సుజీత్ ను తక్కువ అంచనా వేసిన హీరోయిన్.. ఓజీ క్లైమాక్స్ విని ఆమెకు మైండ్ బ్లాక్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా హరి హర వీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఏపీలో పొలికల్ విక్టరీ తర్వాత వచ్చిన ఆ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేదు. కానీ పవర్ స్టార్ లైనప్ లో ఉన్న THEY CALL HIM : OG చిత్రం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ నుంచి ఇట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతూ వచ్చాయి. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో ప్రముఖ నటి శ్రియా రెడ్డి ఓజీ మూవీ క్లైమాక్స్, తన పాత్రపై స్పందించింది. అలాగే దర్శకుడు సుజీత్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
శ్రియా రెడ్డి రీసెంట్ ఇంటర్వ్యూలో ఓజీ దర్శకుడు సుజీత్, ఓజీ సినిమా స్టోరీ గురించి మాట్లాడుతూ.. 'దర్శకుడు సుజీత్ నాకు 5 నిమిషాలు స్క్రిప్ట్ చెప్పారు. అంతకంటే ముందు నాకు ఫోన్ లో స్క్రిప్ట్ చెప్పారు. నాకు ఫోన్ లో స్టోరీ నెరేషన్ చేయాలంటే కష్టంగా ఉంటుందని సుజీత్ అన్నారు. మీరు పర్మిషన్ ఇస్తే ఫేస్ టు ఫేస్ కలిసి స్క్రిప్ట్ నెరేట్ చేస్తానని అన్నారు. చెన్నైకి వస్తానంటే నేనే వద్దని చెప్పాను. ముందు నాకు ఫోన్ లో ఇంట్రో చెబితే దాంతర్వాత కలవాలా? వద్దా? అనేది డిసైడ్ అవుతానని చెప్పాను.

దాంతో దర్శకుడు సుజీత్ స్టోరీని చెప్పడం ప్రారంభించారు. కేవలం ఐదు నిమిషాల్లోనే నా పాత్రపై చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. నేను ఇంకా ఆ పాత్ర చెయాలని ఫిక్స్ అయ్యాను. కానీ సుజీత్ తో చెప్పలేదు. ఆయన కథ చెబుతూనే ఉన్నారు. 5 నిమిషాలతో మొదలైన నెరేషన్ క్లైమాక్స్ వరకు చేరింది. క్లైమాక్స్ తో మాత్రం నాకు సినిమాపై పూర్తిగా నమ్మకం వచ్చింది. ఇక వెంటనే సుజీత్ ఓకే అని చెప్పేశాను.' అని చెప్పింది. అయితే సుజీత్ కేవలం ఫోన్ లోనే నెరేషన్ ఇచ్చి ఓజీలోని కీలక పాత్రకు శ్రీయ రెడ్డిని ఫైనల్ చేయడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సుజీత్ ను గతంలో ఓ ప్రొడ్యూసర్ కూడా సినిమా అవకాశం అని బాగా తిప్పించారని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఎప్పుడైతే సాహోతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నారో ఆ తర్వాత అదే ప్రొడ్యూసర్ నుంచి కాల్ వచ్చిందంట. కానీ అప్పుడు సార్ బాగా బిజీగా ఉన్నారని చెప్పించి కౌంటర్ ఇచ్చినట్టు చెప్పారు. ఇక శ్రీయా రెడ్డి కూడా సుజీత్ ను కలిసేందుకు అవకాశం ఇవ్వకపోతే జస్ట్ ఫోన్ లోనే తన నెరేషన్ స్కిల్స్ తో మైండ్ బ్లాక్ చేశారంటూ ఆయన ఫ్యాన్స్ అంటున్నారు.
ఇక శ్రీయా రెడ్డి ఎక్కువ తమిళ చిత్రాల్లో నటించి మెప్పించింది. చివరిగా సలార్ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఆకట్టుకుంది. నెక్ట్స్ ఓజీతో అలరించబోతోంది. ఓజీ చిత్రాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2025 సెప్టెంబర్ 25న విడుదల తేదీని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. థమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











