ఆ ఒక్క పనికే మగాడి అవసరం... స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
భారతీయ చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాట్స్‌మెన్ల లిస్ట్ తీస్తే ఖచ్చితంగా కనిపించే పేర్లు ఉన్నాయి. వారిలో హీరోయిన్ టబు కూడా ఒకరు. దక్షిణాది నుంచి వెళ్లి బాలీవుడ్‌లో జెండా పాతిన హీరోయిన్‌లలో టబు కూడా ఒకరు. మూడు దశాబ్థాలుగా తన అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తారు. 50 క్రాస్ చేసి చాలా కాలమే అవుతుండగా... ఇప్పటి వరకు ఆమె పెళ్లి మాటలు ఎత్తడం లేదు. తాజాగా పెళ్లిపై టబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
టబు అచ్చ తెలుగు అమ్మాయి. హైదరాబాద్‌కు చెందిన ఈ ముద్దుగుమ్మ అసలు పేరు తబుస్సమ్ హష్మీ. బాలీవుడ్ దిగ్గజ నటి షబానా అజ్మీకి టబు స్వయానా మేనకోడలు. సినిమాలపై ఆసక్తితో చిన్నప్పుడే ముంబై చేరుకుని అవకాశాల కోసం ప్రయత్నించారు టబు. తొలుత బజార్ అనే హిందీ సినిమాతో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు .. అనంతరం హమ్ నే జవాన్‌లో నటనతో మంచి పేరు తెచ్చుకున్నారు టబు.

అనంతరం దర్శకేంద్రుడు కే . రాఘవేంద్రరావు దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన కూలీ నెంబర్ 1తో తెలుగు ప్రేక్షకులను పలకరించారు టబు. ఈ సినిమాలో తన అందం, నటనతో అప్పట్లో కుర్రాళ్లకు నిద్రలేకుండా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత నిన్నేపెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే, చెన్నకేశవరెడ్డి, అందరివాడు, షాక్, ఇది సంగతీ, పాండురంగడు వంటి తెలుగు చిత్రాల్లో నటించిన టబు.. ఆపై పూర్తిగా బాలీవుడ్‌పైనే ఫోకస్ చేశారు. హిందీలో అగ్రనటుల సరసన నటించి స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు.
మూడున్నర దశాబ్ధాల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, మరాఠీలతో పాటు ఇంగ్లీష్‌లోనూ టబు నటించారు. రెండు సార్లు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారంతో పాటు సినీరంగానికి అందించిన సేవలకు గాను 2011లో టబును భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డ్‌తో సత్కరించింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారిన టబు.. హిందీలో భూత్ బంగ్లా, తెలుగులో విజయ్ సేతుపతి మూవీలో నటిస్తున్నారు.
అందరు హీరోయిన్ల మాదిరిగానే టబు కూడా పలువురు స్టార్స్‌తో ప్రేమాయణం సాగించినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూసింది. సంజయ్ కపూర్, సాజిద్ నదియాడ్‌వాలా, అక్కినేని నాగార్జున, అజయ్ దేవగణ్‌లతో డేటింగ్ చేసినట్లు ఇప్పటికీ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా తన పెళ్లిపై టబు సంచలన వ్యాఖ్యలు చేశారు. 52 ఏళ్ల వయసొచ్చినా ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని ఓ ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నించగా టబు బోల్డ్ కామెంట్స్ చేశారు.
సింగిల్ లైఫ్ అనేది లేబుల్ కాదు.. రిలేషన్‌షిప్ స్టేటస్‌తో సంబంధం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు. ఒంటరిగా ఉండి ఒంటరితనాన్ని అనుభవించొచ్చు.. కానీ తప్పుడు వ్యక్తిని ఎంపిక చేసుకుని జీవితాంతం బాధపడొద్దు. నా ఫ్రీడమ్ నాకు ముఖ్యం... నా స్పేస్‌ని, నా వృత్తిని గౌరవిస్తాను. నా జీవితాన్ని నేను ఎంతో కష్టపడి నిర్మించుకున్నాను.. నాకు ఎవరి సాయం అవసరం లేదు. సింగిల్‌గా ఉండటం నా ఎంపిక.. మగాడితో కేవలం బెడ్ మీద మాత్రమే నాకు అవసరం లేదు. అంతకుమించి ఉపయోగం లేదు అని టబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











