వాలంటైన్ పార్టీలో సురేఖ వాణి, సుప్రిత బీభత్సం.. అలాంటి డ్రస్సుల్లో తల్లికూతుళ్ల అరాచకం!
నటి సురేఖా వాణి, తన కూతురు సుప్రితతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో తెలిసిందే. అప్పుడప్పుడు ఈ తల్లి కూతుర్లు సోషల్ మీడియాలో సంచనలంగా మారుతూ ఉంటారు. తమ వ్యక్తిగత విషయాలను, వారి అభిమాలనులతో పంచుకుంటూ ఉంటారు. ఫ్యాన్స్ ను ఖుషీ చేసేందుకు బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూనే వస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం సురేఖ వాణి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆయా చిత్రాల్లో మెరుస్తూనే వస్తున్నారు. మరోవైపు కూతురు సుప్రితా హీరోయిన్ గా అవకాశాలు అందుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే వస్తోంది. ఇప్పటికే ఆయా చిత్రాల్లో నటిస్తోంది.
ఇక యంగ్ బ్యూటీ సుప్రితా తన తల్లితో కలిసి పార్టీలు చేసుకుంటూనే ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో సుప్రిత చేసే హంగామా అంతా ఇంత ఉండదు. ఆమె సోషల్ మీడియాలో అడుగుపెట్టిందంటే అభిమానులు, నెటిజన్లను ఇట్టే ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా సుప్రితా తన అభిమానులతో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. రీసెంట్ గా వాలెంటైన్స్ డే వేడుకలను తన తల్లి సుప్రితతో కలిసి చేసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది.

వాలెంటైన్స్ వేడుకను తన తల్లి సుప్రితాతో కలిసి జరుపుకున్నట్టు తాజాగా కొన్ని ఫొటోలను ఇన్ స్టా వేదికను పంచుకుంది. పార్టీలో అందాలను ఒలకబోసే డ్రసుల్లో మెరిశారు. తల్లికూతుళ్లకు ఏమాత్రం వయస్సులో తేడా లేదనేలా.. చూస్తే అక్కచెల్లెల్లానే దర్శనమిచ్చారు. మరోవైపు బీచ్ వేర్స్ లాంటి డ్రెస్ లో సుప్రితా ఫొటోలకు ఘాటుగా ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక తల్లికూతుళ్లు ఇద్దరు వాలెంటైన్స్ పార్టీ కోసం ఫుల్ మూన్ కాన్సెప్ట్‌తో సాగే ఈవెంట్ కోసం థాయ్ లాండ్‌లోని ఫుకెట్‌కు వెళ్లారు. అక్కడ అందరితో కలిసి సరదాగా గడిపినట్టు ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. ఇక సుప్రితా మాత్రం తన వాలెంటైన్స్ ను తల్లి సురేఖవాణితోనే జరుపుకున్నట్టు తెలిపింది. సురేఖ కూడా కూతురు ఫ్రీడమ్ కు ఏమాత్రం అడ్డుకాకుండా ఫ్రెండ్లీగా మెదులుతుండటం ఫొటోలను చూస్తే అర్థమవుతోంది. కానీ కొంత సోషల్ మీడియాలో వదిలే ఫొటోల దృష్ట్యానే నెటిజన్లు, వారి అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

నటిగా సురేఖ వాణి వందకు పైగా సినిమాల్లో నటించింది. తనదైన శైలిలో బిగ్ స్క్రీన్ పై మెరిసి ఆకట్టుకుంది. సిద్ధార్థ్ బొమ్మరిల్లు, ప్రభాస్ 'బుజ్జిగాడు', రెడీ, ఏ మాయ చేసావె, నమో వెంకటేశ, నేనింతే, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్, బాద్ షా, శ్రీమంతుడు, బెంగాల్ టైగర్, ద్వారక, సుప్రీమ్ వంటి చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రలు పోషించింది. తెలుగు ఆడియెన్స్ ను ఆమెకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది.
ఇక కూతురు సుప్రితను కూడా హీరోయిన్ గా పరిచయం చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. సుప్రిత కూడా హీరోయిన్ గా ప్రూవ్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గతంలో అమర్ దీప్ కు జోడీగా ఓ సినిమా ప్రారంభమైంది. ఇంకా షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవల పీలింగ్స్ విత్ సుప్రితా అనే ప్రోగ్రామ్ కు వ్యాఖ్యాత కూడా వ్యవహరించింది.


Click it and Unblock the Notifications











