సీక్రెట్‌గా హీరోయిన్ ఎంగేజ్మెంట్... పెళ్లికి రెడీ అంటూ పోస్ట్

ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోయిన్లంతా పెళ్లి బాట పడుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో హీరోయిన్ గత కొన్ని రోజులుగా తన పెళ్లి గురించి చక్కర్లు కొడుతున్న వార్తలు పై స్పందిస్తూ అసలు విషయాన్ని చెప్పేసింది.. తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన హీరోయిన్ సునయన పెళ్లికి రెడీ అంటూ తాజాగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. మరి ఈ బ్యూటీ ఎందుకు సీక్రెట్ ఎంగేజ్మెంట్ చేసుకుంది? అనే విషయంపై ఓ లుక్కేద్దాం.

సునయన పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవచ్చు. అయితే ఆమె ముఖాన్ని చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపడతారు. తెలుగులో పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. అయితే స్టార్ హీరోయిన్ గా మాత్రం పెద్దగా ఎదిగే అవకాశం దక్కలేదు. ఈ బ్యూటీ కుమార్ వర్సెస్ కుమారి అనే సినిమా ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది.

Actress Sunaina shares engagement photos

ఆ తర్వాత తెలుగులో శ్రీ విష్ణు బ్లాక్ బస్టర్ మూవీ రాజ రాజ చోరా చిత్రంలో నటించింది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ సునయనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కోలీవుడ్ పై ఫోకస్ పెట్టిన బ్యూటీ తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది.

ఇక రీసెంట్ గా ఇన్స్పెక్టర్ రిషి అనే వెబ్ సిరీస్ తో ఓటిటి ప్రేక్షకులను కూడా పలకరించి మంచి ఆదరణను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా సునయన పెళ్లి గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ బ్యూటీ ఎవరినో లవ్ చేస్తోందని, అతడినే ఎంగేజ్మెంట్ చేసుకుందని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

తన సీక్రెట్ ఎంగేజ్మెంట్ పై తాజాగా సునయన స్పందించింది. ఆ వార్తలు నిజమే అంటూ తనకు ఎంగేజ్మెంట్ జరిగింది అనే విధంగా ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో తనకు కాబోయే భర్త వేలుని పట్టుకుని ఉండగా, అందులో ఇద్దరి చేతులకి ఎంగేజ్మెంట్ రింగ్స్ కనిపిస్తున్నాయి.

ఇక ముందుగానే అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తను ఎంగేజ్మెంట్ చేసుకున్నాను అనే విషయాన్ని బయట పెట్టింది. అయితే ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. దీంతో సునయన పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరు అన్న విషయంపై ఇప్పుడు సస్పెన్స్ నెలకొంది. మరి పెళ్లికైనా కనీసం ఫోటోలు బయట పెడుతుందా లేకుంటే ఇలాగే సస్పెన్స్ లో పెడుతుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X