నా భర్త నన్ను దుబాయ్‌లో అమ్మేస్తాడని భయపడ్డా..స్టార్ హీరోయిన్ భయానక అనుభవం
ఝమ్మందినాదం సినిమాతో తెలుగువారికి పరిచయమైన తాప్సీ పన్ను.. తన తొలి చిత్రంతోనే కుర్రకారుకు గిలిగింతలు పెట్టారు. ప్రభాస్ , వెంకటేష్, రవితేజ వంటి బడా హీరోలతో నటించే ఛాన్సులు కొట్టేసినా ఈ ముద్దుగుమ్మకు ఎందుకో స్టార్ డమ్ దక్కలేదు. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో నటించిన తాప్సీ.. భరతనాట్యం, స్క్వాష్ క్రీడలలో ఎక్స్‌పర్ట్. సౌత్‌లో కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే హిందీ ఇండస్ట్రీ బాట పట్టారు. చష్మే బద్దూర్‌తో హిందీలో అడుగుపెట్టిన తాప్సీ పన్నూ.. డుంకీతో హిట్ కొట్టిన ఆమె చేతిలో క్రేజీ ప్రాజెక్ట్‌లున్నాయి. ప్రస్తుతానికి బాలీవుడ్‌పైనే ఫోకస్ పెట్టిన ఆమె బీటౌన్‌లో జెండా పాతాలని లక్ష్యంతో ఉంది.
అక్షయ్ కుమార్‌తో ఆమె నటిస్తున్న తాజా చిత్రం ఖేల్ ఖేల్ మే .. ఆడియో రిలీజ్ కార్యక్రమం సందర్భంగా తాప్సీ ఓ వివాదంలో చిక్కుకున్నారు. వేదికపైకి వచ్చిన అనన్య ద్వివేది అనే ఓ యువతి తాప్సీ వద్దకు వెళ్లి సెల్ఫీ కోరగా.. ఆమె నిరాకరించింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావటంతో నెటిజన్లు తాప్సీపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంత పొగరు పనికిరాదని.. ఆస్తులేమైనా రాసివ్వమన్నట్లుగా ఎందుకంత ఉలికిపాటు అంటూ విమర్శిస్తున్నారు. తాప్సీకి మంచి పీఆర్ శిక్షణ అవసరమంటూ అనన్య కామెంట్ చేశారు.

డెన్మార్క్‌కు చెందిన బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయ్‌తో సుదీర్ఘకాలంగా డేటింగ్‌లో తాప్సీ.. ఈ ఏడాది మార్చిలో అతనితో పెళ్లిపీటలెక్కింది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో వీరిద్దరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. అయితే నేటి వరకు వీరి పెళ్లి ఫోటోలు, వీడియోలు బయటకు రాలేదంటే.. తాప్సీ ఎంత గోప్యత పాటిస్తుందో అర్ధం చేసుకోవచ్చు. మథియాస్ గత కొంతకాలంగా భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు సాత్విక్- చిరాగ్‌లకు కోచ్‌గా వ్యవహరిస్తున్నారు.
తాప్సీ నటించిన లేటెస్ట్ మూవీ ఫిర్ ఆయీ హసీనా దిల్‌రుబా.. హసీనా దిల్‌రుబాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న తాప్సీ .. తన ప్రేమ, పెళ్లి , మూవీస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మథియాస్ తనకు ప్రపోజ్ చేసినప్పుడు తనకు అతనిపై ఎన్నో డౌట్లు వచ్చాయని, అతను ప్యూర్ వైట్‌గా ఉంటాదు.. మరి నన్నెందుకు ఇష్టపడుతున్నాడని ఆలోచించానని తాప్సీ తెలిపారు.

మథియాస్‌కు డెన్మార్క్, దుబాయ్‌లు మాత్రమే బాగా తెలిసిన ప్రాంతాలు కావడంతో ఫస్ట్ డేట్ కోసం దుబాయ్‌కి వెళ్దామని తనతో చెప్పగా.. నా ఫ్రెండ్స్ భయపెట్టారని.. అతను నిన్ను దుబాయ్‌లో ఎవరికైనా అమ్మేస్తారని హెచ్చరించారని తెలిపింది. అంతేకాదు.. నా ఫ్రెండ్ వల్ల సిస్టర్ దుబాయ్‌లో సెటిలవ్వడంతో ఆమె ఫోన్ నెంబర్‌ను ఇచ్చి.. ఏదైనా అవసరమైతే తనను కాంటాక్ట్ అవ్వమని చెప్పారని తాప్సీ గుర్తుచేసుకున్నారు. తాము ఒకరి అభిప్రాయాలను ఒకరం గౌరవించుకుంటామని, జీవితాంతం కలిసి ఉండగలమని నమ్మకం వచ్చాకే .. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టామని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాప్సీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











