ఆస్తులెమైనా అడిగిందా> నీకెందుకు అంత పొగరు.. స్టార్ హీరోయిన్‌పై నెటిజన్ల ఆగ్రహం

సినీతారలను ప్రేక్షకులు పిచ్చిగా అభిమానించే దేశం మనది. సినిమా, నటీనటులు జన జీవనంలో మమేకమైన సమాజం మనది. ఏ ఇద్దరు కలిసినా వారి మాటల సందర్భంలో ఖచ్చితంగా సినిమా ప్రస్తావన రాకుండా ఉండదు. వీకెండ్ వచ్చినా, ఇంటికి చుట్టాలొచ్చినా ఖచ్చితంగా థియేటర్‌కు వెళ్లాల్సిందే. తారలను దైవంలా భావించే అభిమానులు.. వారికి ఏకంగా గుడికట్టి పూజిస్తారు. వారి పుట్టినరోజుల నాడు పాలాభిషేకాలు, రక్తదానాలు, అన్నదానాలతో పండుగ చేస్తారు.

సినీనటుల నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఆటోగ్రాఫ్, ఓ చిన్న సెల్ఫీ. దానికే వారు కోటి రూపాయలు దొరికినంత సంబరపడిపోతారు. వాటిని జీవితాంతం పదిలంగా దాచుకుని, ఆత్మీయులకు చూపించుకుని ముచ్చటపడిపోతారు. అలాంటిది కొందరు హీరో హీరోయిన్లు .. అభిమానులను చూస్తే చిరాకుపడతారు. ఆటోగ్రాఫ్, సెల్పీలు అడిగితే ఏదో ఆస్తుల్ని అడిగినంత బిల్డప్ ఇస్తారు. మరికొందరైతే పది మందిలో వారిని దూర్భాషలాడటం, చేయి చేసుకోవడం చేస్తుంటారు.

actress Taapsee Pannu get trolled after being turned down for a selfie at public event

ఇదిలాఉండగా.. ఝమ్మందినాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన తాప్సీ పన్ను.. తన తొలి చిత్రంతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టారు. బడా హీరోలతో వరుసగా నటించే ఛాన్సులు కొట్టేసినా ఎందుకో స్టార్ డమ్ దక్కలేదు. తెలుగుతో పాటు సౌత్ లాంగ్వేజెస్‌లో నటించిన తాప్సీ.. భరతనాట్యం, స్క్వాష్‌లలో ఎక్స్‌పర్ట్. దక్షిణాదిలో మంచి అవకాశాలు వస్తున్నప్పుడే బాలీవుడ్ బాటపట్టింది. చష్మే బద్దూర్‌తో హిందీలో అడుగుపెట్టిన తాప్సీ పన్నూ.. డుంకీతో హిట్ కొట్టిన ఆమె చేతిలో ఇప్పుడు బడా ప్రాజెక్ట్‌లున్నాయి. ప్రస్తుతానికి బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిన ఆమె అక్కడ దూసుకెళ్లాలనే లక్ష్యంతో ఉంది.

విషయం ఏదైనా ముఖంపై కొట్టినట్లు మాట్లాడటం తాప్సీ స్టైల్. ఈ క్రమంలో ఎలాంటి వివాదాలు చోటు చేసుకున్నా ఐ డోంట్ కేర్ అంటారామె. సోషల్ మీడియాలోనూ యాక్టీవ్‌గా ఉండే తాప్సీ.. తన వ్యక్తిగత వివరాలు, కొత్త సినిమాల సంగతులను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తాప్సీ ఓ వివాదంలో ఇరుక్కున్నారు. అక్షయ్ కుమార్‌తో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఖేల్ ఖేల్ మే .. ఆడియో రిలీజ్ కార్యక్రమం ముంబైలో జరిగింది. ఈ ఈవెంట్‌కు కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌ను కూడా ఆహ్వానించారు మేకర్స్.

actress Taapsee Pannu get trolled after being turned down for a selfie at public event

ఈ నేపథ్యంలోనే వేదికపైకి వచ్చిన అనన్య ద్వివేది అనే ఓ యువతి తాప్సీ వద్దకు వెళ్లి సెల్ఫీ కోరగా.. ఆమె నిరాకరించింది. అప్పటికే మీడియా కెమెరాలన్నీ తాప్సీ వైపే ఉండటంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత పొగరు పనికిరాదని.. ఆస్తులేమైనా రాసివ్వమన్నట్లుగా ఎందుకంత ఉలికిపాటు అంటూ విమర్శిస్తున్నారు. ఈ వివాదంపై స్వయంగా అనన్య స్పందించింది. ఈవెంట్‌లో చాలా కెమెరాలు తాప్సీని వీడియో, ఫోటోలు తీస్తున్నప్పటికీ తనను సెల్ఫీ తీసుకోవద్దని ఆమె ఎందుకు చెప్పిందో అర్ధం కావడం లేదన్నారు. తాప్సీకి మంచి పీఆర్ శిక్షణ అవసరమని ఆమె కామెంట్ చేశారు. దీనిపై అన్ని వైపుల నుంచి వివాదం వస్తున్న నేపథ్యంలో తాప్సీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X