Tamannaah: గతంలో కంటే ఘాటైన బికినీలో తమన్నా దర్శనం.. ఆ మిల్కీ అందాలు చూస్తే స్టన్ అవ్వాల్సిందే
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. చాలా ఏళ్ళ క్రితమే టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. తక్కువ కాలంలోనే స్టార్ హీరోలతో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. వరుస సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుని... ప్రేక్షకులను అలరించింది. ఇక అప్పుడప్పుడు గ్లామరస్ ఫొటోస్ షూట్స్ తో కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇక రీసెంట్ గా అమ్మడు స్టన్ అయ్యేలా గ్లామర్ తో షాక్ ఇచ్చింది. ఇక ఆ అందాల ఫొటోల వివరాల్లోకి వెళితే..
కాస్త జోరు తగ్గింది: ముందుగా తమన్నా సినిమాల విషయానికి వస్తే... గతంలో కంటే కాస్త జోరు తగ్గినట్టుగా కనిపిస్తోంది. ఆమెకి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదని సినీ వర్గాల టాక్. గతంలో ఒప్పుకున్న సినిమాలే చేస్తున్న ఆమె... కొత్తగా మరే సినిమాని ప్రకటించలేదు. అయితే తమిళంలో సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించబోతుందని సమాచారం.

మెగాస్టార్ కాంబో : జైలర్ చిత్రంలో ఈ బ్యూటీని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఇక తెలుగులో చిరంజీవితో కలిసి బోళా శంకర్ సినిమాలో నటిస్తోంది. చిరంజీవితో తమన్నాకు రెండో సినిమా. ఇంతకు ముందు సైరా నరసింహ రెడ్డి సినిమాలో నటించింది. ఇప్పుడు భోళా శంకర్ సినిమాతో మరోసారి నటించబోతుంది. అలాగే మరికొన్ని హిందీ సినిమాలు కూడా చేస్తున్నట్లు టాక్ అయితే వస్తోంది.
స్పెషల్ పాత్రలతో : అయితే తమన్నకు సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా కూడా ఆమె రేంజ్ మాత్రం అస్సలు తగ్గడం లేదు. అలాగే మరోవైపు స్పెషల్ పాత్రలతో కూడా మెప్పించే ప్రయత్నం చేస్తుంది. కేవలం హీరోయిన్ గానే కాకుండా సినిమాలో మంచి కంటెంట్ ఉంటే గెస్ట్ పాత్రలు చేయడానికి కూడా ఒప్పుకుంటుంది. అలాగే స్పెషల్ సాంగ్స్ తో కూడా మంచి ఆదాయాన్ని అందుకుంటున్న ఈ భామ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కూడా ప్రత్యేకమైన ఫోటోషూట్స్ తో తన రేంజ్ ను పెంచుకుంటుంది.
మరోసారి బికినీలో షాకింగ్ లుక్ : ఇక సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉండే ఈ భామ... తన అందాలతో కుర్రకారును గట్టిగానే తిప్పుకుంటుంది. ఈ మధ్య అయితే ఘాటు రేపే అందాలతో మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా సెంటోసా కవర్ పేజ్ పై తమన్నా మెరిసింది. ఈ ఫోటో షూట్ తమన్నా బికీనీలో అందాల విందు చేసింది. ఈ డ్రెస్‌లో అదిరిపోయే షేపులు చూపించింది. దీంతో హాట్ టాపిక్‌గా మారింది. ఇందులో తమన్నా వొంపులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి.

హాట్ ట్రీట్ ఇచ్చేసింది : సముద్రపు ఒడ్డున నడుస్తూ... బికినీ డ్రెస్ కనిపిస్తూ... కుర్రకారుకు హాట్ ట్రీట్ ఇచ్చేసింది. వొంపులు తిరిగిన నడుముతో మతిపోగొడుతుందనే చెప్పాలి. తీరం వొడ్డున వాక్ చేస్తూ చూపురులకు మైండ్ బ్లాక్ చేస్తుంది. తన మత్తైన చూపులతో.. సమ్మర్ లో ఇంకా చెమటలు పట్టిస్తుంది. ఓవరాల్‌గా ఇప్పుడు నెట్టింట ఈ ఫోటో వైరల్ గా మారింది. ఈ ఫోటోను చూసిన నెటిజన్లు హార్ట్ సింబల్స్ తో ప్రేమను వ్యక్త పరుస్తున్నారు. కొంత మంది సూపర్ గా ఉన్నావ్ తమన్నా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











