డ్రగ్స్ కేసులో సురేఖవాణి?.. మరో ప్రముఖ సినీ నటి.. డ్రగ్స్ డీలర్‌తో 100కుపైగా ఫోన్ కాల్స్!
తెలుగు సినిమా పరిశ్రమను మరోసారి డ్రగ్స్ దందా కుదిపేసింది. కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరీ అరెస్ట్ తర్వాత పలువురు సినీ తారల పేర్లు బయటకు రావడంతో ఈ వ్యవహరం అత్యంత వివాదాస్పదంగా మారింది. కేపీ చౌదరీ ఫోన్ కాల్ డేటా, సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్టు చేసిన ఫోటోలు ఇప్పుడు టాలీవుడ్ సినీ తారల పీకల మీదకు తెచ్చేలా ఉంది. తాజాగా కేపీ రెడ్డి కస్టడీ రిపోర్టులో అషురెడ్డి, సురేఖవాణి, జ్యోతి పేర్లు బయటకు వచ్చాయి. కేపీ చౌదరీ కస్టడీ రిపోర్టు వివరాల్లోకి వెళితే..
గోవాలో నైట్ క్లబ్ నడిపే కేపీ చౌదరీని ఇటీవల తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి 110 గ్రాముల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకొన్నారు. అయితే ఈయన వద్ద చాలా మంది డ్రగ్స్ వినియోగదారులు ఉన్నట్టు కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నడం అత్యంత చర్చనీయాంశమైంది. దాదాపు 18 మంది ప్రముఖుల పేర్లు లీక్ అయ్యాయి.

కేపీ చౌదరీ డ్రగ్స్ వ్యవహారంలో తెలుగు సినిమా నటి సురేఖవాణి పేరు బలంగా వినిపిస్తున్నది.కేపీ రెడ్డి కాల్ డేటా పరిశీలించగా.. 100 సార్లు ఆయన సురేఖవాణితో ఫోన్‌లో సంభాషించినట్టు వెల్లడైంది. పలుపార్టీలో సురేఖవాణితో కేపీ చౌదరీ సన్నిహితంగా ఉన్న ఫోటోలు కనిపించాయి. దాంతో సురేఖవాణి పేరు ప్రముఖంగా ఈ కేసులో మారింది.
ఇక కేపీ చౌదరీ డ్రగ్స్ కేసులో మరో తెలుగు నటి జ్యోతి పేరు కూడా వినిపిస్తున్నది. కేపీ చౌదరీ కాల్ డేటాలోజ్యోతి పేరు కూడా కనిపించడంతో ఆమెను పోలీసులు విచారణకు పిలుస్తారా అనే విషయం ఆసక్తికరంగా మారింది. కేపీ చౌదరీ ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో జ్యోతి ఫోటోలు ఉండటం, పార్టీలో మునిగి తేలుతున్న విషయం స్పష్టమైంది.

డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా కేపీ చౌదరీ కాల్ లిస్టులో ఉన్న సురేఖ వాణి, జ్యోతి, అషురెడ్డితో ఏం మాట్లాడారనే విషయంపై పోలీసులు దృష్టిపెట్టారు. కేపీ చౌదరీ, సురేఖవాణి తదితర కాల్ డేటాను డీ కోడ్ చేసే పనిలో ఉన్నట్టు సమాచారం. తాజా కేపీ చౌదరీ వ్యవహరం మరోసారి సినీ పరిశ్రమను అతలాకుతలం చేస్తున్నది.


Click it and Unblock the Notifications











