అలాంటి తప్పు చేయకండి.. నటి సురేఖావాణి విన్నపం!
సెలబ్రెటీలు తమ పాపులారిటీని మనీగా మార్చుకునేందుకు పలు కమర్షియల్ యాడ్స్ చేస్తూ ఉంటారు. పలు ప్రాడక్ట్స్, బిజినెస్ యాడ్స్ చేస్తూ ఉండటం సహజమే. వారికి అదే జీవానాధారం. కాగా.. మరికొందరు సెలబ్రెటీలు మాత్రం చట్టవ్యతిరేకమైన పలు యాప్స్ లను కూడా ప్రమోట్ చేస్తూ కనిపిస్తున్నారు. దీని వల్ల సెలబ్రెటీల ప్రభావంతో జనాలు పలు రకాలుగా మోసపోతూ వస్తున్నారు. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్ యాడ్స్ ఈ మధ్య బాగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాటి ద్వారా లక్షలు, కోట్లు సంపాదించవచ్చని చెబుతూ కొందరు యాప్ నిర్వాహకులు సెలబ్రెటీలతో యాడ్స్ చేయించారు.
వాటిని నమ్మిన జనాలు యాప్స్ డౌన్ లోడ్ చేసి తమ జేబును ఖాళీ చేసుకుంటున్నారు. ఇటీవల అధికారులు కూడా ఈ చర్యలపై కఠినంగా ఉంటున్నారు. ఫేక్ యాప్స్ ను ప్రమోట్ చేసినా, జనాలను మోసపుచ్చే యాడ్స్ చేసినా ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో సెలబ్రెటీలు తమచేసిన యాప్స్ ఒకవేళ ఫేక్ అయితే వాటిని నమ్మొద్దంటూ మళ్లీ వీడియోలు పెడుతూ జనాలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జబర్దస్త్ నటి రీతూ చౌదరి కూడా తన అభిమానులు, నెటిజన్లను అప్రమత్తం చేసేందుకు ఓ వీడియోను విడుదల చేసింది.

ఇన్నాళ్లు తెలిసో తెలియకో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేశాం. అందుకు అందరూ క్షమించాలని కోరింది. అలాంటి యాప్స్ ను డౌన్ లోడ్ చేయొద్దని, ఒక వేళ అప్ లోడ్ చేసి ఉంటే మాత్రం వెంటనే డిలీట్ చేసి జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఎప్పుడో గతంలో తను చేసిన బెట్టింగ్ యాప్స్ కు సంబంధించిన వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వాటిని ఎవరూ నమ్మొద్దని, ఆ యాప్స్ అన్నీ మోసపూరితమైనవి చెప్పింది. ఏ సెలబ్రెటీ చేసిన, ఇన్ ఫ్ల్యూయేనర్స్, యూట్యూబ్ స్టార్స్ అలాంటి బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసినా నమ్మొద్దని చెప్పుకొచ్చింది.
అలాగే టాలీవుడ్ ప్రముఖ నటి సురేఖ వాణి కూడా బెట్టింగ్ యాప్స్ ను వ్యతిరేకిస్తూ వీడియోను విడుదల చేసింది. బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే ప్రమాదాలపై అటు సెలబ్రెటీలకు, ఇటు జనాలకు అవగాహన కల్పించారు. ఇప్పటి వరకు సెలబ్రెటీలు తెలిసో తెలియకో ప్రమోట్ చేసిన వారందరూ ఇకపై మానుకోండని సూచించింది. ఆ యాప్స్ ను యూజ్ చేస్తున్న వారు వెంటనే డిలీట్ చేయాలని కోరింది. బోలెడంత డబ్బును కష్టపడకుండా ఇస్తున్నామని యాప్స్ నిర్వాహకులు చెబుతుంటారు. అలా మీ అకౌంట్లోకి చేరి డబ్బును ఖాళీ చేస్తారని అవగాహన కల్పించింది.
ఇప్పటికే చాలా మంది బెట్టింగ్ యాప్స్ వల్ల అప్పుల ఊబీలో కూరుకుపోయినట్టు తెలియజేసింది. సూసైడ్ కూడా చేసుకుంటున్నారని తెలిసింది. ఇకపై అలాంటి పరిస్థితులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని కోరింది. తోటి వారికి కూడా అవగాహన కల్పించాలని విన్నవించింది. బెట్టింగ్ యాప్స్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మి మోసపోకూడదని కోరింది. ఇక సురేఖ వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. తన పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, ఇలా అవేర్ నెస్ కూడా కల్పిస్తుంటారు.


Click it and Unblock the Notifications











