ఆ కారణంతో మగాళ్లను ద్వేషించాలా? పెళ్లిపై సురేఖ వాణి కుమార్తె సుప్రిత క్లారిటీ !

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే. ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది. ఇక ఆమె కూతురు సుప్రిత (Supritha) గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరోయిన్‌గా అధికారికంగా అరంగేట్రం చేసేలోపే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఫోటోలు, రీల్స్, పర్సనల్ అప్‌డేట్స్‌తో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ డిజిటల్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టింది . అయితే.. సుప్రిత చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

నటి సుప్రిత.. ఒకవైపు హీరోయిన్‌గా కెరీర్‌ను నిర్మించుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఎలాంటి మొహమాటం లేకుండా మాట్లాడటం ఆమె ప్రత్యేకతగా చెప్పాలి. ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, బ్రేకప్, ఫెమినిజం వంటి సున్నితమైన అంశాలపై ఆమె చేసిన వ్యాఖ్యలు యువతలో చర్చకు దారితీశాయి. తాజాగా వైరల్ అవుతున్న ఓ ఇంటర్వ్యూలో సుప్రిత తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై క్లారిటీ ఇవ్వడంతో పాటు, పెళ్లిపై వస్తున్న రూమర్లకు కూడా ఫుల్‌స్టాప్ పెట్టింది.

Actress Surekha Vani daughter Supritha Breaks Silence on Love Marriage Rumors

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణి కుమార్తెగా గుర్తింపు పొందిన సుప్రిత, సోషల్ మీడియా ద్వారా లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల్లోకి రాకముందే ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, గ్లామరస్ ఫొటోషూట్లు, ట్రెండింగ్ వీడియోలతో మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. తల్లి సురేఖా వాణితో కలిసి చేసే వీడియోలు కూడా తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే సోషల్ మీడియాలో ఎంత గ్లామర్‌గా కనిపించినా, తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎమోషనల్ అనుభవాలు ఎదుర్కొన్నానని సుప్రిత చెప్పడం విశేషం.

ఇటీవల సుప్రీత ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ ఇంటర్వ్యూలో తన తల్లి సురేఖా వాణితో తనకున్న అనుబంధం గురించి వెల్లడించింది సుప్రిత, "మేమిద్దరం తల్లి కూతుళ్ల కంటే మంచి ఫ్రెండ్స్‌లా ఉంటాం. చాలా విషయాలు ఓపెన్‌గా షేర్ చేసుకుంటాం. మా మధ్య పెద్దగా గొడవలు ఉండవు. చిన్న చిన్న విషయాలపై, ముఖ్యంగా స్టైల్, ఫ్యాషన్, వంటల విషయంలో మాత్రమే సరదా వాదనలు జరుగుతుంటాయి. కానీ అవి కూడా కొద్ది నిమిషాల్లోనే ముగిసిపోతాయి" అంటూ నవ్వుతూ చెప్పింది.

అయితే అందరి దృష్టిని ఆకర్షించిన అంశం ఆమె రిలేషన్‌షిప్ గురించి చేసిన కామెంట్సే. "ప్రస్తుతం నేను సింగిల్. నా వయసు 25 సంవత్సరాలు. కానీ ఈ చిన్న వయసులోనే నేను జీవితంలో ఒక పెద్ద బ్రేకప్‌ను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఆ అనుభవం నన్ను మానసికంగా బాగా ప్రభావితం చేసింది. అందుకే ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలని అనుకోవడం లేదు. కనీసం మరో రెండేళ్లు పెళ్లి గురించి ఆలోచించే ఉద్దేశం కూడా లేదు" అంటూ స్పష్టంగా చెప్పింది. దీంతో ఆమె ప్రేమలో ఉందని, త్వరలో పెళ్లి చేసుకోబోతోందని వస్తున్న వార్తలకు చెక్ పడినట్టైంది.

ఇక ఫెమినిజం గురించి మాట్లాడిన సుప్రిత మరింత ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫెమినిజం అనే పదాన్ని కొందరు తప్పుగా ఉపయోగిస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. "ఫెమినిజం అంటే పురుషులను ద్వేషించడం కాదు. మహిళలకు అన్యాయం జరిగితే వారి తరఫున నిలబడటం, సమాన హక్కుల కోసం పోరాడటమే అసలు ఫెమినిజం. కానీ కొంతమంది మాత్రం ప్రతి విషయంలో అబ్బాయిలనే టార్గెట్ చేస్తున్నారు. అదే సరైన పద్ధతి కాదు" అని పేర్కొంది.

అంతేకాకుండా, "అబ్బాయిలు కూడా మనుషులే. వారికి కూడా భావోద్వేగాలు ఉంటాయి. వారు కూడా బాధపడతారు, ఏడుస్తారు. ప్రతి పురుషుడు తప్పు చేశాడని భావించడం సరైంది కాదు. సమానత్వం గురించి మాట్లాడేవారు ప్రతి విషయంలో సమాన దృక్పథంతో ఆలోచించాలి. అవసరం వచ్చినప్పుడు 'లేడీ కార్డ్' ఉపయోగించడం కంటే, నిజంగా న్యాయం కోసం నిలబడటమే గొప్ప విషయం" అని సుప్రిత అభిప్రాయపడింది. ప్రస్తుతం సుప్రిత చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read more about: surekha vani supritha tollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X