తమన్నా హాట్ కామెంట్: పెళ్లిలో సంతోషం ఉందా? పవన్ కళ్యాణ్, సైరాతో పాత్ర గురించి!

By Bojja Kumar

Recommended Video

Actress Tamanna Talks About Her Marriage

టాలీవుడ్ హీరోయిన్ తమన్నా హ్యాపీ మొబైల్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా మీడియాతో సమావేశమైన మిల్కీ బ్యూటీ తన కెరీర్ గురించి, సినిమాల గురించి పెళ్లి గురించి, ఇతర అంశాల గురించిన ప్రశ్నలు ఎదురవ్వగా తనదైన శైలిలో రియాక్ట్ అయింది. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నారా? అంటూ ఎదురు ప్రశ్నించింది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి, సైరాలో తన పాత్ర గురించి ఆమె స్పందించారు.

ఇది ఫెయిర్ క్వశ్చన్ కాదు...

ఇది ఫెయిర్ క్వశ్చన్ కాదు...

మీ ఫేవరెట్ హీరో ఎవరు? అనే ప్రశ్నకు తమన్నా స్పందిస్తూ... ఇది అన్‌ఫెయిర్ క్వశ్చన్... ప్రభాస్, రానా, చరణ్, నేను అ పని చేసిన అందరూ నాకు ఇష్టమే. చాలా మంది మంచి వారిలో కలిసి పని చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

 పవన్ కళ్యాణ్ ఈ లెవల్‌కి వచ్చినా...

పవన్ కళ్యాణ్ ఈ లెవల్‌కి వచ్చినా...

‘కెమెరామెన్ గంగతో రాంబాబు'లో కదా... ఆయన్ను తర్వాత ఎప్పుడైనా కలిశారా? అనే ప్రశ్నకు తమన్నా రియాక్ట్ అవుతూ ‘పవన్ కళ్యాణ్ గారిని ఆ సినిమా తర్వాత ఎయిర్ పోర్టులో రెండు మూడు సార్లు కలిశాను. చాలా హంబుల్ పర్సన్. ఎప్పుడు కలిసినా చాలా సింపుల్ గా ఉంటారు. ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా... ఇంత లెవల్ రీచ్ అయినా ఆయన సింప్లిసిటీ వదులుకోలేదు. ఈ విషయంలో ఆయన నాకు పెద్ద ఇన్స్‌స్పిరేషన్' అన్నారు.

తెలిస్తే సపోర్ట్ చేసేదాన్ని

తెలిస్తే సపోర్ట్ చేసేదాన్ని

జనసేన పార్టీ పెట్టారు కదా...పవన్ కళ్యాణ్‌కు సపోర్ట్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు రియాక్ట్ అవుతూ... నాకు పాలిటిక్స్ గురించి అస్సలు ఏమీ తెలియదు. కొంచెం తెలిసినా సపోర్ట్ చేసేదాన్ని, పవన్ కళ్యాణ్ గారు ఏ పని చేసినా నా తరుపు నుండి బెస్ట్ విషెస్ ఎప్పుడూ ఉంటాయని తమన్నా తెలిపారు.

సైరాలో పాత్ర గురించి

సైరాలో పాత్ర గురించి

సైరాలో చాలా ముఖ్యమైన పాత్ర చేస్తున్నాను. గతంలో సూరి సర్‌తో ఊసరవెల్లి సినిమా చేశాను. సైరాలో చిరంజీవి గారితో పని చేయడం సంతోషంగా ఉంది. నేను ఈ సినిమాలో చేసే పాత్ర ఎవరూ మరిచిపోలేరు. బాహుబలిలో నేను చేసిన పాత్రకు ఎంత మంచి పేరొచ్చిందో సైరాలో చేసే పాత్రకు కూడా మంచి గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉందన్నారు.

మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారా?

మీరు పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారా?

మీ పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నపై రియాక్ట్ అవుతూ... నా పెళ్లి గురించి మీకెందుకండీ. మీకు పెళ్లయిందా? మీరు హ్యాపీగా ఉన్నారా? నా పెళ్లి గురించి వార్తలు ఇంటర్నెట్లో చాలా చూస్తున్నాను. నాకు అతడితో పెళ్ల అవుతుంది, ఇతడితో పెళ్లి అవుతుంది అని రాస్తున్నారు. చూసి ఆశ్చర్య పోతున్నారు. ఇతర హీరోయిన్లకు మంచి హస్బెండ్ దొరికాడు కాబట్టి త్వరగా పెళ్లయింది. అందరికీ అలా దొరకాలి కదా... మీ అందరి ఆశీస్సులతో నాకు మంచి హస్పెండ్ దొరుకుతాడని ఆశిస్తున్నాను. నేను ఇపుడు నా పనులతో చాలా బిజీగా ఉన్నాను. ఇంటర్నెట్లో ఇలాంటివి చూసి మీరు ఇన్‌ఫ్లూయెన్స్ అవక్వకండి... అంటూ తమన్నా కౌంటర్ ఇచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X