు.. మనిషివేనా అంటూ పవన్ కల్యాణ్, నాగబాబుపై శ్రీరెడ్డి ధ్వజం
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీసుకొన్న నిర్ణయాన్ని తప్పుబడుతూ విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన కామెంట్లు సినీ వర్గాల్లో వివాదంగా మారాయి. అయితే ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించి.. ఘాటుగా సమాధానం చెప్పారు. అయితే ప్రకాశ్ రాజ్‌పై కామెంట్లు చేసిన నాగబాబు, బండ్ల గణేష్‌ను విమర్శిస్తూ పవన్ కల్యాణ్‌ను శ్రీరెడ్డి టార్గెట్ చేసుకొన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి..

ఎందుకు విత్‌డ్రా చేసుకొన్నారో..
పవన్ కల్యాణ్ ఎందుకు పార్టీ పెట్టుకొన్నారో అర్ధం కావడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 60 మంది అభ్యర్థుల నామినేషన్లు ఎందుకు వెనుకకు తీసుకొన్నారో సమాధానం లేదు. పార్టీ పెడితే ఎన్నికల్లో పోటీ చేయాలి. మరెందుకు చేయడం లేదు. ఎందుకు నామినేషన్ వేయించినట్టు.. ఎందుకు విత్ డ్రా చేయించినట్టు? అంటూ శ్రీరెడ్డి ప్రశ్నించారు.

జనసేన కార్యకర్తలు ఏం కావాలి అంటూ
జనసేన పార్టీ పెట్టి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు. ఆ పార్టీ ఫండ్స్ ఏమవుతున్నాయి? సినిమాలు చేసుకొంటూ పోతున్నావు? నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏం కావాలి? రాజకీయంగా ఎదుగుదామని అనుకొంటున్న నేతలు ఏం కావాలి? ఇలాంటి నిర్ణయాలు తీసుకొంటే నీ గురించి ఏమనుకోవాలి అంటూ శ్రీరెడ్డి ఘాటుగా స్పందించారు.

ట్విట్టర్‌లో ఒకటి.. మైక్ ముందు మరోకటి
రాజకీయాల్లో పవన్ కల్యాణ్ తుగ్లక్‌లా బిహేవ్ చేస్తున్నాడు? ఇంత వరకు ఆయనను ఏమీ అనలేదు. నేనే తుగ్లక్ అని అంటున్నాను. ఏ రోజు ఏం మాట్లాడుతాడో అర్ధం కాదు. ట్విట్టర్‌లో ఒకటి.. మైక్ ముందు మరోకటి మాట్లాడుతాడు. ఈయన తీరుపై తమిళనాడు పత్రికలు విచ్చలవిడిగా కామెంట్ చేస్తున్నాయి.. రకరకాలుగా రాస్తున్నాయి అంటూ శ్రీరెడ్డి అన్నారు.

మీ సామాజిక వర్గాన్ని కన్‌ఫ్యూజ్
పవన్ కల్యాణ్ గారు.. మీకు రాజకీయాలు అనవసరం. తమిళ పత్రికలు మీ నిర్ణయాలను చూసి కామెడీ చేస్తున్నాయి. మీ నిర్ణయాలతో మీ సామాజిక వర్గాన్ని, నేతలను, కార్యకర్తలను, అభిమానులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మీ పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా సొంతంగా పోటీ చేయడం తెలియదా. నీవు మనిషివా; నాగబాబువా? అంటూ శ్రీరెడ్డి ఘాటుగా విమర్శించారు.

జనం వెర్రివాళ్లు కాదు.. అంటూ
ఇక నాగబాబు గురించి మాట్లాడుతూ.. ప్రకాశ్ రాజ్‌ను విమర్శించే స్థాయి నీకు లేదు. నీవు యాక్టర్‌గా ప్రూవ్ చేసుకోలేదు. నిర్మాతగా ప్రూవ్ చేసుకోలేదు. ఒక కమెడియన్‌గా, జడ్జిగా ప్రూవ్ చేసుకోలేదు. ఆంధ్రా, తెలంగాణ జనాలు అంత వెర్రివాళ్లు కాదు. ప్రకాశ్ రాజ్, జగన్ మీద గానీ, మరెవరి మీద గానీ కామెంట్ చేయడానికి హక్కు లేదు అంటూ శ్రీరెడ్డి కామెంట్ చేశారు.


Click it and Unblock the Notifications











