చిన్న వయసులోనే ప్రేమ.. ఆ తప్పు చేశానని ఒప్పుకున్న సుప్రిత
సాధారణంగా సినిమాల్లో నటించే నటీనటులకు మాత్రమే ఫాలోయింగ్ ఉంటుంది. కానీ, తెలుగు రాష్ట్రాల్లోని కొందరు ఫిల్మ్ సెలెబ్రిటీల పిల్లలకు కూడా భారీ క్రేజ్ వచ్చేసింది. అలాంటి వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కుమార్తె సుప్రిత ఒకరు. అందంతో పాటు టాలెంట్‌తో ఆకట్టుకుంటోన్న ఈ చిన్నది.. సినిమాల్లో కనిపించకున్నా సత్తా చాటుతూనే ఉంటోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫాలోయింగ్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రిత తాజాగా ఓ ఊహించని విషయాన్ని బయటపెట్టింది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!
టీనేజ్‌లోనే సెన్సేషన్
టాలీవుడ్‌కు చెందిన సురేష్ తేజ - సురేఖ వాణి కూతురిగా సుప్రిత చిన్న వయసులోనే సుపరిచితురాలు అయింది. అలా టీనేజ్‌లో ఉన్నప్పుడే ఈ అమ్మడు తనదైన రీతిలో అలరించి సత్తా చాటింది. ముఖ్యంగా యూట్యూబర్‌గా సుప్రిత ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. అలాగే, అందంతోనూ మెప్పిస్తూ ఓ రేంజ్‌లో హాట్ టాపిక్ అయింది. ఫలితంగా ఆమె పేరు సెన్సేషన్ అయింది.

యూట్యూబర్‌గా క్రేజ్
సుప్రిత 2019లోనే 'మనీ మైండెడ్ గర్ల్‌ఫ్రెండ్' అనే షార్ట్ ఫిల్మ్‌తో నటనా ప్రయాణాన్ని మొదలు పెట్టింది. ఇందులో తనదైన అందం, అభినయంతో అలరించింది. ఆ తర్వాత 'అవర్స్ వర్సెస్ అదర్స్', 'వెళ్లిపో', 'గాయత్రి పోతే పోవే' అనే కవర్ సాంగ్‌లలో మెరిసింది. ఇవన్నీ సూపర్ హిట్ అవడంతో ఇలాగే కంటిన్యూ చేస్తూ యూట్యూబర్‌గా ఫుల్ క్రేజ్ పెంచుకుంటోంది.

హీరోయిన్‌గా ఎంటర్
అందంతో మాయ చేస్తున్న సుప్రితను సినీ రంగానికి పరిచయం చేయాలని సురేఖ వాణి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆమె ఓ స్టార్ కిడ్ చేస్తోన్న చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అవబోతుందని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సుప్రిత.. అమర్‌దీప్ చౌదరి హీరోగా నటిస్తోన్న చిత్రం ద్వారా హీరోయిన్‌గా ఎంటర్ అవబోతుంది.

అక్కడ ఫుల్ యాక్టివ్
టీనేజ్‌లోనే సుప్రితకు క్రేజ్ రావడానికి సోషల్ మీడియాలో ప్రధాన కారణం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ అమ్మడు ఇందులో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తన పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను షేర్ చేసుకుంటోంది. అలాగే, ఫొటోలను, వీడియోలను కూడా వదులుతూ తరచూ వార్తల్లో నిలుస్తోంది.

అలాంటి ప్రశ్నలతో
సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉండే సుప్రిత తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో నెటిజన్లతో లైవ్ చాట్ నిర్వహించింది. ఇందులో ఆమె ఫాలోవర్లు అందరూ తమదైన రీతిలో ప్రశ్నలను అడిగారు. వీటికి సుప్రిత ఏమాత్రం ఇబ్బంది పడకుండా సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ 'మీ లైఫ్‌లో ఏ విషయంలో తప్పు చేశానని బాధపడుతున్నారు' అని ప్రశ్నించాడు.

ప్రేమలో పడ్డానంటూ
నెటిజన్ అడిగిన ప్రశ్నకు సుప్రిత ఏమాత్రం తడబాటు లేకుండా 'ప్రేమలో పడడం నేను చేసిన తప్పుగా భావిస్తున్నాను' అని సమాధానం చెప్పింది. తద్వారా తనకు గతంలో ఓ ప్రేమకథ ఉందని వెల్లడించింది. ఫలితంగా ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్‌గా మారిపోయాయి. ఇప్పుడు సుప్రిత చేసిన ఈ కామెంట్ హాట్ టాపిక్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











