50 ఏళ్ల వయసులోనూ ఎఫైర్స్.. 13 మందితో డేటింగ్.. ఇంకా పెళ్లి చేసుకోని టాలీవుడ్ హీరోయిన్ ఎవరంటే?

మన చుట్టూ కొందరు ఉంటారు.. వయసు పైబడుతున్నా చెక్కు చెదరని అందంతో ఉత్సాహంగా కనిపిస్తారు. కానీ పాపం దురదృష్టం ఏంటో కానీ వాళ్లకి పెళ్లి మాత్రం కాదు. ఈ తరహా వ్యక్తులు చిత్ర పరిశ్రమలో ఎందరో. శోభన, టబు, అమీషా పటేల్, అనుష్క శెట్టి, త్రిషలు ఈ కోవకే వస్తారు. వీరిలో కొందరు 50 ప్లస్‌ను క్రాస్ చేయగా .. మిగిలిన వారు 50కి దగ్గరయ్యారు. జీవితంలో సగం కరిగిపోయినా .. తన తోటి నటీనటులు పెళ్లిళ్లు చేసుకుని జీవితంలో స్థిరపడుతున్నా వీరు మాత్రం మ్యారేజ్ లైఫ్‌కి దూరంగానే ఉంటున్నారు. అయితే ఎవరి వ్యక్తిగత కారణాలు వారికున్నాయి.

ఈ లిస్టులోకే వస్తారు సుస్మితా సేన్. మిస్ యూనివర్స్ పోటీలలో గెలిచి భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పారామె. సుస్మిత బాటలో ఎంతోమంది మోడల్స్ బ్యూటీ కాంటెస్ట్స్‌లో పాల్గొని రాణిస్తున్నారు. బెంగాలీ అమ్మాయే అయినా తెలుగు గడ్డపైనే ఆమె బాల్యం గడిచింది. తండ్రి వాయుసేనలో పనిచేస్తుండటంతో సికింద్రాబాద్‌లో సుస్మిత నివసించేది. విద్యాభ్యాసం తర్వాత మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన సుస్మితా సేన్.. 1994లో జరిగిన మిస్ యూనివర్స్ పోటీలలో విజయం సాధించారు. దీంతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సుస్మిత పేరు మారుమోగిపోయింది. ప్రఖ్యాత సంస్థలు తమ ఉత్పత్తులకు ఎండార్స్‌మెంట్ చేయమని కోరగా.. సినిమాల్లో అవకాశాలు తలుపుతట్టాయి.

actress Sushmita Sen made sensational comments on marriage

1996లో దస్తక్ అనే హిందీ చిత్రం ద్వారా సుస్మితా సేన్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. అనంతరం 1997లో నాగార్జున హీరోగా నటించిన రక్షకుడు ద్వారా టాలీవుడ్‌లోనూ ఆమె ఎంట్రీ ఇచ్చారు. చాలా తక్కువ సినిమాల్లోనే సుస్మిత నటించినప్పటికీ ఆమెకు దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉంది. చివరిసారిగా 2015లో నిర్బక్ అనే బెంగాలీ సినిమాలో సుస్మిత నటించారు. అయితే బుల్లితెరపై మాత్రం ఆమె హల్‌చల్ చేస్తూనే ఉన్నారు.

అన్నింటిలోకి కాంట్రవర్సీలు, తన ఎఫైర్స్‌తో సుస్మితా సేన్ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు. ఈ అమ్మడి ప్రేమాయణాలు వివాదానికి దారి తీస్తుంటాయి. కెరీర్‌లో ఇప్పటి వరకు దాదాపు 13 మందితో సుస్మితా సేన్ ప్రమాయణం సాగించారట. తన కంటే వయసులో పెద్ద వ్యక్తితోనూ.. చిన్నవాడితోనూ ఆమె డేటింగ్ చేసింది. అయినా ఇవేవీ సుస్మితకు కలిసి రాలేదు. ఓ హీరోతోనో, సెలబ్రెటీతోనో డేటింగ్ చేస్తుందని వార్తలు వచ్చేలోగా.. అతనికి బ్రేకప్ చెప్పి మరొకరితో రిలేన్ పెట్టుకోవడం షరా మామూలే అయిపోయింది.

actress Sushmita Sen made sensational comments on marriage

వ్యాపారవేత్త లలిత్ మోడీ, రోహ్మన్ షాల్‌, రణదీప్ హుడా, విక్రమ్ భట్, వసీం అక్రమ్, ముదస్సార్ అజీజ్, సంజయ్ నారంగ్, ఇంతియాజ్ ఖత్రి, రితిక్ భాసిన్, సబీర్ భాటియా, బంటీ సచ్‌దేవ్ తదితరులతో సుస్మితా సేన్ ప్రేమాయణం సాగించారు. ఇంతమందితో ఎఫైర్స్ పెట్టుకున్నా ఏ ఒక్కరితోనూ ఆమెకు పెళ్లి కాలేదు. ప్రతిసారి పీటల వరకు వెళ్లడం ఆగిపోవడమే జరిగింది. అయితే ఇద్దరు ఆడపిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తున్నారు. పలు సామాజిక కార్యక్రమాలలోనూ పాల్గొంటూ తన పెద్ద మనసును చాటుకున్నారు.

మరో ఏడాదిలో 50వ వసంతంలోకి అడుగుపెట్టనున్న సుస్మితా సేన్ పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తన పెద్ద కూతురు ఇప్పుడే పెళ్లి చేసుకోవద్దు.. ఇలాగే హ్యాపీగా ఉంది అని అంటుందని అందుకే వివాహం జోలికి వెళ్లడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం సుస్మితా సేన్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: sushmita sen marriage bollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X