శృంగారంలో నా కూతుళ్లు బెస్ట్.. 14 ఏళ్లకే నేనూ నేర్చుకున్నా: స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు సినిమాల్లో నటించినా నటించకున్నా చాలా మంది హీరోయిన్లు తమదైన రీతిలో మార్కును చూపిస్తూ ఓ రేంజ్‌లో హైలైట్ అవుతున్నారు. తద్వారా నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అలాంటి వారిలో మాజీ మిస్ యూనివర్శ్ సుస్మితా సేన్ ఒకరు. అప్పుడెప్పుడో తన అందంతో మైమరపించిన ఈ భామ.. ఇప్పుడు కూడా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అదే సమయంలో తనదైన వ్యవహార శైలితో హాట్ టాపిక్ అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సుస్మిత కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ఏమన్నదో మీరే చూడండి మరి!
మిస్ యూనివర్శ్‌గా సెన్సేషన్
సుస్మితా సేన్ టీనేజ్‌లోనే మోడల్‌గా తన కెరీర్‌ను ఆరంభించింది. ఆ రంగంలో తన అందాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన ఈ భామ.. ఆ తర్వాత ఎన్నో పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. ఇందులో భాగంగానే 1994లో జరిగిన మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని విజయం సాధించింది. ఆ తర్వాత మిస్ యూనివర్శ్ పోటీలకు అర్హత సాధించడంతో పాటు అక్కడ కూడా గెలిచింది.

సినిమాలకు గ్యాప్.. వాటిలోనే
మిస్ యూనివర్శ్ అయిన సుస్మితా సేన్ 1996లో 'దస్తక్' అనే హిందీ చిత్రం ద్వారా సినిమాల్లోకి వచ్చింది. అందులో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. వరుసగా అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలతోనూ కలిసి నటించి స్టార్ అయిపోయింది. 2015లో 'నిర్భాక్' తర్వాత సినిమాలకు దూరమైంది. ఈ మధ్య మాత్రం వెబ్ సిరీస్‌లను చేస్తోంది.
అలా తల్లి అయిన సుస్మితా
సుదీర్ఘమైన సినీ ప్రయాణంలో సుస్మితా సేన్ పర్సనల్ లైఫ్ విషయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. మరీ ముఖ్యంగా అప్పట్లో కొందరు హీరోలతో ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలతో సెన్సేషన్ అయింది. దీంతో ఈ మాజీ మిస్ యూనివర్శ్ పెళ్లికి సైతం దూరమైంది. కానీ, తల్లి కావాలన్న కోరికతో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వాళ్లను సొంత కూతుళ్లలా చూసుకుంటోంది.
15 ఏళ్ల చిన్నోడి.. బ్రేకప్ చెప్పి
యాభై ఏళ్లు వచ్చినా సుస్మితా సేన్ వివాహం చేసుకోలేదు. ఇన్నేళ్ల కెరీర్‌లో పబ్లిక్‌గా డేటింగ్ చేస్తున్నట్లు కూడా ఎప్పుడూ ప్రకటించలేదు. కానీ, కొన్నేళ్లుగా రొహమన్ షాల్ అనే ఈ యువ మోడల్‌తో ఆమె ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, ఏకంగా అతడిని తన ఇంట్లోనే ఉంది. అయితే, గత ఏడాదిలోనే సుస్మితా సేన్ ఆ కుర్రాడికి బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే.

నేను 14 ఏళ్లకే నేర్చుకున్నా
తాజాగా సుస్మితా సేన్ ఓ న్యూస్ ఛానెల్‌తో మాట్లాడింది. ఈ సందర్భంగా సెక్స్ ఎడ్యూకేషన్‌పై అవగాహన ముఖ్యం అని చెప్పింది. 'ప్రస్తుత సమాజంలో శృంగారం గురించి మాట్లాడితే తప్పుగా భావిస్తారు. కానీ, నేను, మా అమ్మ చిన్నప్పటి నుంచే వీటి గురించి మాట్లాడుకునే వాళ్లం. అంటే నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడే శృంగారం గురించి కొన్ని విషయాలు తెలిశాయి' అని చెప్పారు.
శృంగారంలో నా కూతుళ్లు బెస్ట్
సుస్మిత సేన్ కంటిన్యూ చేస్తూ 'లైంగిక అంశాలను నేను మా అమ్మను నిర్మొహమాటంగా అడిగేదాన్ని. తను కూడా అంతే విపులంగా చెప్పేది. అందుకే దీనిపై మాట్లాడేటప్పుడు నేను సిగ్గుపడను. ఇక నా కూతుళ్లకు శృంగారం గురించి వివరించాల్సిన పనిలేదు. ఎందుకంటే వాళ్లు ఆల్రెడీ ఇందులో పీహెచ్‌డీ చేశారు. ఇంత మెచ్యూర్‌గా ఉండడంలో వాళ్లు బెస్ట్' అని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











