విజయ్‌తో ప్రేమయాణంపై తొలిసారి నోరు విప్పిన తమన్నా.. ఆర్గానిక్ బంధం అంటూ!
తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి ఇంట్రడక్షన్ అవసరం లేని మిల్క్ బ్యూటి తమన్నా. ఎంతో కాలంగా సినిమాల్లో తనదైన శైలీలో సత్తా చాటుతూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ. తెలుగు, తమిళం, హిందీ చిత్రాల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ ఇప్పటికీ హవా కొనసాగిస్తోంది. ఇక ఈ మధ్య ముద్దుగుమ్మ తమన్నా హైదరబాదీ నటుడు విజయ్ వర్మతో డేటింగ్, ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి. అయితే ఈ వార్తలపై తాజాగా తమన్నా క్లారిటీ ఇచ్చేసింది. విజయ్ వర్మతో రిలేషన్ గురించి తమన్నా ఏం మాట్లాడిందనే వివరాల్లోకి వెళితే..
వరుసగా చిత్రాలు:పంజాబీ భామ తమన్నాను తెలుగు ప్రేక్షకులు మిల్కీ బ్యూటి అని పిలుచుకుంటారు. శ్రీ మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన సుందరాంగీ ఇండస్ట్రీకి వచ్చి సుమారు 18 ఏళ్లు కావస్తుంది. ఈ సినీ కెరీర్ లో ఎన్నో చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వరుసగా చిత్రాలతోపాటు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో కూడా సందడి చేస్తుంటుంది.

2 వెబ్ సిరీసులు:ఇప్పుడు త్వరలో చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే బోలే చూడియా, బాంద్రా వంటి హిందీ చిత్రాలు చేస్తోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ తో జైలర్ మూవీలోను ఆకట్టుకోనుంది ఈ మిల్కీ బ్యూటి. ఇవే కాకుండా ఓటీటీ సిరీసులతో అట్రాక్ట్ చేయనుంది. లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా వెబ్ సిరీసులతో డిజిటల్ ప్లాట్ ఫామ్ పై పలకరించనుంది.

కో యాక్టర్ అని కాదు:ఇక ఈ ముద్దుగుమ్మగు బాలీవుడ్ యాక్టర్ విజయ్ వర్మతో డేటింగ్ నడుస్తోందని వార్తలు ఊపందుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా వారి రిలేషన్ పై క్లారిటీ ఇచ్చేసింది తమన్నా. "నేను విజయ్ వర్మతో ఎంతో చనువుగా ఉంటున్నాను అంటే దానికి కారణం అతను కేవలం నా కో యాక్టర్ అనే కాదు. మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉంది" అని తమన్నా తెలిపింది.

తోడుగా ఉంటాడు:"ఎవరినైనా ప్రేమించాలంటే వాళ్లతో ఉంటే మనం సంతోషంగా ఉంటామనే భావన మనకు కలగాలి. విజయ్ వర్మతో ఉంటే నాకు అలాగే అనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఎంతోమంది హీరోలతో కలిసి నటించాను. వాళ్లందరి కంటే నాకు విజయ్ ప్రత్యేకమైన వ్యక్తి. అతను నన్ను ఎప్పటికీ జాగ్రత్తగా చూసుకుంటాడని, నాకు కష్టం వస్తే నాతోనే ఉంటాడనే నమ్మకం ఉంది" అని మిల్కీ బ్యూటి తమ్ము పేర్కొంది.

నన్ను రక్షిస్తాడు:"ఏ రంగంలోనైనా ముఖ్యంగా సినీ పరిశ్రమలో మనం ఎదుగుతున్నామంటే కిందకు లాగేందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటి వాళ్ల నుంచి విజయ్ నన్ను రక్షిస్తాడు. నాకోసం నేను ఒక అందమైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను. అందులోకి నన్ను నన్నుగా అర్థం చేసుకునే విజయ్ వచ్చాడు. అతడు నాపై ఎంతో శ్రద్ధ వహిస్తాడు. అతడు ఎక్కడుంటే అక్కడే నా సంతోషం ఉంది. మా ఇద్దరి మధ్య మంచి ఆర్గానిక్ బంధం ఉంది" అని తమన్నా చెప్పుకొచ్చింది.

తెలుగు చిత్రంలో విజయ్:కాగా లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీసులో తమన్నాతోపాటు విజయ్ వర్మ కూడా నటించాడు. ఈ సెట్ లోనే వీరి ప్రేమాయణం పురుడు పోసుకుందని అంటారు. ఈ సిరీస్ జూన్ 29 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక హైదరాబాద్ కు చెందిన విజయ్ వర్మ.. నాని ఎంసీఏ మూవీలో విలన్ గా చేశాడు. అలియా భట్ డార్లింగ్స్ లో సైకో భర్తగా, దహాద్ సిరీసులో సైకో కిల్లర్ గా అదరగొట్టాడు. మీర్జాపూర్ 2, షీ వెబ్ సిరీసులతోనూ పాపులర్ అయ్యాడు.


Click it and Unblock the Notifications











