బాయ్‌ఫ్రెండ్‌తో నడిరోడ్డులో దొరికిపోయిన తమన్నా.. మీడియా కంటికి చిక్కకుండా సైలెంట్‌గా అలా జంప్!
మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగుతో పాటు తమిళ్, హిందీ చిత్రాల్లో నటిస్తూ... నటిగా, మోడల్ గా, నృత్య కారిణిగా కూడా మంచి గుర్తింపు పొందింది. 2005లో చాంద్ సా రోషన్ చెహ్రా సినిమాతో సినీ రంగంలో అడుగు పెట్టిన ఈమె.. ఇప్పటికీ టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఫుల్లుగా షికార్లు చేస్తోంది. రీసెంట్ గా అమ్మడు ఒక రోడ్డుపై బాయ్ ఫ్రెండ్ కారు ఎక్కుతూ కనిపించింది. ఇక అప్పుడే మీడియా ఆమెను ఎక్కువగా ఫోకస్ చేసేందుకు ప్రయత్నం చేయగా అక్కడి నుంచి జారుకుంది. ఆ వివరాల్లోకి వెళితే...
తమన్నా.. స్పెషల్ స్టార్ ఇమేజ్: గ్లామరస్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 20 ఏళ్లు కావస్తోంది. ఇక ఇన్నేళ్లలో ఆమె దాదాపు సౌత్ ఇండస్ట్రీలో చాలామంది అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా ఆమె స్పెషల్ ఐటెం సాంగ్స్ తో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. అలాగే ఓటిటి ఫ్లాట్ ఫామ్ లలో కూడా కొన్ని స్పెషల్ మూవీస్ చేసింది. రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా అయితే ఇప్పుడు ఆమె ఎక్కువగా ప్రయోగాలు చేస్తోంది.

తమన్నా ప్రేమలో పడిందా? : అయితే బాలీవుడ్ స్టార్ హీరో విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో పడినట్లు విపరీతమైన ప్రచారం కొనసాగుతోంది. రెగ్యులర్ గా తమన్నా బాలీవుడ్ నైట్ పార్టీల్లో విజయ్ వర్మతో కలిసి కనిపిస్తుంది. అలాగే ఎక్కడికి వెళ్లినా కూడా అతనితోనే కలిసి వెళ్తుంది. ఈ క్రమంలోనే విజయ్ వర్మతో తమన్నా పీకల్లోతు ప్రేమలో ఉందని టాక్.
వాలైంటైన్స్ డే సందర్భంగా : ఆ మధ్య వాలైంటైన్స్ డే సందర్భంగా విజయ్ వర్మ ఒక చెయ్యిని పోస్ట్ చేసి తన లవ్ ని తెలియజేశారు. ఆ చెయ్యి చూసిన తర్వాత అందరూ అది తమన్నా చెయ్యేనని ఫిక్స్ అయిపోయారు. కానీ ఈ వార్తలపై అటు తమన్నా కానీ ఇటు విజయ్ కానీ స్పందించలేదు. నిజంగానే వారు రిలేషన్ షిప్ లో ఉన్నారా లేదా పుకార్లు వస్తున్నాయా అనేది ఇప్పటికీ ఎవరికీ అర్థం కావట్లేదు. కానీ తాజాగా వీరిద్దరూ కలిసి మరోసారి మీడియా కంట పడ్డారు.

మీడియా కంట పడిన తమన్నా : తాజాగా వీరిద్దరూ ముంబైలోని ఓ రెస్టారెంట్ కు వెళ్లారు. సోమవారం రోజు అక్కడి నుంచి తిరిగి వస్తుండగా మీడియా గుర్తించింది. నడి రోడ్డుపై వారిద్దరినీ తమ కెమెరాల్లో బంధించారు. మిల్క్ బ్యూటీ మొదట మీడియాకు హాయ్ చెప్పారు. వీరిద్దరూ కలిసి తరచుగా కనిపిస్తుండడంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వస్తున్నాయి.
అప్పుడే ప్రేమ స్టార్ట్ అయ్యిందా? : అయితే వీరిద్దరూ తమ రిలేషన్ గురించి ఓ క్లారిటీ ఇస్తే బాగుటుందని అటు తమన్నా, ఇటు విజయ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లో రూపొందించిన లవ్ స్టోరీస్ అనే వెబ్ సిరీస్ రెండో సీజన్ లో వీరిద్దరూ నటించారు. ఆ వెబ్ సిరీస్ చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని.. అది కాస్తా ప్రేమగా మారిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











