యూట్యూబర్‌తో రెచ్చిపోయిన సురేఖవాణి, కూతురితో కలిసి స్టెప్పులు.. నెటిజన్లు దారుణంగా ట్రోలింగ్

సురేఖా వాణి సుప్రిత నెట్టింట్లో ఇద్దరూ చేసే రీల్ వీడియోలు ఓ రేంజ్‌లో క్లిక్ అవుతుంటాయి. ఇక వారితో పాటు ఈ సారి యూట్యూబ్ నిఖిల్ కూడా చేరిపోయాడు. ఈ ముగ్గురూ కలిసి చేసిన ఇంటర్వ్యూ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. మొదటి సారిగా సుప్రిత, సురేఖలు తమ పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఎన్నో విషయాల మీద స్పందించారు. అయితే ఈ ఇంటర్వ్యూ బిహెండ్ సీన్స్‌లో బాగానే ఎంజాయ్ చేసినట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలో వారు రీల్ వీడియోలంటూ నానా రచ్చ చేసినట్టు కనిపిస్తోంది.

తల్లీకూతుళ్లు..

తల్లీకూతుళ్లు..

సురేఖా వాణి తన కూతురు సుప్రితతో కలిసి నెట్టింట్లో, సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుంటుంది. ఈ తల్లీకూతుళ్లు ఫ్రెండ్స్‌లా కలిసి తిరుగుతుంటారు. పార్టీలు చేసుకుంటారు. పబ్బుల్లో రచ్చ చేస్తుంటారు. గోవా వెకేషన్‌లంటూ బీచ్‌లో అలా మందు కొడుతూ విహరిస్తుంటారు. బ్యాంకాక్ వెకేషన్‌లో ఈ ఇద్దరూ చేసిన హంగామా, తాగుతూ దిగిన ఫోటోలు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

సినీ ఎంట్రీ..

సినీ ఎంట్రీ..


ఇక సుప్రిత సినీ ఎంట్రీ కోసం కూడా సురేఖా వాణి బాగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది. అంతకు ముందే సుప్రితతో యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ చేయిస్తూ కెమెరా భయం పోగొట్టేలా చేస్తోన్నట్టుంది. ఇప్పటికే సుప్రిత రెండు మూడు ఆల్బమ్స్‌లో చేసినట్టు ఉంది. ఇక యాడ్స్‌లోనూ సుప్రితకు అనుభవం ఉంది. త్వరలోనే సిల్వర్ స్క్రీన్ మీదకు వస్తుందేమో చూడాలి.

యూట్యూబర్ నిఖిల్..

యూట్యూబర్ నిఖిల్..

యూట్యూబ్‌లో కాస్కో అంటూ నిఖిల్ ఫన్నీ ఇంటర్వ్యూలు చేసేవాడు. అలా యూట్యూబ్ నుంచి మెల్లిమెల్లిగా వెబ్ సిరీస్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు సినిమాల్లోనూ నటిస్తున్నట్టు కనిపిస్తోంది. వర్కవుట్లు చేస్తున్నాడు. బాడీని పెంచేశాడు. అయితే యూట్యూబ్ వీడియోలు చేయడం మాత్రం మానేయడం లేదు. యూట్యూబ్‌లో నిఖిల్‌తొ నకరాలు, నాటకాలు అంటూ ఇలా ఫన్నీ ఇంటర్వ్యూలు చేస్తుంటాడు.

తాజాగా అలా..

తాజాగా అలా..

సురేఖా వాణి, సుప్రితలతో హాట్ అండ్ బోల్డ్ ఇంటర్వ్యూను చేశాడు నిఖిల్. ఇందులోనే సురేఖా వాణి, సుప్రితలు తమ తమ బాయ్ ఫ్రెండ్‌ల గురించి హింట్లు ఇచ్చారు. ఎన్నో విషయాల మీద ఇంకా ఎంతో ఓపెన్‌గా సమాధానం ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ అంతా కూడా సాఫీగా సాగినట్టు కనిపిస్తోంది. బిహెండ్ ది సీన్స్ అన్నట్టుగా ఓ రీల్ వీడియోను కూడా చేసినట్టున్నాడు.

ఇద్దరిని పట్టుకుని..

అత్తో అత్తమ్మ కూతురో అన్నట్టుగా నిఖిల్.. సురేఖా వాణి, సుప్రితలతో కలిసి రీల్ వీడియో చేశాడు. దీని మీద నెటిజన్లు దారుణంగా కామెంట్ చేస్తున్నారు. ఎంజాయ్ పండుగో అని ఒకరు అంటే.. అత్తో అత్తమ్మ కూతురో అంటూ ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి ఈ రీల్ వీడియో మాత్రం నెట్టింట్లో బాగానే చర్చకు వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X