Mahati నా కెరీర్ 43 ఏళ్లు .. 44వ సంవత్సరం మహతితో ఘనంగా.. సుహాసిని ఎమోషనల్
యువ హీరో సందీప్ మాధవ్ ప్రధాన పాత్రలో శివ ప్రసాద్ బూర్లె స్వీయ దర్శక, నిర్మాణంలో శ్రీ పద్మిని సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ 3 గా రూపొందుతున్న చిత్రం మాహతి. ప్రముఖ నటి సుహాసిని మణిరత్నం, దీప్సిక, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి చంద్రమౌళి క్లాప్ కొట్టగా, పద్మ కెమెరా స్విచాన్ చేశారు. సుహాసిని మణిరత్నం మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించారు. తొలి షాట్‌కి రాజారవీంద్ర గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ..
మహతి సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. మహతి సినిమా ముహూర్తంలో అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నా మొదటి సినిమా రిలీజై డిసెంబర్ 19 తేదీకి 43 మూడు సంవత్సరాలు అయింది. పరిశ్రమలో 44 సంవత్సరాన్ని మహతి సినిమాతో ప్రారంభిస్తున్నాను. ఇప్పటివరకూ కెరీర్లో ఎన్నో చిత్రాలు చేశాను. ఎన్నో జయాపజయాలు చూశాను. అవన్నీ గతంలోనే వదిలేశాను. కానీ ఇప్పుడు తొలి సినిమా చేస్తున్న అనుభూతితోనే ఈ చిత్రాన్ని చేస్తున్నాను అని సుహాసిని అన్నారు.

తెలుగు సినిమాలో చేయడం ఒక అలవాటుగా మారింది. కథ, పాత్ర నచ్చితేనే సినిమా చేస్తాను. మహతి కథ, నా పాత్ర చాలా నచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్, సెంటిమెంట్స్ ఉంటాయి. టైటిల్‌కి తగట్టు మహిళా ప్రాధాన్యతతో చక్కని అంశాలు ఉన్నాయి అని సుహాసిని ఆనందాన్ని పంచుకొన్నారు.
ఒక క్రైమ్ చేయడం కంటే ఆ క్రైమ్ ని చూస్తూ ఏం చేయకుండా ఊరుకోవడం ఇంకా పెద్ద క్రైమ్. అదే ఈ సినిమాకథలో ప్రధానాంశం. ఇందులో ఉండే పాత్రలని అద్భుతంగా తీర్చిదిద్దారు దర్శకుడు. చాలా మంచి టీం కలసి పని చేస్తున్నాం. టీం అందరికీ బెస్ట్ విషెస్ అని సుహాసిని తెలిపారు.
దర్శక, నిర్మాత శివ ప్రసాద్ బూర్లె మాట్లాడుతూ.. దర్శకుడిగా ఇది నా రెండో చిత్రం. నిర్మాతగా మూడోది. సుహాసిని గారికి కథ చెప్పగానే మరో మాట లేకుండా ఎప్పుడు చేస్తున్నాం అని అన్నారు. అలాగే మా హీరో సందీప్ గారు, మిగతా టీంసభ్యులంతా కథని బలంగా నమ్మారు. వాళ్ళ నమ్మకాన్ని నిలబెడతాననే నమ్మకం ఉంది అని అన్నారు.
నటీనటులు: సందీప్, సుహాసిని మణిరత్నం, దీప్సిక, అనీష్ కురువిల్లా, హర్షవర్షన్, రాజారవీంద్ర, భద్రం, కాశీ విశ్వనాథ్, సీవీఎల్ నరసింహరావు, గౌతం రాజు, కోటేశ్వరరావు తదితరులు
రచన, దర్శకత్వం: శివ ప్రసాద్ బూర్లె
బ్యానర్: శ్రీ పద్మిని
మ్యూజిక్: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫి: రాహుల్ శ్రీవాస్తవ్
కొరియోగ్రఫి: మొయిన్
పీఆర్వో: తేజస్వి సజ్జ


Click it and Unblock the Notifications











