twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sri Reddy : తీవ్ర అనారోగ్యంతో నెల నుంచి మిస్సింగ్.. అసలు ఏమైంది?

    |

    చేసిన సినిమాల కంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ముందు చేసిన నగ్న ప్రదర్శన తోనే పాపులర్ అయింది నటి శ్రీరెడ్డి.. దగ్గుబాటి వారసుడు రానా తమ్ముడు అభిరామ్ తనను లైంగికంగా వాడుకున్నాడు అంటూ ఆమె చేసిన సంచలన వ్యాఖ్యలు అప్పట్లో టాలీవుడ్ లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే ఆ తర్వాత అనూహ్యంగా చెన్నైకి మకాం మార్చేసిన శ్రీరెడ్డి సుమారు నెల రోజుల నుంచి ఫేస్ బుక్ లో యాక్టివ్ గా లేదు. ఆమెకు కరోనా సోకిందని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది అని ప్రచారం జరుగుతుండగా అనూహ్యంగా వెలుగులోకి వచ్చిన శ్రీ రెడ్డి తన ఆరోగ్యం గురించి సంచలన విషయాలు వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళితే

    చెన్నైకి మకాం మార్చి

    చెన్నైకి మకాం మార్చి

    టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అంశం తర్వాత చెన్నై వెళ్ళిపోయింది శ్రీరెడ్డి. అక్కడే నివాసం ఉంటూ యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి విభిన్నంగా ఏదో చేయాలని ప్రయత్నిస్తోంది. ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వేదికగా రాజకీయ అంశాలు సినిమాలకు సంబంధించిన విషయాలు పంచుకుంటూ ఎవర్నో ఒకర్ని టార్గెట్ చేస్తూ బూతులతో రెచ్చిపోయే ఈ భామ సుమారు నెల రోజులుగా ఎలాంటి పోస్టులు పెట్టకపోవడం సంచలనంగా మారింది.

    ఆమె తన ఫేస్ బుక్ పేజీలో జూలై 12 వ తేదీన చివరిగా ఒక కారు తో దిగిన ఫోటోలు పోస్ట్ చేసింది తర్వాత నెల రోజుల నుంచి ఆమె ఫేస్ బుక్ లో ఎలాంటి పోస్టులు పెట్ట లేదు.

    నెల నుంచి మిస్సింగ్

    నెల నుంచి మిస్సింగ్

    దానికి తగ్గట్టుగా ఆమె యూట్యూబ్ ఛానల్ లో కూడా చాలా సైలెంట్ అయిపోవడంతో అసలు శ్రీరెడ్డి ఏమైపోయింది ? అనే అనుమానం అందరికి మొదలైంది. నిజానికి తన మిత్రుడు కత్తి మహేష్ మరణించినప్పుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన శ్రీరెడ్డి అందరం ఏదో ఒక రోజున పోవాల్సిన వాళ్ళమే కదా అంటూ చెప్పుకొచ్చింది..

    అంతకు ముందే తన స్నేహితులు ఇద్దరు సూసైడ్ చేసుకుని చనిపోయారని తాను చాలా డిప్రెషన్లో ఉన్నానని కూడా ఆమె కామెంట్ చేయడం తో అసలు ఆమెకు ఏమైంది ? అనే అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది కొన్ని మీడియా సంస్థలు ఆమెకు కరోనా సోకగా ఆమె దానికి చికిత్స తీసుకుంటుందని ప్రస్తుతం అనారోగ్యం గా ఉందని ప్రచారం జరుగుతూ ఉండగా తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అసలు తనకు ఏం జరిగింది అనే విషయం మీద క్లారిటీ ఇచ్చింది.

    అసలు ఏమైంది అంటే

    అసలు ఏమైంది అంటే

    తాను ఫేస్బుక్ కి దూరంగా ఉండడానికి కారణం కరోనా అని ప్రచారం జరుగుతుండగా నిజానికి అది కారణం కాదని ఆమె క్లారిటీ ఇచ్చింది. తనకు డిప్రెషన్ ఎక్కువ కావడంతో డాక్టర్ను సంప్రదించానని డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే ఆయన కొంత టాబ్లెట్లు ఇచ్చారని ఆ టాబ్లెట్ లు వాడుతూ ఉండడం వల్ల ఫేస్బుక్ వాడటం లేదని చెప్పుకొచ్చారు.

    అంతేకాక చెన్నై లో ఉన్న ఇల్లు మారానని అందుకే ఫేస్బుక్ వాడటం లేదని చెప్పుకొచ్చింది. టాబ్లెట్స్ వాడుతూ ఉండడం హైదరాబాద్ - చెన్నై కొన్నిసార్లు ప్రయాణం చేయడం వల్ల ఈ ఫేస్బుక్ కి దూరంగా ఉన్నానని ఆమె వెల్లడించగా ఈ డిప్రెషన్ అనే ఇబ్బంది లాక్ డౌన్ కారణంగా దాదాపు అందరిలోనూ నెలకొంది అని ఆమె అన్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది అనేక బాధలు పడుతున్నారని ఫైనాన్షియల్గా కొంతమంది మెంటల్ గా కొంత మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు.

    పొలిటికల్ గా

    పొలిటికల్ గా

    ఇక ఈ పరిస్థితి నుంచి నాతో పాటు అందరూ బయటపడాలని కోరుకుంటున్నట్లుగా ఆమె వెల్లడించారు.. ఇక ప్రస్తుతానికి తాను ఫేస్బుక్ సహా యూట్యూబ్ వేదికలలో యాక్టివ్ గా లేకపోయినా ఈ ఖాళీ సమయంలో యూట్యూబ్ కోసం కొన్ని వీడియోలు సిద్ధం చేశానని అవన్నీ బ్యాంకులో ఉన్నాయని చెప్పుకొచ్చారు.. ఆ వీడియో బ్యాంక్ నుంచి ఒక్కొక్కటిగా వీడియోలు విడుదల చేయడం మొదలు పెడతానని తద్వారా తన అభిమానులు ఎవరూ తనను మిస్ కాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.

    ఇక ఆ మధ్య కాలంలో శ్రీరెడ్డి ఎక్కువగా వైసీపీ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడడమే కాక వైసీపీ కి తలనొప్పిగా మారిన కొంత మంది రాజకీయ నాయకుల గురించి కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉండేవారు.

    వేదాంతం

    వేదాంతం

    అంతేకాక జగన్మోహన్ రెడ్డిని తనకు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఇవ్వాలని కూడా సోషల్ మీడియా వేదికగా ఆమె విజ్ఞప్తి చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. అయితే కత్తి మహేష్ మృతి చెందినప్పుడు కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కత్తి మహేష్ తో తనకున్న అనుబంధం గురించి పంచుకున్న ఆమె ఇప్పటికీ తన స్నేహితులను కోల్పోయారని కత్తి మహేష్ మూడోవాడు అని చెప్పుకొచ్చారు. అంతేకాక ఆయన మరణం గురించి కొంతమంది ఆనందం వ్యక్తం చేస్తున్నారని అలా చేయడం కరెక్ట్ కాదు అని కూడా ఆమె చెప్పుకొచ్చింది. అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిన వాళ్ళమే ఒకరు ముందు ఒకరి వెనుక అంటూ వేదాంతం తో సూక్తులు కూడా వల్లించింది ఈ భామ.

    English summary
    Actress Sri Reddy has not been active on Facebook for about a month. Reddy revealed sensational things about his health, that she was suffering from a serious illness.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X