Sri Reddy నీ వల్ల నా బతుకు రోడ్డు మీదకు.. ఆదుకో.. శ్రీరెడ్డి వీడియో వైరల్!

తెలుగు సినిమా పరిశ్రమలో నటిగా రాణించాలనే లక్ష్యంతో ప్రయత్నించిన యాంకర్, న్యూస్ రీడర్ శ్రీరెడ్డి తనకు జరిగిన అన్యాయాలను మీటూ ఉద్యమంతో బయట పెట్టి సంచలనం రేపారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి చెన్నైకి మకాం మార్చిన ఆమె ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తూ వస్తున్నారు.ఈ క్రమంలో మాకు నెలవారీ జీతాలు చెల్లించడం లేదంటూ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతున్నది. ఈ వీడియోలో ఆమె చెప్పిన విషయాలు ఏమిటంటే?

జగనన్నకు నమస్కారం.. మేము కొన్ని రోజులుగా ఒక నష్టాన్ని అనుభవిస్తున్నాం. మా త్యాగాలు మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడిమోను చేస్తున్నాం. మీరు అర్ధం చేసుకోవాలి. ఆంధ్రా సీఎం ఆఫీస్‌కు, ఏపీ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి ఈ సందేశం వెళ్లాలి. పార్టీలో నాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపించడానికి వారి అందరి తరఫున వైఎస్ఆర్సీపీ కోసం నేను, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు గట్టిగా పనిచేస్తునాం అని శ్రీరెడ్డి తన వీడియోలో తెలిపారు.

Actress Sri Reddys Video Clip against YSRCP goes Viral

అయితే కొంతమంది ప్రవర్తన మాకు నచ్చడం లేదు. వాళ్లు మా పొట్టకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను యూట్యూబర్‌గా ఉన్నప్పుడు ఆదాయం ఉండేది. మిమ్మల్ని, మీ పార్టీని పొగడటం మొదలుపెట్టిన తర్వాత.. మీ ఎమ్మెల్యేలు, ఎంపీల తరఫున మాట్లాడిన తర్వాత మా రిపోర్టుల కొట్టేసి మా జీవనాధారంపై దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు అని శ్రీరెడ్డి తెలిపారు.

అయినా మా ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని, మా పరిస్థితి బాగాలేదని ఏనాడు కూడా చెప్పలేదు. ఎన్ని సమస్యలు ఫేస్ చేసినా చెప్పలేదు. నా బాధ నాకు తెలుసు. మా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. అయినా మీ వద్దకు వచ్చి ఎన్నడూ చెప్పలేదు. నేను చేసిన లైవ్ వెళ్తున్నప్పుడు మీ ఎమ్మెల్సీ ఫోన్ బాగాలేదంటే.. అలాంటి ఫోన్ కొనడానికి మీ సోషల్ మీడియా వాళ్లు ఎలాంటి సాయం కూడా చేయరు అని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

Actress Sri Reddys Video Clip against YSRCP goes Viral

కానీ మీ గురించి పనిచేసే కింది స్థాయి కార్యకర్తల జీవితం దారుణంగా ఉంది. వాళ్లు మందు కోసమో.. బిర్యానీ కోసమో రారు. రేపు ఎదుటి వారి దాడుల్లో దెబ్బలు తినాలన్న వారే.. వారంతా మా పార్టీ అనుకొని పనిచేస్తున్నారు. మీ సోషల్ మీడియా వారికి రెండు, మూడు నెలలకోసారి జీతాలు వెళ్తాయి. అలాంటి వారు చాలా కష్టాలు పడుతున్నారు అని శ్రీరెడ్డి చెప్పారు.

నేను యూట్యూబర్‌గా ఉన్నప్పుడు డబ్బులు సంపాదించుకొన్నాను. కానీ కొన్ని నెలలుగా మీ కోసం నేను పనిచేస్తున్నాను. ఎప్పటి నుంచి మీ కోసం పనిచేస్తున్నాననో అప్పటి నుంచి నేను కష్టాలు పడుతున్నాను. వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న నన్ను గుర్తించలేదు. కానీ మిమ్మల్ని తిట్టే వారిని అందలాలు ఎక్కించారు అన్న. దయచేసి మాకు గుర్తింపు ఉండేలా చేయాలి. మాకు జీతాలు ఇవ్వాలని కార్యకర్తల తరఫున కోరుతున్నాను. మా కష్టాలు గుర్తించి.. రోడ్లపైకి వచ్చిన మమ్మల్ని ఆదుకోవాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేం. ఆడపిల్లల ఆవేదనకు రెస్పాండ్ కావాలి అని శ్రీరెడి ఘాటుగా స్పందించారు..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X