కేజీఎఫ్ లో హీరోతో అది చేయడానికే నేను.. తన పాత్రపై శ్రీనిధి శెట్టి హాట్ కామెంట్స్

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి తెలుగు ప్రేక్షకులకు ఎంగానో పరిచయం అయిన సంగతి తెలిసిందే. అయితే రీసెంట్ గా 'హిట్ 3' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్బంగా ప్రమోషన్స్ లో భాగంగా వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తోంది. ఈ సందర్భంగా తాజా తన మొదటి సినిమా 'కేజీఎఫ్'పై ఇలా స్పందించింది. ఆ సినిమాలో తన పాత్ర కేవలం అందుకోసమే ఉంటుందని చెప్పుకొచ్చింది.

నటిగా శ్రీనిధి శెట్టి ప్రయత్నాలు..
2012 నుంచి శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా అవకాశాల కోసం ఎదరుచూస్తూ ఉంది. అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఈ క్రమంలో బ్యూటీ కాంపిటీషన్లలో తరుచుగా పాల్గొంటూ ఉండేది. 2016లో మిస్ దివా అందాల పోటీ, అదే ఏడాది జరిగిన సుప్రనేషనల్ ఇండియా 2016 టైటిల్ ఫైనలిస్ట్ గా గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత పోలాండ్, జపాన్, యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాల్లోనూ బ్యూటీ కాంపిటీషన్లలో పాల్గొంది. తన అందం, ఫ్యాషన్ తో ఆకట్టుకుంది.

Actress Srinidhi Shetty Shocking Comments about KGF movie

తొలి చిత్రంతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా..
శ్రీనిధి శెట్టి తన మొదటి చిత్రంతోనే పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. కన్నడ సూపర్ స్టార్ యష్, డాషింగ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'కేజీఎఫ్ : ఛాప్టర్ 1'తో దేశ వ్యాప్తంగా ప్రేక్షకులను పలకరించింది. రీనా దేశాయ్ పాత్రలో నటించింది. ఆ తర్వాత వచ్చిన 'కేజీఎఫ్ : ఛాప్టర్ 2' చిత్రంలోనూ మెరిసింది. ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా గ్రాస్ వసూల్ చేసి సంచలనం సృష్టించింది. అయితే ఈ రెండు చిత్రాలు భారీ ఎత్తున సక్సెస్ అందుకున్నా.. శ్రీనిధికి మాత్రం పెద్దగా సక్సెస్ రాలేదనే అపోహలు ఉన్నాయి. ఆ సినిమాలో తన నిడివి చాలా తక్కువ ఉండటం వల్లనే ఇలా జరిగిందనే రూమర్లు కూడా ఉన్నాయి. దీనిపై తాజాగా శ్రీనిధి శెట్టి ఇలా మాట్లాడింది.

కేజీఎఫ్ లో తన పాత్ర గురించి చెబుతూ..
కన్నడ స్టార్ యష్ సరసన కేజీఎఫ్ లో నటించడం సంతోషంగానే అనిపించింది. ఆ చిత్రంలో నా పాత్ర చాలా తక్కువ సమయం ఉంటుందనే విషయం నాకు తెలుసు. ఇక ఆ మూవీలో నా పాత్ర కేవలం హీరోతో లవ్, రొమాన్స్, సాంగ్స్ కోసమే ఉంటుంది. అయినప్పటికీ ఆ సినిమాలో చేయాలని భావించాను. ఎందుకంటే ఆ సినిమా సబ్జెక్ట్ అలాంటిదని చెప్పుకొచ్చింది. ఇప్పటికీ ఆ చిత్రంలో నటించేందుకు సిద్ధంగానే ఉంటానని శ్రీనిధి చెప్పింది.

హిట్3తో మరోసారి సెన్సేషన్..
శ్రీనిధి శెట్టి తాజాగా నాని సరసన 'హిట్ : ది థర్డ్ కేస్' చిత్రంలో నటించింది. ఈ చిత్రం మే1న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ చిత్రాల్లో గ్రాండ్ గా విడుదలైంది. తొలిరోజే రూ.30 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రం తర్వాత సిద్ధూ జొన్నలగడ్డ సరసన 'తెలుసు కదా' అనే చిత్రంతో అలరించబోతోంది. మరోవైపు కన్నడలో 'కిచ్చా47'లో నటిస్తూ బిజీగా ఉంది.

More from Filmibeat

Read more about: srinidhi shetty hit 3 kgf
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X