ఆ స్టార్ హీరోయిన్‌ని పెళ్లిని సుహాసిని చెడగొట్టాలని చూసిందా? కారణం ఏమిటంటే?
సృష్టిలోని తీయని బంధం స్నేహం. సంతోషం పంచుకోవాలన్నా, నిరాశ నిస్పృహలు ఆవరించినప్పుడు భుజం తట్టి ప్రోత్సహించాలన్నా ఒక్క స్నేహితుడికే సాధ్యం. ఒకసారి స్నేహబంధం ఏర్పడితే జీవితాంతం కష్టసుఖాల్లో తోడుగా నిలబడతారు. మంచి స్నేహితుడు ఉంటే జీవితంలో ఎంతటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కోవచ్చునని పెద్దలు అంటూ ఉంటారు.
తల్లిదండ్రులను, రక్తసంబంధీకులను ఎంచుకునే అవకాశం దేవుడు మనకు ఇవ్వలేదు. కేవలం స్నేహితుడిని వెతుక్కొనే ఛాన్స్ మాత్రం మనకే అప్పగించాడు. మన జీవితానికి గమ్యాన్ని చూపించిన, వెన్నుతట్టి ప్రోత్సహించిన స్నేహితులను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. కొందరు స్నేహితులు మన మంచి కోసం ఎన్నో చెబుతారు. వినేవాళ్లు వింటారు , పట్టించుకోని వారు పక్కనబెట్టేస్తారు. కానీ ఇది స్నేహితుల మధ్య మనస్పర్ధలకు కారణమవుతుంది.
ఇదిలావుండగా.. తెలుగు గడ్డపై పుట్టకపోయినా తెలుగువారి గుండెల్లో చెరగని స్థానం సంపాదించారు సుహాసిని. తమిళ దిగ్గజ నటుడు చారుహాసన్ కుమార్తె సుహాసిని. బాబాయిలు చంద్రహాసన్, కమల్ హాసన్ అందరూ చిత్రసీమలో నటులుగా , నిర్మాతలుగా గొప్ప స్థాయిలో ఉన్నవారే. అందుకే ఆమెకు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వడం సింపుల్‌గా జరిగిపోయింది. మౌనగీతం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సుహాసినీ కొత్త జీవితాలతో తెలుగువారిని కూడా పరిచయం చేశారు.

అగ్రనటులు శోభన్ బాబు, కృష్ణ, చిరంజీవి , బాలకృష్ణల పక్కన జోడీగా నటించారు. అయితే బాలయ్య , చిరులకు మాత్రం ఆమె హిట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. హీరోయిన్‌గా చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సత్తా చాటారు. సంసారం ఒక చదరంగం, లాయర్ సుహాసినీ, స్రవంతి, గౌతమి వంటి సినిమాలతో తనలోని మరో కోణాన్ని చూపెట్టారు. దిగ్గజ దర్శకుడు మణిరత్నంను పెళ్లి చేసుకున్న సుహాసిని సినిమాలను తగ్గించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో తల్లి పాత్రలు , తన వయసు , అనుభవానికి తగ్గ క్యారెక్టర్లు వేస్తూ వస్తున్నారు.
చిత్ర పరిశ్రమలో సుహాసినీకి ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. కెరీర్ ప్రారంభం నుంచి నేటి వరకు తనతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరితోనూ ఇప్పటికీ మాట్లాడుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ ఉంటారు. స్వతహాగా సౌమ్యురాలు కావడంతో పాటు, వివాదాలకు ఆమడ దూరంలో ఉంటారు సుహాసిని . అలాంటి ఆమె ఓ హీరోయిన్, ఓ స్టార్ హీరో పెళ్లి జరగకుండా ఆపాలని ట్రై చేసిందట. ఆ హీరోయిన్ ఎవరో కాదు.. సుమలత, ఆ హీరో కన్నడ నట దిగ్గజం దివంగత అంబరీష్. వినటానికి విడ్డూరంగా అనిపించినా ఇది నిజం.
దాదాపు తనతో పాటే కెరీర్ స్టార్ట్ చేసిన సుమలతతో సుహాసిని ఎంతో స్నేహంగా ఉండేవారట. కష్టసుఖాల్లో పాలు పంచుకోవడంతో పాటు ఒకరికొకరు సలహాలు, సూచనలు ఇచ్చుకునేవారు. ఈ సమయంలో సుమలత.. రెబల్ స్టార్ అంబరీష్ తో ప్రేమలో పడ్డారు. ఈ విషయాన్ని సుహాసినికి చెప్పారు.. అంతేకాదు తాను అంబరీష్‌నే పెళ్లి చేసుకుంటానని కుండబద్దలు కొట్టారు. అది విని సుహాసిని షాక్ అయిపోయారు. అంబరీష్ ఒక రౌడీలా ఉంటాడని , నువ్వేమో సాఫ్ట్ .. మీ ఇద్దరికీ అస్సలు సెట్ కాదని .. ఆయనను పెళ్లి చేసుకోవద్దని సుమలతకు హితబోధ చేసిందట సుహాసిని

కానీ సుహాసిని మాటలను సుమలత ఏమాత్రం ఖాతరు చేయకపోగా.. అంబరీష్‌నే పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు. ఒకానొక సమయంలో సుహాసిని తనతో అన్న మాటలను అంబరీష్‌కు చెప్పారట సుమలత. ఏదో పని మీద సుహాసిని బెంగళూరు వెళ్లినపుడు.. సుమలతను చూసేందుకు వాళ్లింటికి వెళ్లిందట సుహాసిని. అప్పుడు అంబరీష్.. సుహాసినిని ఏమ్మా నేను నీకు రౌడీలా కనిపించానా, నీకు ఏం అన్యాయం చేశానని .. నా పెళ్లి చెడగొట్టడానికి యత్నించావు అని నవ్వుతూ అన్నారట. ఈ విషయాన్ని స్వయంగా సుమలత ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.


Click it and Unblock the Notifications











